వట్టికోట ఆళ్వారుస్వామి (1915 -1961) తెలంగాణ వైతాళికులలో ఒకరు, విభిన్న జీవనరంగాలలో అపారమైన కృషిచేసి నలభై ఆరు సంవత్సరాల జీవితకాలంలోనే అసాధారణ విజయాలు సాధించిన మేధావి, ప్రజల మనిషి.       

కథ, నవల, విమర్శ, నాటకం, కవిత్వం, ఉపన్యాసం వంటి సాహిత్య ప్రక్రియలన్నిటిలోనూ  ఆళ్వారుస్వామి ప్రవేశించారు. కొన్ని ప్రక్రియలలో చెప్పుకోదగిన ఫలితాలు సాధించారు. స్టేట్ కాంగ్రెస్ , ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ, అభ్యుదయ రచయితల సంఘం, అల్ హైద్రాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ , గుమాస్తాల సంఘం, రిక్షా కార్మికుల సంఘం, గ్రంథాలయోద్యమం, పత్రికా రచన, పత్రికా నిర్వహణ, సూచీ గ్రంథాలయ నిర్వహణ, తొట్ట తొలి పౌరహక్కుల పరిరక్షణ ప్రయత్నాలు, పరిశోధన, ప్రచురణలు - వెనుకబడిన తెలంగాణలో ఇరవయ్యో శతాబ్దపు తొలి అర్థభాగంలో ఇన్ని రంగాలలోనూ అరుదైన కృషి చేసారు.

ఒక దశాబ్దంగా తిరిగి వికసిస్తున్న, మూలాల అన్వేషణ సాగిస్తున్న తెలంగాణ జాతీయ, సాంస్కృతిక ఆకాంక్షల నేపథ్యంలో ఈ తెలంగాణ వైతాళికుడి స్మృతికి సముచిత ప్రాధాన్యత ఉంది. ఆ వైతాళికుడి స్మృతిలో ప్రజాకళ, సగర్వ వారసత్వ శీర్షిక కిం‌ద వచ్చే సంచిక నుం‌చి వట్టికోట ఆళ్వార్ స్వామి తొలి నవల ‘ప్రజల మనిషి’ని సీరియల్ గా సమర్పిం‌చబోతున్నది.

2 అభిప్రాయాలు

  1. aitham ravindra 11 ఫిబ్రవరి 2007 , 2:58 am

    ఒక గొప్ప ప్రజల మనిషి గురించి పరిచయము చెస్తున్నందుకు, మీకు ధన్యవాదములు, ఈతరము వాల్లు తప్పక చదవ వలసిన పుస్తకము, అంతె కాక వామపక్షవాదులు ప్రజా పొరాతామంతె యెమితొ తెలుసుకొవతనికి పనికివచీ పుస్తకము

  2. poi 03 ఏప్రిల్ 2009 , 7:19 am

    ఉన్నరు.కథన0 బాగుంది.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)