- సాజీగోపాల్
![]() |
పాలస్తీనా కవి తాహ మహమ్మద్ అలీ అరబిక్ భాషలో నాలుగు కవిత సంకలనాలు రాసారు. ఇటీవల ఆ నాలుగు సంకలనాల్లోంచి యేరిన కవితలతో “అయితే ఏంటి?” అనే కవితా సంకలనం ఆంగ్లంలోకి అనువాదం చేసి కాపర్ కాన్యన్ ప్రెస్సు ప్రచురించింది. పాలస్తీనా ప్రజల దీనావస్ధలను, దశాబ్దాలుగా ఇజ్రాయిలీ దురాక్రణ లో జనం అగచాట్లను తాహ కొంత మృదువుగానూ , కొంత వినయ ధిక్కార స్వరంతోనూ తన కవితలలో చిత్రీకరించాడు. |
జెరుసెలం లో నివసించే పీటర్ కోల్ ఆ కవితలను అరబిక్ నుండి ఆంగ్లం లోకి అనువదించి, యిటీవల జరిగిన ‘డాడ్జ్ పోయెట్రీ ఫెస్టివల్ ‘ లో గంభీరమైన స్వరంతో చదివి వినిపించాడు. ఈ పుస్తకంలో దాదాపు మూడున్నర దశాబ్దలుగా తాహ రాసిన కవితలున్నాయి. గెలిలీ ప్రాంతంలోని అరబ్బు సమాజంలో తాహ కవిత్వం బాగా సుపరిచితమే. డెబై ఎనిమిది సంవత్సరాల వయస్సున్న తాహ ముడతలతో,స్పష్టమైన ముఖకవళికల తో అనుభవాల్ని పండించిన తాత లాగ కనిపిస్తాడు. మృదువైన మనస్సుతో వినయంగా, గంభీరమైన గొంతుతో కవితలు చదువుతాడు.“నేను
కబేళ నుండి తప్పించుకున్న ఒంటెలా
తూర్పు దిక్కు పరిగెడుతున్నాను
కత్తుల కటారుల ప్రవాహం వెంబడిసున్నాయి “
తాహ కవితలలో ఆవేశం లేదు, కానీ మనస్సు హత్తుకునే ఆర్ధత వున్నది, వుద్రేకం లేదు కానీ వినయంతో కూడుకున్న భావోద్విగ్నత ఉంది. డాడ్జ్ కవి సమ్మేళనం లో కలసినప్పుడు మేము కవి తాహకు ఒక ప్రశ్న వేసాం. “దశాబ్దాలుగా ఇజ్రాయిలీ ఆక్రమణ లో జీవించిన మీకు, దురాక్రమణ, పాలస్తీనా సామాజిక పరిస్ధితులు మీ కవిత్వాన్ని ఎలా ప్రభావితం చేసాయి?” .తాహ ఇలా జవాబు చెప్పాడు. “ప్రపంచంలో ఎక్కడ కూడ దురాక్రమణ ఆనందంగా వుండదు, అది ప్రజల జీవితాన్ని నాశనం చేస్తుంది దుర్భరం చేస్తోంది.” అన్నాడు.ఒక అమెరికను అమ్మాయి తో వినయంగా మాట్లాడుతూ తాహ ఇలా అన్నాడు.=”పాలస్తీనా పరిష్కారమంతా అమెరికా చేతులలోనే వుంది. వాళ్ళు తలచుకుంటే వెంటనే పరిష్కరించ గలుగుతారు”. అప్పుడు నేను తాహతో ఇలా అన్నాను.“మరి ప్రపంచ చరిత్రలో ఎక్కడకూడా ఒక సామ్రాజ్యవాది దయ వల్ల, దురాక్రమణ దారుడి కరుణ వల్ల ప్రజలు విముక్తి పొందలేదు. విముక్తి కేవలం పోరాటం వలన సాధ్యమైంది కదాని “ అన్నాను. ఆయన గంభీరంగా వొక చిరునవ్వు నవ్వాడు.
***
కవితలు : స్వేచ్ఛానువాదం
అగ్రరాజ్యం పై పోరాడుతున్న అబ్దులా అల్ హైదీ
జీవితంలో అతను
చదవనూ లేదు రాయనూ లేదు
జీవితంలో అతను ఒక చెట్టునూ నరకనూ లేదు,
ఒక దూడ గొంతు కోయనూ లేదు
జీవితంలో అతను పత్రికలను విమర్శించ లేదు
గొంత్తెతి ప్రశ్నించనూ లేదు
కానీ ఒక మాటన్నాడు ”దయచేసి రండి ఎన్షా అల్లా! కాదన కండి”
ఏది ఏమైనా కానీ అతని ఆశ నిరాశవుతుంది
అతని పరిస్ధితి చాలా దయనీయంగా వుంది
దేవుడిచ్చిన హక్కులన్నీ సముద్రంలో ఉప్పులాగా కలసిపోయినయి
న్యాయస్ధానంలో కూర్చున్న
ఓ అమ్మలారా! ఓ అయ్యలారా!
శత్రువు గురించి నా క్లయింటుకి ఏమీ తెలియదు.
లోకం తెలియని అమాయకుడు అతను
కానీ ఖచ్చితంగా ఒక విషయం చెప్పగలను
యుద్ధనౌకలోని సిబ్బంది నంతా కలిస్తె మిట్ట మధ్యాహ్నమైనా
కోడిగుడ్లు వండిపెట్టగలడు లాబ్నా వడ్డించగలడు!
( లాబ్నా అంటే ఆవు, గొర్రె, మేక పాలతో చేసిన అరబ్బు ఛీజ్ )
***
ఒక కవిత లో తాహ ఇలా రాసాడు.
“
ఖాసిం !
జాలిలేకుండా వాళ్ళు నిన్ను చంపే శారా ?
కాదులే నువ్వు హంతకులను మాయ జేసి తప్పించుకునే వుంటావు “!
***
డేగ
ఎప్పుడైనా
విషాదమా!
ఏదో ఒక రోజు
నీనుండి నన్ను విముక్తి చేసుకోగలిగే శక్తే
నాకు వుంటే
అప్పుడు
నేను ఎమను కుంటానంటే
ఆత్మహత్య తో అతను అన్నీ బాధ్యలనుండి విముక్తి పొందాడని
ఎగిరిపోయిన పక్షుల గుంపు లా
పొలాలనుండి, కపాళాలనుండి పారిపోయిన గుడ్లగూబలా
ఒకవేళ అకస్మాత్తుగా
నీనుండి విముక్తి పొందగలిగితే
అప్పుడు ఏమి జరుగుంది?
ఇప్పుడు నిన్ను ఒదిలిపెట్టతే ఏమి జరుగుంది?
ఈ క్షణమే నిన్ను ఒదిలేసి పోతే
తాగుబోతు సారా దుకాణం ఒదిలి పోయినట్టుగా ….
నా బాల్యం లో
విషాదమా!
ఒక కోకిలను విషసర్పం కాటేయటం చూసాను
ఆ కోకిల మూగవోయింది
పక్షుల గుంపు గూడ దానిని ఒదిలివోయింది
పగులుతున్న ఆ కళ్ళలలో భయాన్ని చూసాను
అది తప్పించు కోవాలని ప్రయత్నిస్తోంది.
నేను ఎప్పుడూ మరచిపోలేను
అడవులు, చంద్రులు, కొలనులు
ప్రవాహాలు,కళ్ళల్లో దాగని ఆ పచ్చని ఉద్యానవనాలు
అన్నీ దాని మెడ చుట్టూ చుట్టు కున్నాయి.
ఒక మెరుపులో మాయమైపోయింది
ఆ కోకిల భయంతో కంపించుకు పోతుంది
అక్కడ మారణహొమాలు, నగరాలు కలగలసి
ఉధృతమైన వేగంతో, హింసతో దహించుకు పోతున్నాయి
ఆ కోకిల రెక్కలు తగలబడిపోతున్నాయి
అది ఏడుస్తోంది, వణుకుతోంది
బహుశ
భయం తో కంపిస్తున్నఆ కోకిల
ఒంటరిది కాకపోవచ్చు
ఆ భయం ఒక్క కోకిలదే కాకపోవచ్చు
ఓ నా విషాదమా!
ఆ కోకిల భయం అర్ధం చేసుకోవటం కష్టమే
ఆ పక్షుల గుంపు భయం తప్ప.
***

నమస్తె,
ఈ సెత్ వఇకి పిదియ లగా చెస్తె చల బాగుటుది
గోపాల గారూ,
తాహ మహమ్మద ఆలీ అనువాదం పట్ల మరి కొంత శ్రద్ధ తీసుకుని వుంటే బావుండేది.
మీ ప్రయత్నానికి అభినందనలు.
కొండేపూడి నిర్మల