- ఇంద్రాణి పాలపర్తి
ఇల జారిన పువ్వులతో
అల చేరిన గువ్వలతో
కలల కాయలు కాచిందీ చెట్టు.
ఒక చేత్తో బోదెను తడుతూ
ఒక చేత్తో గాలిని నెడుతూ
చుడుతున్నాడు వాడు
దీనిని పదే పదే
కలలు రాలుతాయేమోనని.
చిట్టి పాదాలు మట్టి వలయాలని సృష్టిస్తున్నాయి
కొన్ని పువ్వులు రాలి వాడి జుత్తులో ఇరుక్కున్నాయి.