గౌరవనీయులైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
గౌరవనీయులైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్
అధ్యక్షుడు, జాతీయ మానవహక్కుల కమీషన్
భారత రాష్ట్రపతి
భారత ప్రధానమంత్రి

బూటకపు ఎన్ కౌంటర్ చావులను వెంటనే ఆపండి !
ఎన్-కౌంటర్ మరణాలపైన సుప్రీంకోర్టు తో విచారణ చేసి, దోషులను శిక్షించండి!
మానవహక్కులను కాపాడి న్యాయస్థానాలపైన నమ్మకాన్నినిలబెట్టండి!

సమాజంలో హింసను తగ్గించి శాంతిభద్రతలను కాపాడాల్సిన, రక్షణ కల్పించాల్సిన పోలీసులు బూటకపు ఎన్-కౌంటర్ల నేరాలలో నిందితులుగా నిలబడటం చాలా విచారకరమైన అంశం. రాజ్యాంగబద్దమైన చట్టాలను ఉపయోగించి న్యాయబద్ధతను, శాంతిని నెలకొల్పాల్సిన పోలీసులే ఆ చట్టాలను ఉల్లంఘించి, ఎన్-కౌంటర్ల పేరుతో హత్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు.

ప్రభుత్వాల పాలకవిధానాలలో భాగంగానే ఎన్-కౌంటర్లు జరుగుతున్నాయని, ఆ క్రమంలో పోలీసులు భాగస్వామ్యులుగా, పావులుగా ఉంటున్నారని మనకి తెలిసిన విషయమే. చట్టవ్యతిరేకంగా పోలీసులు వేలాది బూటకపు ఎన్-కౌంటర్ చావులకు పాల్పడి కిరాయిహంతకులుగా వ్యవహరిస్తున్నారని మానవహక్కుల సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. మరి మన కళ్ళముందు జరుగుతున్న యీ హింసాకాండను ఆపేదెలా?

గుజరాత్ పోలీసుశాఖలో ఒక నిజాయితీ గల, నిబద్ధ్తతగల అధికారి ఐ.జీ.పి గీతాజోహ్రీ చేసిన విచారణలో ఎన్-కౌంటర్ల ముసుగులో పోలీసులు పాల్పడిన హత్యలు వెలుగులోకి వచ్చాయి. సుప్రీంకోర్టు ముందు గుజరాత్ ప్రభుత్వం స్వయంగా పోలీసులు చేసిన హత్యలను, నేరాలను అంగీకరించింది. వైద్యం కోసం భార్య కౌసర్ బీని హైదరాబాదు నుండి సాంగ్లీ కి తీసుకువెళ్ళుతున్న సొహ్రాబుద్దీన్, ఆయన మిత్రుడు తులసీరాం ప్రజాపతిలను గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పోలీసులు కలసి అపహరించి హత్యచేసారని గుజరాత్ ప్రభుత్వం స్వయంగా నేరాంగీకారం చేసింది . కౌసర్ బీని మానభంగం చేసి చంపారని వివరాలతో సహా పత్రికలు బయటపెట్టాయి. ధైర్యంగా, సాహసంగా న్యాయంకోసం నిలబడిన మహిళా పోలీసు అధికారి గీతా జోహ్రీ నిబద్ధతగా, నిజాయితీగా తన కర్తవ్యాన్ని నిర్వహించారు.

గుజరాత్ ఎన్-కౌంటర్ హత్యలతో పాటుగా, దేశంలోజరిగిన వేలాది ఎన్-కౌంటర్ మరణాలపైన, ఆంధ్రప్రదేశ్ , కర్నాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ , జార్కండ్, బీహార్ , గుజరాత్ , ఉత్తర ప్రదేశ్, పశ్చిమబెంగాల్ ,మధ్యప్రదేశ్ లలో జరిగిన ఎన్-కౌంటర్ మరణాలపైన ఇదే విధంగా న్యాయ విచారణ జరిపి, దోషులను తేల్చి శిక్షించవలసిందిగా విన్నపం చేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గత నాలుగు దశాబ్దాలలో నాలుగువేలమందికి పైగా ఎన్-కౌంటర్లలో చనిపోయారు. ఈ ఎన్-కౌంటర్ ఘటనలలో అత్యధికభాగం బూటకమైనవని ఎన్నో ఆరోపణలున్నాయి. అందువల్ల నిజానిజాలు తేల్చడానికి స్వంతంత్ర న్యాయవిచారణ జరిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అటువంటి విచారణ జరిపి, దోషులెవరో తేల్చి, న్యాయబద్దమైన తీర్పు ఇవ్వగలిగితే, దోషులను శిక్షించగలిగితే, బహుశ భవిష్యత్తులో జరగబోయే వేలాది ఎన్-కౌంటర్ చావులను కొంతమేరకైనా ఆపవచ్చు. మానవహక్కులను కాపాడి, న్యాయ స్థానాలపైన ప్రజల నమ్మకాన్ని పెంచడానికి ప్రయత్నించవచ్చు.

ఇప్పటిదాకా జరిగిన పోలీసు ఎన్-కౌంటర్ల పైన విచారణ జరిపి దోషులను, కుట్రదారులను శిక్షించి న్యాయాన్ని కాపాడవలసినదిగా రచయితలు, కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలు, దళితులు, ప్రవాసభారతీయులు, అంతర్జాతీయ శ్రామికులు, విద్యార్ధులు, ప్రజాస్వామికవాదులుగా విన్నపం చేస్తున్నాం.

డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌, రచయిత
వేలూరి వేంకటేశ్వరరావు, రచయిత, ఈమాట పత్రిక సంపాదకులు
ఆరి సీతారామయ్య , కథారచయిత
హెచ్చార్కె , కవి
ఎన్. వేణుగోపాల్ - వీక్షణం పత్రిక సంపాదకులు, రచయిత
వాసిరెడ్డి నవీన్ కథా సీరిస్ సంపాదకులు
అజయ్ ప్రసాద్, కథారచయిత
విజయ్
సాజీగోపాల్

గమనిక:
మిత్రులారా! మానవహక్కుల ఉల్లంఘనను నిరసిస్తూ యీ వినతిపత్రం పైన సంతకం చేయవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వినతిపత్రం, పత్రికా ప్రకటనలు విడుదల చేసేముందు అందరి పేర్లు చేర్చబడతాయి.

PDF Version:
http://prajakala.org/PDF/humanrights_appeal_may07.pdf

Addendum:

“The alleged fake encounter perpetrated by the Gujarat police is horrendous.”
Outlook India

“This is not the first time that the Gujarat police’s gory human rights record has been exposed. The controversial killing of Ishrat Jahan from Mumbra in Mumbai and Sameer Khan Pathan - both allegedly terrorists who wanted to kill Modi - were also suspected to be fake encounters. In all, Vanjara oversaw nine encounters in which 15 people were killed.”
Frontline / The Hindu: May 5, 2007

“No day passes in Andhra Pradesh without a fake-encounter in which people are brutally murdered by the state machinery. In the recent days, the violence perpetrated by the Andhra Pradesh Government through its police forces assisted by the paramilitary forces has increased to the unprecedented level. In 1998, 275 people were killed in the name of encounters. In 1999, 226 people were killed in the same manner.”
All India Peoples Resistance Forum ,G. N. SAIBABA, General Secretary

“Six Maoists were shot dead in two alleged encounters with the police in Mahbubnagar and Prakasam districts of Andhra Pradesh today.”
THE HINDU: Jan 16, 2005

“Gopinathan Pillai, father of deceased Pranesh Kumar Pillai alias Javed Shaikh, who was allegedly murdered in an encounter by Gujarat police on June 15, 2004, has filed a petition in the apex court.
“Officials of Gujarat police murdered my son on June 15, 2004 in the guise of an encounter, which is planned and executed by them with ulterior motive to enhance the political image of Chief Minister of Gujarat,” the father of the deceased said in the petition.
Indian Express: 18 May, 2007

“One of the police officers arrested in connection with fake encounter killing of Sohrabuddin Sheikh has confessed before a magistrate to his involvement in the murder, the Gujarat Government has told the Supreme Court.”
Times of India : 14 May, 2007

“In Gujarat, in response to a question from a member of the assembly, as many as 21 encounter killings by the state police were reported between 2003 and 2006. But the list submitted by the Gujarat government did not include the names of Sohrabuddin and Kauserbi, which is a grave breach of privilege. A deliberate murky cloud of official secrecy continues to hide the numbers and circumstances of encounter deaths by the Gujarat state police.”
Hindustantimes: May 12, 2007

“90 per cent of the encounters were fake. According to the Sachar committee report, more than a lakh Muslims were languishing in jails.”
Zahid Ali Khan, chief editor, Siasat URDU daily

6 అభిప్రాయాలు

  1. vijay 22 మే 2007 , 1:18 pm

    let fake encounters do not become part of natural corolloary in a society and let it be opposed in all fronts institutionalising the fake enounters which would eventually botch all the democratic processes

  2. aandhrudu 22 మే 2007 , 1:37 pm

    …..(contd…)..All intelluctuals need to convey that they are loath to the present architecture of estabilishing acceptability of offences.

    - aandhrudu

  3. kasula pratap reddy 28 జూన్ 2007 , 5:36 am

    మీ పత్రిక క్రమం తప్పకుండా చదువుతున్నాను. బాగుంటున్నది. నా కథ మీద దార్లగారు రాసిన వ్యాసం పెట్టారు. థ్యాంక్స్. ఆలస్యంగా ప్రతిస్పందిస్తున్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను.

    - కాసుల ప్రతాప రెడ్డి

  4. ravibabu,kothapalli 02 జులై 2007 , 6:22 am

    మీ పత్రిక క్రమము తప్పక రా వదము బాగున్నది.
    రవిబాబు

  5. prasanna 09 జులై 2007 , 6:14 am

    వ్యవస్థ అమానుషత్వానికి నిదర్శనం ఎన్కౌటర్లు.మానవత్వమున్న వాళ్ళంతా ఖండించవలసిన అవసరం వుంధి.

  6. thummala devarao 21 సెప్టెంబర్ 2009 , 4:55 pm

    మానవహక్కుల ఉల్లంగన అనాగరిక చర్య.సాతిమనిషిని చమ్పదము అనితికము…తుమ్మల దెవరవు,నిర్మల ఆదిలబద 9989598063

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)