- రహ్మతుల్లా

డాక్టర్ అంబేద్కర్ కుల నిర్ములన జరగాలని ఎందుకుకోరారు? బౌద్దమతాన్ని ఎందుకు స్వీకరించారు? హిందూ మతానికి ఈ రోజు కుల వ్యవస్థే ప్రధానశత్రువు. దళితులు, మైనారిటీలు తమకు జరిగే అవమానాలను దిగమింగుకోవాలి. తమ మానమర్యాదలు మంటగలిసినా ఊరుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మెజారిటీ వర్గీయులను ఎదుర్కోలేరు కాబట్టి. వాళ్ళు ఏది చెబితే అది వినాలి.విధేయతతో మసలుకోవాలి. యుద్దం చేయటం కన్నా ఓర్పుతో ఉండడం చాలా తేలిక. సంకుచిత మనస్తత్వం గల పిడివాదులనీ వర్గ విభేదం సృష్ఠించే వాళ్ళనీ ఏమీ అనలేక తమ వాళ్ళని తామే తిట్టుకోవడం అన్నిటికంటే తేలికైన పనిగా వీళ్ళు భావిస్తారు.

భారత ప్రభుత్వం లౌకికవాదాన్ని అతి చక్కగా కాపాడుతున్నది. అగ్రవర్ణ హిందువులు వర్గ విభేదాలు పాటించని లౌకికవాదులుగా మొత్తం ప్రపంచ దృష్టిలో పడేట్లుగాచేస్తుంది.దళితులు, మైనారిటీలు ఎలాంటి తిట్లైనా తినాలి, తన్నులు భరించాలి. వాళ్ళ దేవుళ్ళకి, ప్రవక్తలకి, మతాలకి ఎటువంటి అవమానం జరిగినా అంగీకరించాలి. అప్పుడే వాల్లని చాలా ఓర్చుకునే లౌకికవాదులుగా భుజం తడతారు. దళితులను,మైనారిటీలను ఎదిరిచటం చాల సులువైన పని ఎందుకంటే వారు సౌమ్యులు, దౌర్జన్యం చేయలేరు, అల్ప సంఖ్యాకులు. నిజమైన శత్రువుని ఎదుర్కోవటానికి ఎంతో దైర్యం కావాలి, కాబట్టి దళితులు, మైనారిటీలు ఏం చేస్తారంటే తమ శత్రువుని గౌరవిస్తూ తమ సొంత ప్రజలనే వ్యతిరేకిస్తారు. అందుచేత తమలోని బాధితులను ఆదుకోలేక బాధితులదే తప్పంటారు. అయినా వాళ్ళనుతీవ్రవాదులు, పిడివాదులు అంటారు, దాడులకు కారకులంటారు. అగ్రవర్ణ హిందూ ఉగ్రవాదులు మన దేశ లౌకిక నాగరికతను, సమగ్రతను దెబ్బతీస్తున్నా వాళ్ళను విమర్శించే ధైర్యం లేదు.

సమస్యలను గుర్తిస్తే వాటి పరిష్కారం కోసం మనం ప్రయత్నించాలి. పిరికిపందలు, తప్పించుకునే స్వభావం కలవారు ఈ సమస్యలను గుర్తించటానికి తిరస్కరిస్తారు. కాబట్టి ఈ సమస్యల పరిష్కారానికి ప్రయత్నించరు. మనమంతాలౌకికవాదులం,శాంతినిప్రేమించేవాళ్ళం, అహింసావాదులం. కానీ మనకి ఏమి సరిపోతాయో వాటినే స్వీకరిస్తూ చేస్తాం. కానీ లేఖనాలు చెప్పిన విషయాల్ని పాటించాల్సి వచ్చేటప్పటికి వెనకడుగు వేస్తాం. అధర్మాన్ని ఎదుర్కోవాలని- ఉపదేశాలు చేసే భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి పవిత్ర మత గ్రంధాలను మనం మర్చిపోయాం. కులవివక్ష అనేది తప్పు మరియు క్రూరమయినది. మన అసమర్ధతను కప్పిపుచ్చుకోవటానికి ఓర్పు, లౌకికవాదం అనే ముసుగును వాడుతున్నాం. అహింసావాదులమని చెప్పుకుంటాము. అధర్మాన్ని ఎదిరించకపోవటం మరింత అధర్మాన్ని ప్రొత్సహించడమే అవుతుంది. అది మరీ పాపకార్యం. నిప్పుకోడి మనస్తత్వం మనకు ఉపయోగపడదు. మన సమస్యలను పట్టించుకోకుండా గుడ్డి చూపుతో చూస్తే సమస్యలు పరిష్కారం కావు, పైగా సమస్యలు పెరుగుతాయి. గుడ్డివాడిలాగా బూకరిస్తే మరిన్ని కష్టాలు వచ్చిపడతాయి.

హిందువులు ద్వైతీయులు, అద్వైతీయులు, విశిష్టద్వైతీయులు, నాస్తికులు, జైన్లు, బుద్దులుగా ఉండవచ్చు.అలాగే వారికిష్టమైన ఏ దేవుడైనా, దేవతనైనా పూజించవచ్చు. హిందువులు ఎక్కువగా పూజలద్వారా, యాగాలుద్వారా, భాగవతమార్గంద్వారా, స్వాములను, బాబాలను దర్శించటం ద్వారా సమయాన్ని, ధనాన్ని మరియు శ్రమను ఖర్చు చేస్తారు. వాళ్ళు క్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగాన్ని గౌరవిస్తారు. ఎవడైనా నిన్ను ఒక చెంప మీద కొడితే, కొట్టినవాడికి రెండవ చెంప చూపించు అన్నాడు క్రీస్తు. క్రైస్తవ మతం హింసను బోధించడంలేదు.

హైందవేతర మత ప్రచారకుల యొక్క అత్యుత్సాహానికి అడ్డుకట్ట వేస్తూ మధ్యప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలలో మతమార్పిడి నిషేధచట్టాన్ని తెచ్చారు. ఇప్పుడు తి.తి.దే. దళితుల్ని హిందూమతంలోనే ఉంచే ఉద్దేశంతో “దళిత గోవిందం” అనే కొత్త కార్యక్రమంతో ముందుకొచ్చింది.దీనిని భారతీయ ముస్లిములకు వర్తింపచేస్తే ఎంతో బాగుంటుంది, ఎందుకంటే వారి పూర్వీకులు కూడా హిందువులే కదా! హిందూ సమాజం క్రమేణా దానిలోని వైరుధ్యాలను నియంత్రించుకుంటుంది. ఇప్పుదు వారు కులవ్యవస్ధను రద్దు చేసుకొని హిందువులందరూ సాంఘికంగా సమానులే అని చెప్పడానికి సిద్దపడుతున్నారు. కాబట్టి మనమంతా ఈ “దళిత గోవిందం”ని సాదరంగా ఆహ్వానిద్దాం.

ఈ దళిత గోవిందాన్ని దళిత ముస్లిములకు కూడా పొడిగిస్తే బాగుంటుంది. వారి తాత ముత్తాతలు కూడా హిందువులే… షేక్ శ్రీనివాసరావు, ఇబ్రహీం రాజు, మక్బూల్ నాయుడు, అహ్మద్ రెడ్డీ, గనీఖాన్ చౌదరి, సులేమాన్ మాదిగ…. మొదలగు వారు ఈ దళిత గోవిందాన్ని గురించి ఆలోచిస్తారు. హిందూత్వాన్ని ఒక మతంలా చూడకుండా ఒక జాతిగా చూడాలని హిందూనాయకులు కొందరు కోరుతున్నారు. తి.తి.దే.మత పెద్దలు కులవివక్ష నిర్మూలించటానికి ఈ పధకాన్ని రూపొందించారు. అందరు హిందువులు సాంఘికంగా ఆధ్యాత్మికంగా సమానులేనని చెప్పటమే ఈ కార్యక్రమ ఉద్దేశం. మన భారతీయ ముస్లిములు, క్రైస్తవుల పూర్వీకులు అరబ్ దేశాలనుండి రాలేదు. వారికీ పాకిస్ధానీయులకు ఎలాంటి సంబంధం లేదు. ఆత్మ గౌరవంకోసం, సాంఘిక సమానత్వం కోసం తపిస్తూ ఈ కులవివక్షను తట్టుకోలేక విసుగు చెంది ఇస్లామునీ,క్రైస్తవాన్నీ అంగీకరించి స్వీకరించి వుంటారు. ఒకవేళ తి.తి.దే. ఇలాంటి వాళ్ళందర్నీ హిందూత్వంలోకి తిరిగి మార్చటానికి మార్గాన్ని తెరిస్తే అది మంచి పరిణామమే. ఇది ఎలా సాధ్యం అంటారా? కొంచెం సేపు ఆలోచించండి. హిందువులు అంత తేలికగా ముస్లిములుగా లేదా క్రైస్తవులుగా ఎందుకు మారుతున్నారు? ధనం కోసమా? లేక సాంఘిక ఐక్యతతో కూడిన ఎగువస్దానం కోసమా? లేక రెండింటి కోసమా? విశ్వాసం మీద, సిద్ధాంతాల మీద ఆధారపడిన ఆధ్యాత్మిక తౄప్తి కూడా వారి మీద ప్రభావం చూపుతుంది. కాని దానివల్ల భౌతికంగానో, ఆధ్యాత్మికంగానో ఉపయోగం ఉండాలి. ఇన్నాళ్ళూ దళితులను దేవాలయాల్ని దర్శించటానికి, పూజారులవటానికి, వేదాలు నేర్చుకోవడానికి అనుమతించలేదు, కాని ముస్లిములు, క్రైస్తవులు వారిని సోదరులుగా మనస్పూర్తిగా ఆదరించి పాస్టర్లుగా, ముల్లాలుగా చేశారు. హిందూ పెద్దలు ఇప్పటికైనా వారి తప్పుని తెలుసుకొని తప్పును సరిదిద్దుకుంటున్నారు. కాబట్టి అందరూ ఈ విప్లవాత్మకమైన పరిణామాన్ని ఆహ్వానించాలి. భవిష్యత్తులో అణగదొక్కబడిన కులస్దులకు హిందూత్వంలో ఏ మాత్రం సమాన హక్కులు ఇచ్చి సంఘంలో గౌరవంగా చూస్తారో మనమంతా వేచి చూడాలి. నన్ను హిందూత్వంలోకి ఆహ్వానించి బ్రాహ్మణిడిగానో, రెడ్డిగానో, రాజుగానో, కమ్మగానో చేస్తే ఆనందంగా స్వీకరిస్తాను.అందుకోసం నా బి.సి.రిజర్వేషన్ను కూడ వదులుకుంటాను. ఎందుకంటే మా తాత ముత్తాతలు పూర్వీకులు ఏ కులం నుంచి ఇస్లాంలోకి మారారో, నాకు తెలియదు.అలా మార్చటం కుదరదంటే హిందువులకు ఒకే ఒక మార్గం మిగిలింది: అదేంటంటే నాలుగు వర్ణాలను వందలాది కులాలను నిర్మూలించటం, అందర్నీ హిందువులని పిలవటం. దేవుడు ఒక్కడే కాని వేలపేర్లుతో పిలుస్తున్నారు. అతను ఎవరో తెలియదు, ఎవరికీ కనిపించడు కాని ఆయన సౄష్టించిన దళితులు, ముస్లిములు మన తోటి సహోదరులు. వారు మనకు మనలాగే మనంత సమానంగా కనిపిస్తారు. కులవివక్ష వర్ణవివక్ష అనేది మనిషి సృష్టించిన ఘోర పాపం. ఈ దళిత గోవిందం ద్వారా ఆ పాపకార్యానికి ప్రాయశ్చిత్తం జరుగుతోంది. మన తప్పులేకపోయినా మతవాదులు మానవత్వాన్ని మరచి మనపై ఆధిక్యాన్ని సంపాదించటానికి మనల్ని అనేక కులాలుగా విభజించారు.మా మామ గారి ఇద్దరు అక్కలు ఒకరు చౌదరిని,ఒకరు మాదిగను ప్రేమ వివాహాలు చెసుకొని నేటికీ సజీవ ఉదాహరణలుగాఉన్నారు.వారి పిల్లలది ఏ కులం ఏ మతం అవుతుంది? అప్పుడే పుట్టిన బిడ్డకు కులం గురించి తెలియదు కాని కాలక్రమేణా దాని గురించి తెలుపుతాము, ఎంత నీచమైన పద్దతి? ఎవరైనా తప్పు చేస్తే దాని ఆధారంగా కొన్ని తరాల తరువాత వారి వారసులను శిక్షించొచ్చా? అది ఎంత వరకు న్యాయం? గొర్రెపిల్ల, తోడేలు కధ మనకు గుర్తు రావడంలేదా?

మనలో ఉన్న శక్తిని అంతఃకరణ శుద్ధికి వెచ్చిద్దాం. మన నమ్మకాలని మనం తేలికగా విడిచిపెట్టలేము. ఎవరు ఎలా పని చేయాలి? ఏ క్రమంలో, ఏ పద్ధతిలో చెయ్యాలో మన మతాల పెద్దలు నిర్ణయించారు. అవి ఎంతవరకు న్యాయబద్ధంగా ఉన్నాయో విశ్లేషిద్దాం. లోపాలుంటే సరిచేద్దాం. అప్పుడే ఆధ్యాత్మిక సంతోషాన్ని పొందగలుగుతాము. మన ధ్యాసంతా తప్పుడు పనులమీద ఉంది. మరో పక్క ప్రపంచం మంచిగా మారుతూ ఉంది. మంచి మార్పుల్ని మనమూ స్వీకరించాలి, మారాలి.

ఆర్యులు భారతదేశానికి వలస వచ్చి కులవ్యవస్థను స్థాపించారని రొమిల్లా తాపర్ చెప్పారు.సెల్యులార్ అండ్ మోలికులర్ బయోలజీ హైదరాబాద్ డైరెక్టర్ లాల్జిసింగ్ ఆర్యులు క్రీస్తు పూర్వం 1500 తర్వాత నుండే భారతదేశానికి వచ్చారనీ, కుల వ్యవస్థ అనేది 8000 సంవత్సరాల క్రితమే ఏర్పడిందనీ అంటే మనిషి వేటాడడం నుండి వ్యవసాయానికి మారిననాటి నుండే ఏర్పడిందనీ చెప్పారు.

మన ఆలోచనలు ఇతరులకు శక్తినివ్వాలి. అవి ఇతరుల్ని మానసికంగా అణచివెయకూడదు. అవి తిరోగమనంగా, వక్రంగా ఉండకూడదు. అవి ఇతరుల బుద్దిని హరించి అశక్తుల్నిగా చేయకూడదు. అనుత్పాదకంగా ఉండకూడదు. కుక్కలు చింపిన విస్తరిలా చిరిగిపోయి చిన్నాభిన్నమై నిరాశతో ఉన్న దేశంలోకి ఒక కొత్త ఊపిరిని ఆశను తెద్దాం. వివేకవంతమైన ఉత్పాదకమైన ఆలోచన అశక్తులకు సరైన దారిని చూపిస్తుంది, నడిపిస్తుంది. అవివేకులను ఉత్తేజ పరుస్తుంది. అణగారిన వర్గాలను లేపుతుంది. ప్రతి మనిషికీ అంతులేని తెలివి ఉంటుంది. మనం బలంగా తయారవటానికి ఇతరులపై పడి దోచుకోవడం మానుకుందాం. మరొకరి చాకిరినీ, మేధాశక్తినీ ఉపయోగించుకొని బలంగా, మందంగా, కావరంగా తయారవ్వకూడదు. ఇతరుల శక్తియుక్తులను పిండుకుని బలంగా అహంకారులుగా తయారవ్వటం అభివృద్ధి యొక్క ప్రామాణిక న్యాయ సూత్రాలను అతిక్రమించినట్లే. మర్యాద ఇచ్చిపుచ్చుకోవటం ప్రతి ఒక్కరికీ తెలిసుండాలి. తన కడుపూ తన స్వార్ధమే పరమార్ధమనే భావన జాతి నాశనానికి దారి తీస్తుంది. “మీరు పెరగాలంటే ఇంకొకరు తగ్గాలా? మీరు ఇష్టులుకావాలంటే, ఇతరులు అంటరానివాళ్ళు కావాలా? ఇతరులు మాత్రం అల్పులుగా, స్వల్పులుగా ఉండాలా?” ఇదే మీలో ఉన్న వినాశకర శక్తి. మర్యాదస్తుడు మరొకరికి మర్యాదనిస్తాడు తనతో సమానగౌరవం ఇస్తాడు. నిరంకుశుడు ఇతరులకు స్వేచ్చను ఇవ్వడు. ఎల్లప్పుడు ఏది మంచో ఏది చెడో చెబుతూనే ఉండాలి. స్వేచ్చ కోసం సమానత్వం కోసం, సోదరభావం కోసం పోరాటం చేయాలి. మిగతా ప్రజల్ని కూడా ఆలోచించి స్వేచ్చగా మాట్లాడనివ్వండి. స్వతంత్రంగా ఆలోచించటానికి సాహసం చేయండి, ఇతరులు కూడా స్వతంత్రంగా ఆలోచించేలా చేయండి. అభివృద్ది పెరుగుదల అందరి హక్కు అనే ప్రాధమిక న్యాయసూత్రాన్ని గౌరవించండి. ఓ వ్యక్తి అభివ్రుద్ది చెందడం, సమర్ధత ద్వారా సాధించడం అనేవి అపారమైన అవకాశాలు, అతనిలో దాగి ఉన్న నిపుణత మీద ఆధారపడి ఉన్నాయి. అతన్ని శత్రువుగా భావించి అణగదొక్కకూడదు.ఇతరులని పీడించి నాశనం చేయటానికి సమయాన్ని, ఆలోచనని, శక్తిని వృదాచేయవద్దు.ఉపయోగకరమైన గొప్ప పనులకోసం శక్తిని వెచ్చించండి. ప్రజలను నిరంకుశులై పీడించకండి.

మీలోని శక్తిని ప్రజావ్యతిరేకంగా వాడకండి. సంఘాన్ని విచ్చిన్నం చేయకండి. అందరి ఐక్యత కోసం అంటరాని తలంపుల్ని వదులుకోండి. అందర్నీ రానివ్వండి.అందరితో కలవండి.అదే పనిగా పడిన దెబ్బలు శతాబ్దాల తరబడి దళితుల్లో సృజనాత్మకతను, సకారాత్మక స్పందనను చంపేసాయి.అవమానాన్ని, పేదరికాన్ని తలరాతగా భావిస్తూ జీవనాన్ని గడుపుతున్నారు. పరాజితులై అవమానంతో నిరాశ చెందడం వల్ల వారిలో ఇక పైకి లేవాలి అనే చైతన్యం, శక్తి నశించింది. నకారాత్మక శక్తి ఆవరించింది. నిరాశావాది తన నైరాశ్యాన్ని తలరాతగా భావిస్తూ తననుతానే శిక్షించుకుంటాదు. తాను ఎవరో, ఎందుకు పుట్టాడో, తానెలా ఉండాలో అన్నీ సోదాహరణంగా తెలుసుకుని నోరు మూసుకుని బ్రతుకుతాడు. నోరు విప్పినా, కాలు కదిలినా ఏం జరుగుతుందో అతనికి తెలుసు. అందుకే అతను తనపైతానే జాలి పడతాడు. తన మీద తనకే రోత కలుగుతుంది కాబట్టి తనను తాను తిరస్కరించుకుంటాడు. బాధే సౌఖ్యమనే భావనతో నాకెందుకింత పెద్ద పదవి అంటాడు. మిగతావాళ్ళతో నేను సమానుణ్ణి కాదనుకుంటాడు. కాబట్టి పోటీపడే శక్తులన్నీ పోగొట్టుకుని అడుక్కు తినే స్వభావాన్ని పెంచుకుంటాడు. మరొకరి అదుపాజ్ఞల్లో బ్రతకడంలోనే ఆనందిస్తాడు. ఆధ్యాత్మికమైన స్వేచ్చ సృజనాత్మక శక్తికి జీవాన్నిస్తుంది. ఆధ్యాత్మికమైన స్వేచ్చ మనిషి ఎదుగుదలకు అపార అవకాశాలనిస్తుంది. దళిత గోవిందం ఈ ఆధ్యాత్మికమైన స్వేచ్చను ఇచ్చే ఒక ఆశాకిరణం. మారిన వ్యక్తి తనను తాను తెలుసుకుంటాడు. తనకు తాను సంపాదించుకుంటాడు. అతని మనసు ఉత్తేజితమై వెలుగుతుంది. కొన్ని వందల సంవత్సరాల పాటు చీకటి గుహకు సూర్యుని కాంతి, చంద్రుని కాంతి ఎట్లా ఉంటుందో తెలియకపోవచ్చు. కాని చిన్న దివిటీ కాంతి రెప్పపాటు కాలంలో చీకటిని చీల్చి వెలుగు తెస్తుంది. అలాగే ఈ వెలుగు చీకటి గుహలో ఉన్న దళితులు అనుభవిస్తున్న ఆధ్యాత్మిక అంధకారాన్ని చెదరగొడుతుంది. చీకటి చెరలో ఉన్న అతని ఆలోచనా శక్తులకు వెలుగునిస్తుంది. వందల సంవత్సరాల తరబడి రాజ్యమేలిన హిందూ చీకటి తనంపై ఈ దళిత గోవిందం తన వెలుగును ప్రసరించింది. సాంఘిక, ఆధ్యాత్మిక సమానత్వం వైపు దారి చూపింది. దైర్యమిచ్చింది. అడుగులు వేయించింది. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలి. అన్ని దేవాలయాల వాళ్ళూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ను, అర్చకులను అభినందిద్దాం.

27 అభిప్రాయాలు

  1. శ్రవణ్ 17 జూన్ 2007 , 8:02 am

    ఈ దళిత గోవిందం ని ఎవడు sketch చేశాడో తెలుసుకోవాలనుందండి.

    మనిషి లాగా ఆలోచించలేకపొతే politics లో చేరవచ్చు కదా! ఎవరు వద్దన్నారూ!

    —శ్రవణ్

  2. skumar 17 జూన్ 2007 , 6:09 pm

    అస్తమానం అగ్ర వర్ణాల అహంకారం, దళితుల దీన స్థితి అని ఉపన్యాసాలు, వ్యాసాల కంటే, ఈ మారిన సమాజంలో ఏ వర్ణానికి విలువ లేదు, ఒక్క ధనిక వర్ణముకు తప్ప అని గుర్తించరేమి ? ఒకప్పుడు నిమ్న వర్గాలకు అన్యాయం జరిగింది . నిజమే. ఇప్పుడు వారికి న్యాయం చేద్దామని ఆలోచించాలి కాని, ఉన్న అగ్ర వర్ణాలని అణగ దొక్కితే ఎమోస్తుందో. ఈ నాడు, అగ్ర వర్ణాలలో ఎందరో పేదలు ఉన్నారు. ప్రతీ స్ఠాయి లో రిజర్వేషన్ల వల్ల చదువు మానటమో, వేరే స్థాయి చదువులకి వెళ్ళటమో జరిగింది. ఈ రిజర్వేషన్లను అడ్డు పెట్టుకొని, ఎంత మంది అనర్హులు ఉన్నత చదువుల లోనో, ఉన్నత పదవుల లోకి వెళ్ళడం చాలా సాధారణమైపోయింది. దేశం లో ఏమి జరిగినా అది అగ్ర వర్ణాలకు అందునా బ్రాహ్మణులకు అంట గట్టడం ఒక ఫ్యాషను అయ్యింది. అట్లా అని దళిత నాయకులు గత 60 సం. గా చేసింది ఏమి లేదు, వోట్లు దండుకోవడం, ధన వంతులు అవడం తప్ప.
    రాజకీయ నాయకులు తమ మనుగడ కోసం ఎగ దోస్తున్న ఒక రావణ కాష్ఠాన్ని ఇంత మంది మోయడం తమ అస్తిత్వాన్ని ఫణంగా పెట్టడం తప్ప ఇంకేమీ లేదు. ప్రాపకాలని సంపాదించు కోవడం తప్ప ఈ నాయకులు, కుహానా మేధావులు చేసిందేమి లేదు, ఒక రాజ్యాంగ నాయకుడిని, దళిత నాయకుడిని చేయడం తప్ప.

  3. శ్రవణ్ 18 జూన్ 2007 , 9:47 am

    SKUMAR గారూ,

    ఈ వ్యాసం “దళిత గోవిందం” గురించి. మీరు ఆ విషయం మీద comment వ్రాస్తే బావుండేది.

    మిగతా సంకుచిత మనస్కుల్లా కాకుండా “ఒకప్పుడు నిమ్న వర్గాలకు అన్యాయం జరిగింది” అని వొప్పుకున్నందుకు కృతజ్ణతలు. ఇది ఇంకా జరుగుతూన్నదని గ్రహించగలరు. మీరు చివరి సారి ఒక తెలంగాణా పల్లెటూరి కుర్రాడితో ఎప్పుడు మాట్లాడారు? University అంటే తెలియని వాళ్ళు మీకు ఎంత మంది తెలుసు. మీరు సరైన అవకాశం రాని వారి గురించి బాధపదుతున్నారు. అవకాశాలగురించి కనీసం తెలియని వాళ్ళ సంగతేంటి?

    I feel that it is a ploy, I have expressed my views. No regrets on that. ఇక్కడ comment చేసేవాళ్ళూ గానీ, articles వ్రాసేవాళ్ళు గానీ fashion కోసం చెయ్యరని గ్రహించగలరు. చర్చ ఎప్పుదూ మంచిదే. చర్చకు అవకాశమివ్వకుండా నాలుకలు కొయ్యమన్న వెధవల వల్లే ఈ పరిస్థితి.

    దళిత వాదమే oppress చెయ్యబడ్డవాళ్ళ గురించి. దళితులు కాని వారికీ problems వున్నాయని వప్పుకుంటాను. రండి, బహుజనులుగా సమసమాజం కోసం ప్రయత్నం చేద్దాం.

    —శ్రవణ్

  4. vipul 19 జూన్ 2007 , 1:08 am

    రహంతుల్లా గారూ దళితగోవిందం అసలు ఉద్దేశ్యం ఏమిటి? అది కుట్ర కాదా. అంబేద్కర్ కులనిర్మూలన జరగాలన్నాడు. అందరి ఆలోచనలు, ఆచరణ ఆదిశగా పయనిస్తే ఎంతబాగుండును. హిందూమతం ఆపనిచేయగలదని మీరు భావిస్తున్నారా. నాకా నమ్మకం లేదు. అందులోని అగ్రవర్ణాలు అంత తొందరగా దిగివస్తాయా. అంబేద్కర్ చెప్పిన కులనిర్మూలనకోసమ అందరూ సమష్టిగా పనిచేయాలి. దళితనాయకులమని, దళితకవులమని చెప్పుకునేవాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కులనిర్మాణం కాక దాని నిర్మూలన గురించి మరింత చర్చ జరుగుతుందని ఆశిస్తూ…

  5. siddharth 19 జూన్ 2007 , 1:21 am

    బాబూ శ్రావణ్ ఒక తెలంగాణా పల్లెటూరికురృవాడేకాదు మనరాష్టృంలో చాలాప్రాంతాలలో పల్లెటూరి పేదలకు, దళితులకు యూనివర్శిటే అంటే తెలియదు.

  6. శ్రవణ్ 20 జూన్ 2007 , 7:45 am

    siddharth గారూ,

    చిన్న clarification.
    1.మీరు చివరి సారి ఒక తెలంగాణా పల్లెటూరి కుర్రాడితో ఎప్పుడు మాట్లాడారు? ఈ ప్రశ్న “నిమ్న వర్గాలకు అన్యాయం జరిగింది” అన్న context లోది.

    2.University అంటే తెలియని వాళ్ళు మీకు ఎంత మంది తెలుసు? అన్న ప్రశ్న “అవకాశాల గురించి చాలా మందికి తెలియదు” అన్న context లోది.

    బహుశా! నేను 2 వేర్వేరు పేరాలలో వ్రాయవలసింది. అభిప్రాయం తెలిపినందుకు కృతజ్ణతలు.

  7. siddharth 21 జూన్ 2007 , 8:18 am

    విమర్శకులు చర్చలో పాల్గొనేవారు సరైనపదజాలం ఉపయోగిస్తే మంచిది. తిట్టడం మాని ప్రతివిమర్శచేయొచ్చుగా. దూదేకుల సమస్యకి, దళితసమస్యకి, వర్గీకరణకి మీరు చూపే పరిష్కారం ఏమిటి. చర్చ ప్రజాస్వామ్యకంగా జరగాలని కోరుకుందాం.

  8. rahamthulla 22 జూన్ 2007 , 12:16 am

    విపుల గారూ,మీ అభిప్రాయాలు అహ్వానించదగ్గవి.అయితే దళిత గోవిందం కుట్ర ఎలానో విపులంగా చెప్పండి. హిందూమతం కులనిర్మూలన చేయగలదని,కనీసం కుల వివక్షనైనా తొలగించగలదని ఇన్నాళ్ళూనాకూ నమ్మకం లేదు. అందులోని అగ్రవర్ణాలు అంత తొందరగా దిగిరావు.నిజమే అంబేద్కర్ చెప్పిన కులనిర్మూలనకోసమే అందరూ సమష్టిగా పనిచేయాలి.అంటరాని తనాన్ని పాటించిన అగ్రవర్ణాల వాళ్ళు దళిత గోవిందం ద్వారా తమ పాపాన్ని కడుక్కోవాలనుకోవటం మంచిదేగదా?

  9. vipul 22 జూన్ 2007 , 2:02 am

    రహంతుల్లాగారూ! హిందువులంతా తమ పాపాలను కడుక్కోవాలనుకుంటున్నారా. పాతతరం వదిలేద్దాం. కొత్తతరం వారు దళితులని , ముస్లిములని ఎలా చూడగలుగుతున్నారు.రాబోయే యువతరానికి ఎలాంటి దృక్పథం అవసరం. ఇరువురి మధ్య ఎటువంటి నమ్మకం ఏర్పడాలి.

    దళితగోవిందం హిందూమత సంక్షోభానికి ఉదాహరణ. అందులోని ఒక వర్గంవారు తమ ఉనికిని (తమ మతాన్ని) పెంచుకోడానికి చేసే ప్రయత్నం. దళితగోవిందం హిందువులందరి లేక అగ్రవర్ణాల ఉమ్మడి కార్యక్రమం కాదు. కులనిర్మూలనకి దళితగోవిందం హాస్యాస్పదం. కులనిర్మూలన రావాలంటే దళితులు ఆర్థికంగా సామాజికంగా శక్తివంతులు కావాలి. కులాంతరవివాహాలు ఎవరిమధ్య ఎక్కువగా ఉన్నాయో ఒక్కసారి గమనించండి. ఆపరిస్థితికి అందరూ చేరువకావాలి. దళితగోవిందం దళితులని హిందూమతంలోకి లాగే కుట్ర. తమ మతానికి చేరువకామనేవారు ఆర్థికసమానతవం , రాజ్యాధికారం పేరెత్తితే ఏమంటారో చూడండి. దళితులకి కావలసింది ముందు రాజ్యాధికారం మరియు ఆర్థికంగా శక్తిపుంజుకోవడం. దళితగోవిందం ఉత్త డొల్ల. దళితులే దళితగోవిందాన్ని బహిష్కరించాలి. కావలసింది మతమార్పిడికాదని అధికారమార్పిడని మనం గుర్తించాలి. వాళ్ళేదో మేం పాప ప్రక్షాళన చేసుకుంటామంటే అమాయకంగా వెళ్ళటమేనా. ఇన్నాళ్ళూ మనమీద ఊసినవాడిపంచన చేరతామా..చెప్పు రహంతుల్లా.. ఆత్మాభిమానం ఉంటే వాడిమీద తుపుక్కున ఊయాలి. ఇన్నాళ్ళూ వాడని బహిష్కరించినవాడు ఇవాళ వాడలోకి పాగా ఎందుకువేస్తున్నాడు… ఇది కుట్రకాదా…

    మనకు దళితులపక్షాన, మైనారిటీలకోసం, బిసిలతో, అన్నిఅట్టడుగు వర్గాలకోసం ఉమ్మడి పార్టీ కావాలి. ఉత్తరప్రదేశే బీహార వంటి రాష్ట్రాలలో దళితులు రాజకీయ వ్యవస్థని నిర్దేశిస్తున్నారు. అదింకా బలోపేతం కావాలి. మనరాష్త్రంలో మనందరం కొట్టుకుంటుంటే అగ్రవర్ణాలవారు రాష్ట్రాన్ని భూవ్యాపారంతో భోంచేస్తున్నారు. లేని ఉద్యోగాలకోసం మాలమాదిగలు వర్గీకరణచట్రంలో కొట్లాడుకుంటున్నారు. ప్రభుత్వ్మమే ప్రైవేటుపరం అయ్యాక ఉద్యోగాలు ఎక్కడివి. బట్టతలవాడికి బోడిగుండు చేద్దామన్నట్లుండి ఈ కొట్లాట. దీనినుంచి లాభపడేదెవరు బాగా ఆలోచించు. అందుకే దళితులు ఐక్యం కావాలి. రాజ్యాధికారంకోసం ఉద్యమించాలి. అవసరమైతే బిసిలను, మైనారిటీలను కలుపుకుని ఒకవేదికమీదకు రావాలి. మనరాష్త్రంలో ఉన్న సమస్యలకు ఇదే పరిష్కారం. కాంగ్రెస టిడిపిలు చేసేది భూవ్యాపారమే. రేపేమీ మిగలకుండా చేస్తున్నది దేనిని చెప్పవయ్యా రహంతుల్లా.

  10. rahamthulla 22 జూన్ 2007 , 11:35 am

    ఏకవచనప్రయోగాలవలన,చులకనగా విమర్శించటం వలన మర్యాదస్తుడు అసభ్య భాషలోకి దిగడు.కానీ చర్చలో పాల్గొనకుండా మానుకుంటాడు.డాక్టర్ అబ్దుల్ కలాం మనసు ఎలా విరిగి పోయిందో చూడండి.నేను పోటీనే చెయ్యను అని తప్పుకున్నారు.
    పార్టీల ప్రమేయం లేకుండా దేశ ప్రజలు నేరుగా ఎన్నుకునే వ్యక్తిగా పోటీ లో నిలబడే అవకాశం వుంటే ఆయన అత్యధిక ప్రజల మద్ధతుతో తప్పక గెలుస్తాడు.ఇప్పుడు ప్రజాస్వామ్యం పార్టీలవల్ల నాశనమై పోయిందిగదా?ఇలాంటి అన్యాయాలు జరగకుండాలంటే ఏం చెయ్యాలి?

  11. vipul 23 జూన్ 2007 , 6:19 am

    మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. వేరే అవమానించాలనే ఉద్దేశ్యంతో మిమ్మల్ని ఏకవచనంతో బోధించలేదు. మీరు బాధ కలిగిస్తే క్షమించాలి.

    అధ్యక్షుడిని ప్రజలు నేరుగా ఎన్నుకుంటే బాగుంటుంది. మిగిలిన అసమర్థపు ప్రజాప్రతినిధులను వెనక్కిపిలవగలిగే వ్యవస్థకూడా రావాలి.

  12. rahamthulla 24 జూన్ 2007 , 1:10 am

    Inter religious married couples are balancing the religious hatred
    ness and they act as shock absorbers. Few examples of inter religious
    married prominent Indians:
    Emperor Akbar,
    Indira Gandhi-Feroz Gandhi (Zoroastrian, Parsee)
    Dr. Lakshmi Saleem,
    Pataudi-sharmila Tagore,
    Sunildath–Nargisdath,
    Asif Ali - Aruna Ali (Congress leaders of yester years),
    K L Mehta IFS - Nawabzadi of Hyderabad.
    Maharaja Kishan Pershad, Prime Minister Hyderabad Sate-lady of Nizam family,
    Thalmeez Ahmed- Akbaruddin (IFS),
    Rajeev Gandhi–Sonia,
    Saif Ali Khan-,
    Shah Rukh Khan-గౌరి,
    Jocky Shroff-
    Hrithik Roshan - Suzanne Khan,
    Jyotsna-Ilyas couple (News readers)
    Azharuddin -Sangeetha Bijlani,
    etc., and their children.
    Let us encourage inter-religious marriages
    to keep peace and religious tolerance in our country. Can any body inform some more names?

  13. siddharth 25 జూన్ 2007 , 1:18 am

    కులాంతర / మరియు మతాంతర వివాహంచేసుకున్నవారి సంతానం ఒకవేదికపైకి వచ్చి వసుధైక మతం లేదా ఇంకేపేరుతోనైనా ఒక మతం స్థాపిస్థే ఎలా ఉంటుంది. ఇది కులనిర్మూలనకు తోడ్పడదా. కొత్తగా కులాంతర / మతాంతర వివాహం చేసుకున్నవారి సంతానం కూడా ఇందులో చేరవచ్చు. కులాంతరవివాహం చేసుకుంటే పిల్లలు ఇబ్బందులపాలవుతారని చాలామంది కులాంతరవివాహలకు దూరమవుతున్నారు. ఇది కులనిర్మూలనకి మంచి ఆలోచన కదా. ఎవరైనా దీనికి పూనుకోవాలి. కాని ఇందులోకూడా విగ్రహారాధనకు, చాంధసభావాలకు చోటుండకూడదు.

    రహంతుల్లాగారు మతాంతరవివాహం చేసుకున్న ధనికుల గురించే చెప్పారు. విదేశాలలో స్థిరపడినవారు, మధ్యతరగతివారు, హేతువాదులు ఇలా అసంఖ్యాకులు కులాంతరవివాహం చేసుకున్నవారిలో ఉన్నారు. కులంలేని వారి సంతానం అంతా ఒకవేదికపైకి వచ్చి కులనిర్మూలనకోసం ఒక కొత్త వసుధైక మతాన్ని స్థాపించాలి. వారేకాక ఇతరకులాలవాళ్ళు కూడా అందులో చేరవచ్చును. ఇందుకొసం ఎవరైనా పూనుకుంటే బాగుంటుంది.

  14. Khaja 25 జూన్ 2007 , 3:53 am

    రహమతుల్లా గారి వ్యాసం చదివాను. వ్యాసం కొంచెం గందరగోళంగా వుందనిపించింది. పైగా దళిత గోవిందాన్ని అతిగా పొగడటంతో పాటు దాన్ని వ్యతిరేకించే వారంతా తెలివి తక్కువవారనే అబిప్రాయంతో ఈ వ్యాసం రాసినట్లుగా వుంది.

    ” తప్పుని తెలుసుకొని తప్పును సరిదిద్దుకుంటున్నారు. కాబట్టి అందరూ ఈ విప్లవాత్మకమైన పరిణామాన్ని ఆహ్వానించాలి”
    దేవుడు వాడలోకి వచ్చినంత మాత్రాన దళితుల జీవితం మారిపోయి, అంటరానితనం పోయి, వివక్ష పోయి అంతా మారిపోతుందనా?
    ఆవెంటనే మీరు ఏమంటున్నారు..

    “నన్ను హిందూత్వంలోకి ఆహ్వానించి బ్రాహ్మణిడిగానో, రెడ్డిగానో, రాజుగానో, కమ్మగానో చేస్తే ఆనందంగా స్వీకరిస్తాను”
    అంటే కులాలు యధాతథంగా వుండాలి, అందులో మీరు ఒక అగ్రకులస్థులుగా మారి మీరూ కింది కులస్థులపై పెత్తనం చేయాలనేగా అనుకుంటున్నారు..? లేకుంటే కులాలు లేని సమాజాన్ని/హిందూ మతాన్ని కోరివుండే వారు..లేదా కిందికులంలో పీడితుల పక్షం వహించే వారు..

    ఎందుకు దళిత గోవిందంను ఆహ్వానించాలి? ఎందుకు దాని రూపకర్తలను అభినందించాలి?
    దళిత గోవిందం కులనిర్మూలన కోసం పాటుపడాతానని చెప్పిందా?
    దళిత గోవిందం కుల వివక్ష నిర్మూలిస్తానని చెప్పిందా?
    దళిత గోవిందం ఈ దేశంలోని అగ్రవర్ణాల వారు (అనేకమంది)మనసుల్లో నింపుకున్న కుల విషాన్నీ కడిగేస్తానని వాగ్ధానం చేసిందా?
    వూరికీ వాడకీ మధ్య వున్న దూరాన్ని చెరిపేస్తానని ప్రకటించిందా?
    కులాంతర/మతాంతర వివాహాలు చేస్తానని చెప్పిందా?
    దళితుల ఇంట్లో వండిన వాటిని తిరుపతి దేవునికి నైవేద్యంగా పెట్టి బ్రాహ్మలచేత తినిపిస్తానని చెప్పిందా?
    ????????????????
    మీ వ్యాసం బోధన చేసింది, బెత్తంతో బెదిరించింది. ఇటువంటి వ్యాసాలు దళితులకు గాని, దళీత ముస్లిములకు గాని ఉపయోగ పడనివి, పైగా వారిని మరింత సందిగ్ధంలోకి నెట్టేసేవి..

  15. rahamthulla 25 జూన్ 2007 , 12:04 pm

    గందరగోళం ఏమీలేదు. దళిత గోవిందాన్ని అతిగా పొగడటంలేదు. దాన్ని వ్యతిరేకించే వాళ్ళలో తెలివైన వాళ్ళు ఎంతో మంది వున్నారు. తప్పుని తెలుసుకొన్న వాళ్ళను వారి తప్పును సరిదిద్దుకోనివ్వండి. విప్లవాత్మకమైన పరిణామాన్ని ఆహ్వానించాలి.

    ఒక దళితుడిని,సాయిబును, బ్రాహ్మణుడిగానో, రెడ్డిగానో, రాజుగానో, కమ్మగానో చేసే అవకాశం అసలు వుందా?వుంటే కులాలు యధాతథంగా వుండవు.దళితులు సాయిబులు అగ్రకులస్థులుగా మారితే ఆటోమాటిగ్గా కింది కులాలు వుండవు . కులాలు లేని హిందూ మతం వస్తుంది.
    అందుకే దళిత గోవిందంను ఆహ్వానిద్దాం.వాళ్ళుకుల వ్యవస్థలో ఏ చిన్న మంచి మార్పుకు సిద్దపడ్డా దాని రూపకర్తలను అభినందిద్దాం.ఇన్నాళ్ళూ మనమీద ఊసినవాడిపంచన చేరతామా అనే ఆత్మాభిమానంతో వాళ్ళ మీద తిరిగి తుపుక్కున ఊయకుండా క్రింది డిమాండ్లు చేద్దాం:
    దళిత గోవిందంతో ఆగకుండా దాని రూపకర్తలు మిగతా సంస్కర్తలు కులనిర్మూలన కోసం పాటుపడే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలతో కుల వివక్షను నిర్మూలించాలి.
    ఈ దేశంలోని అనేకమంది అగ్రవర్ణాల వారి మనసుల్లో నింపుకున్న కుల విషాన్నీ కడిగేయాలి.
    వూరికీ వాడకీ మధ్య వున్న దూరాన్ని చెరిపేయాలి.
    కులాంతర/మతాంతర వివాహాలు భారీగా చేయాలి.అసలు తి.తి.దే.వారి కళ్యాణమస్తు కార్యక్రమం కులాంతర/మతాంతర వివాహాలకు మాత్రమే పరిమితం చెయ్యాలి.
    దళితుల ఇంట్లో వండిన వాటిని మాత్రమే గుడుల్లోని దేవుళ్ళకు నైవేద్యంగా పెట్టి అందరిచేత తినిపించి అంటరాని తనం అడుగంటిపోయేలా చెయ్యాలి.దళితులు,సాయిబుల్లో ఇష్టమున్న వారిని పూజారులుగా చేరనివ్వాలి.కేవలం దళిత గోవిందం ఒక్కటే ఈ పనులన్నీ చేయలేదు.ప్రతి పీఠాధిపతీ రంగంలోదిగాలి.ఎవరు ఏకులమో తెలియని అడగనక్కరలేని సమాజం ఏర్పడే వరకు ఇలా వాళ్ళను ఆహ్వానిస్తూ,వత్తిడి తెస్తూ,వాళ్ళతో సంకరమవుతూ పోవాలి.కులాంతర/మతాంతర వివాహాలు చేసుకున్న ప్రముఖుల గురించి ఇంకా ఇంకా ప్రచారం చేద్దాం.

  16. khaja 26 జూన్ 2007 , 10:38 pm


    దాన్ని వ్యతిరేకించే వాళ్ళలో తెలివైన వాళ్ళు ఎంతో మంది వున్నారు.

    మీరు ఎంత అహంకార పూరిత గ్నానంతొ మాట్లాడుతున్నారు. వ్యతిరెకించే వాళ్లంతా తెలివితక్కువ వాళ్లు, మూర్ఖులు అని మీ వుద్దేష్యం. అంతేనా, కానీ తెలివైన వాల్లు కూడ వ్యతిరేకిస్తున్నారని బాధ పడుతున్నారా. దాన్ని సమర్థించే మీకు ఎంత తెలివి/చదువు (మీభాషలో)వున్నాయో వ్యతిరేకించే వారు అంతకన్నా నాలుగు అడుగులు ముందువున్నారని గమనించాలి.

    తప్పుని తెలుసుకొన్న వాళ్ళను వారి తప్పును సరిదిద్దుకోనివ్వండి.

    దానికెవరికీ అభ్యంతరం లేదు అందుకే నేను ముందురాసిన వ్యాసంలో కొన్ని ప్రశ్నలు వేశాను. తప్పు సరిదిద్దుకోవడాం అంటే దళితుల పటల కొనసాగిన వివక్ష ఇక ముందు కొన సాగదని హామీ ఇవ్వడం. అలా తప్పులు జరగడానికి కారణమైన వాటిని మార్చుకోవడం. అలంటి హామీ ఏదీ దళిత గోవిందం ప్రకటించలేదు.మీరూ నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. పైగా ఏమంటున్నారు..

    దళిత గోవిందంను ఆహ్వానిద్దాం.వాళ్ళుకుల వ్యవస్థలో ఏ చిన్న మంచి మార్పుకు సిద్దపడ్డా దాని రూపకర్తలను అభినందిద్దాం

    మీకు వారి పట్ల భక్తి ప్రకటనే ముక్యం…ఈ వాక్యాలనే నేను మీరు బోధన చేస్తున్నారని చెప్పింది. మళ్లీ అదే చేస్తున్నారు. చిన్నప్పూడు మా హైస్కూల్లో ఒక సారు వుండే వాడు ఎవరన్నా ప్రశ్న అడిగితే ఆయనకు నచ్దేదికాదు. కోప్పడే వాడు, లేదా అంతకుముండు చెప్పిన విశయమే చెప్పి దాటావేశే వాడు.


    ఈ దేశంలోని అనేకమంది అగ్రవర్ణాల వారి మనసుల్లో నింపుకున్న కుల విషాన్నీ కడిగేయాలి.
    వూరికీ వాడకీ మధ్య వున్న దూరాన్ని చెరిపేయాలి.
    కులాంతర/మతాంతర వివాహాలు భారీగా చేయాలి.అసలు తి.తి.దే.వారి కళ్యాణమస్తు కార్యక్రమం కులాంతర/మతాంతర వివాహాలకు మాత్రమే పరిమితం చెయ్యాలి.
    దళితుల ఇంట్లో వండిన వాటిని మాత్రమే గుడుల్లోని దేవుళ్ళకు నైవేద్యంగా పెట్టి అందరిచేత తినిపించి అంటరాని తనం అడుగంటిపోయేలా చెయ్యాలి

    ఇవ్వన్నీ ప్రశ్నలని మీకూ తెల్సు. ఈ ప్రశ్నలు దళిత గోవిందం అజెండాలో లేవనీ మీకు తెల్సు.. ఇవేవీ జరగనే లేదు దళితులతో పాటు సాయిబులు కూడా భక్తి ప్రకటించాలని మీరు చెబుతున్నారు..
    మీకు కులానికీ మతానికీ వున్నతేడా కూడా తెలియడంలేదు.

    దళితులు,సాయిబుల్లో ఇష్టమున్న వారిని పూజారులుగా చేరనివ్వాలి.

    అంటే అంతా హిందూ దేవుళ్లను పూజించే వారుగా మారిపోవాలనా? లెక హిందువులుగా మారిపోవాలనా?
    ఇవాళ దళితులే హిందూ మతాన్ని కాదని క్రైస్తవంలోకి, బౌద్ధంలోకి మారిపోతుంటే, మీరు ఏకంగా సాయిబుల్ని పూజారులుగా బ్రాహ్మణ వేషం వేయమంటున్నారు. మీ ఆర్గుమెంట్ లో వాస్తవికత లేదు, పైగా మీరు ప్రతిపాదించే “సంకరం” లో అందరూ హిందూ మతస్తులుగా మారిపోవాలనే ఒక అమాయక ఎత్తుగడ వుంది. అదిమీకు తెలిసి అంటున్నారో తెలియక అంటున్నారో కానీ సంఘ్ పరివార్ మాట్లాడుతున్నది కూడా ఇదే.
    మీరు చెబుతున్న థియరీలో ఎవరికీ వారి ప్రత్యేక మతం, సంస్కృతి, ఆచారం వుండకుండా అందంరూ హిందువులుగా అదికూడా అగ్రకుల హిందువులుగా మారిపోవాలని అంటున్నారు.అందుకు “పీఠాధిపతులు” పూనుకోవాలని సలహాకూడా ఇస్తున్నారు.
    అంటె ఈ గడ్డ మీద ఏ అస్థిత్వమూ మిగలకూడదు.. ఒక్క హిందూ అగ్రకులాల అస్థిత్వంతప్ప.. భేష్ బాగా చెప్పారు.

  17. rahaMtullaa 27 జూన్ 2007 , 5:06 am

    దాని రూపకర్తలు సంస్కర్తలు చెప్పాల్సిన జవాబులు రానివ్వండి.నన్ను వ్యక్తి గతంగా ప్రస్తావించటం విమర్శించటం ఎందుకు?మీరు చెప్పదలుచుకున్నది నేరుగా సిద్ధాంత రూపంలో చెప్పండి.సమర్దించే వాళ్లంతా తెలివితక్కువ వాళ్లు, మూర్ఖులు కాదు.తెలివైన వాళ్ళు కూడ సమర్దిస్తున్నారు.

  18. శ్రవణ్ 27 జూన్ 2007 , 10:12 am

    చర్చ బావుంది. khaja గారు ప్రస్తావించిన ప్రశ్నలు అద్భుతంగా వున్నాయి.

    rahamthulla గారి వాదనలో నాకు 2 విషయాలు నచ్చలేదు. మొదటిది, దళితగోవిందాన్నీ, T.T.D.ని మీరు హిందూ మతానికి ముఖంగా చూస్తున్నారు, చూపిస్తున్నారు. గుజరాత్ అల్లర్లప్పుడు కనిపించిన ముఖాన్ని కూడా చూడగలరని మనవి.

    రెండవది.. అసలీ చర్చ అంతా “వాళ్ళు తప్పులు తెలుసుకున్నారు” అనే statement మీద ఆధారపడి వుంది. ఆ statement తప్పు. Here is the proof. http://aha-naa-blog-anta.blogspot.com/2007/04/blog-post_06.html
    ఈ లింకు లో Dr.Ismail గారి comments చదవండి. దానిలో ఈనాడులో వచ్చిన article excerpt లో T.T.D. చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని చదవండి. వాళ్ళు కేవలం దళితులు వేరే మతాల వైపు ఆకర్షించబడకుండా వుండాలని ప్రయత్నిస్తున్నారు. నేను ఆ ప్రయత్నం తప్పు అనటం లేదు. కానీ, దాన్ని “వాళ్ళు దళిత గోవిందం ద్వారా తమ పాపాన్ని కడుక్కోవాలనుకోవటం” గా పరిగణించలేము.

    వీళ్ళకి వంతపాడటం సరైన పని కాదని గ్రహించండి. వాళ్ళ ఆలోచనల్ని అహ్వానించడం కాదు, “నడతలో, ఆలోచనలో తేడా రావాలి. స్వామివారి కళ్యాణంతో పాటు సమానత్వం కోసం పాటు పడమ”ని వారికి మనమే నచ్చచెబుదాం.

    రహమతుల్లా గారూ, నేను కరుణాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలు మీ ముందు పెట్టాను. ఇప్పుడు మీ వ్యాఖ్యలు తెలుపగలరు. ఇది మిమ్మల్ని challenge చెయ్యాలనే ఉద్దేశ్యం కాదు. ఇంత చర్చ జరిగాక కూడా సమాజానికి తప్పు సంకేతాలు పంపకూడదు కదా!

  19. rahamthulla 28 జూన్ 2007 , 10:03 am

    తెలుగుముస్లిముల గ్రూపులో ఇటివల వచ్చిన వార్త వుంచాను.ఆలయాల్లోకి ముస్లిములు రాకూడదా? అని అడిగాను.
    రామేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలు
    హసన్ అలీ సందర్శనకు పరిహారంగా!
    చెన్నై, జూన్ 25 (న్యూస్‌టుడే): రామేశ్వరంలోని ప్రసిద్ధ రామనాథ స్వామి ఆలయాన్ని ముస్లిం మతస్థుడైన స్థానిక శాసనసభ్యుడు సందర్శించినందుకు పరిహారంగా… ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని తూర్పుగోపుర భాగం బీటలు వారడంతో హసన్ఆలీ, రామనాథపురం పురపాలక సంఘం వైస్‌ఛైర్మన్ రాజమణితో కలసి ఆలయాన్ని సందర్శించాల్సి వచ్చింది. రాష్ట్ర హిందూదేవాదాయ శాఖ మంత్రి కె.ఆర్.పెరియకరుప్పన్‌కు ఆ వివరాలు హసన్ఆలీ సమర్పించారు. ఆయన ఆలయాన్ని సందర్శించడంపై భాజపా నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హిందూయేతరులు ఆలయప్రవేశం చేశారంటూ రామేశ్వరంలో పోస్టర్లు అతికించారు. వీహెచ్‌పీ, శివసేనకు చెందిన సభ్యులు కూడా హసన్ అలీ ఆలయప్రవేశాన్ని గర్హించారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా వ్యవహరిరంచిన ఫరూక్ మార్కియా ఇదే ఆలయాన్ని సందర్శించిన నేపథ్యంలో హిందూయేతరుల ప్రవేశాన్ని నిరసిస్తూ సుప్రింకోర్టులో ఓ కేసు దాఖలైంది కూడా. అయితే ఫరూక్ కోర్టులో క్షమాపణలు చెప్పడంతో ఈ వ్యవహారం అప్పట్లో సమసిపోయింది. హసన్ అలీ రాకతో ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లిన నేపథ్యంలో ఆగమశాస్త్రం ప్రకారం పరిహార ప్రత్యేక పూజలు సోమవారం నిర్వహించామని ఆలయ అధికారులు తెలిపారు.
    Eenaadu 26.6.2007
    ఇద్దరు హిందువులు ఇలా స్పందించారు:
    1.మరి స్థానికుడైన అబ్దుల్ కలాం సందర్శిస్తే ఏం చేస్తారో ఈ చాందసవాదులు?
    2.Hindu culture allows every one to enter into temples. No person is stopped if not Hindu. The problem with indian govt is it is taking politics to Temples by accupying them.
    I condemn the government involving in Temples.
    What is govt interest in controlling only temples?
    3.ఇంకొకాయన దళిత ముస్లిములను హిందూ మతంలోనే కట్టిపడేయటానికి రాజ్యాంగంలోనే నియమావళి విధించారని అన్నారు:
    According to a special provision in article 341 of the
    Indian Constitution, untouchable or Dalit
    communities, termed as Scheduled Castes (SCs), get
    several special rights, including reservations in
    education, employment and membership of Parliament as
    well as states assemblies. But this special right has
    been extended to only those who declare themselves to
    be Hindus, Buddhists or Sikhs, while Muslim and
    Christian Dalits are denied these rights.
    conversion was
    tactical, not because of any religious reason, but
    simply in the hope of some economic advancement. If our
    brethren, the Hindu Dalits can get special
    constitutional rights and on that basis can get
    employment, then why not Dalit Muslims?.
    We are equally, if not more, poor than them.
    Ejaz Ali argues, “This constitutional provision
    compels Hindu Dalits not to embrace Islam or
    Christianity. If they do they would lose the special constitutional rights as well as several other benefits given by the states and the union government.many Dalits who had historically converted to Islam feel that it is better to declare themselves as Hindus and thereby access special constitutional rights for Scheduled Castes.This constitutional provision is a violation of the Constitutional principle of secularism.
    మతమార్పిడులను అరికట్టేందుకే దళితగోవిందం.మతం ఎప్పుడు మారకుండావుంటారు?మతంలో అందరికీ సమాన గౌరవం దొరికినప్పుడే గదా?ఈ దళిత గోవిందం మొదలు పెట్టినందువల్లనే ఈ ఆశ మనలో చిగురించి వాళ్ళను ఎన్నెన్ని ప్రశ్నలు అడగాలో అన్ని అడుగుతున్నాం.దళితులు అన్ని మతాల్లోకీ మారారు.అక్కడా చీలికకు గురవుతున్నారు.దళితులు దళిత ముస్లిములను కూడా పోటీదారులుగా చూస్తున్నారు.తిండి తక్కువ తినేవాళ్ళు ఎక్కువ పేదరికం తీరని శాపంగా మనవాళ్ళ తలలపై కూచునివుంది.అంతరాలు పెరిగాయి.
    కులాంతర మతాంతర వివాహాలు కొన్ని దశాబ్దాలపాటు నిర్బంధం కావాలి.కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నవారికే రిజర్వేషన్లు పరిమితం చెయ్యాలి.కులాంతర/మతాంతర వివాహాలు భారీగా చేయాలి. తి.తి.దే.వారి కళ్యాణమస్తు కార్యక్రమం కులాంతర/మతాంతర వివాహాలకు మాత్రమే పరిమితం చెయ్యాలి.దళిత గోవిందం ఆదిశగా మళ్ళాలి.మన దేశం నిజమైన లౌకిక రాజ్యం కావాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు హిందూ పెద్దలుఎన్నో చెయ్యాలి.ఇవన్నీ చేసే వరకు అడగండి,అడుగుతూనే వుండండి.

  20. khaja 28 జూన్ 2007 , 10:47 pm

    మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్షించే అవసరం లేదు మీ అభిప్రాయాలతో వున్న అభ్యంతరాన్ని ప్రకటించడాన్ని మీరు వ్యక్తిని విమర్శించడం అని దయచేసి వక్రీకరించకండి. సిధ్ధాంత రూపంలో చెప్పామన్నారు.అంటే నాచర్చ మీకు అర్థంకాలేదని అనుకోవలసి వస్తుంది. లేద అర్థమయి దాటవేస్తున్నారని అనుకోవాలి.
    మీరు మళ్లీ హిందూ మతం పట్ల అందరిచేత భక్తిని ప్రకటించే ప్రయనం చేస్తూనే వున్నారు
    -
    ఇలాంటి కార్యక్రమాలు హిందూ పెద్దలుఎన్నో చెయ్యాలి.ఇవన్నీ చేసే వరకు అడగండి,అడుగుతూనే వుండండి.
    -
    అసలు హిందూ మతాన్ని ఒకటిగా చూడటామే తప్పు. బ్రాహ్మణ మతం వేరు(చరిత్రలో ఇది వైదిక మతం). శూద్ర మతం వేరు (చరిత్రలో ఈ మతం లేదు. వీరు తెగలుగా వున్నారు. వృత్తి జీవులు) వీరిద్దరినీ “హిందువులుగా” ఒకే మతంగా , ఒకే స్థయి వారిగా, ఒకే సంస్కృతి కలిగిన వారిగా చూడటం తప్పు. అది చరిత్రలోనైనా, ప్రస్తుత కాలంలోనైనా.
    బ్రాహ్మణ మతం దేవుళ్లు శూద్ర మతం దేవుళ్లు, వీరిద్దరి ఆధ్యాత్మిక కేంద్రాలు వేరు వేరు. వీరిద్దరికీ కనపడాని అతి శూద్రులు అసలు మనుశులుగానే గుర్తింపు లేని వాళ్లు. అయితే బ్రాహ్మణ మతం తన ఆధిపత్యాన్నననిలుపుకునే క్రమంలో రూపొందించిన కుల వ్యవస్థ, దాని నుంచి పెట్రేగిన అణిచివేతని తట్టుకోలేక శూద్రలు, అతిశూద్రుల నుంచి మత మార్పిడులు మొదలయ్యాయి. బౌద్ధం మొదలుకొని ఏ కొత్త మతం వచ్చినా, ఏ కొద్దిగా ఆత్మ గౌరవానికి అవకాశం కనిపించినా మతం మారేప్రయత్నం చేషారు. కొత్త మతాల్లో పీఠాలు చేజిక్కించుకోడానికి బ్ర్రాహ్మణ మతంనించి మతం మారినావారూ వున్నారు.
    ఈ క్రమంలోనే ఇక్కడ ఇస్లాం, క్రైస్తవం పుంజుకున్నాయి. ముస్లింల పాలన కాలంలో ఇస్లాంకు, బ్రిటిష్ పాలనాకాలంలో క్రైస్తవానికి రాజ్యం అండకూడా దొరకడం వలన అవి కొంత బలపడ గలిగాయి. అయితే కులం, సామాజిక వేర్పాటు ఈ కొత్త మతాల్లోకీ పాకడం వలన అక్కడా ముస్లిముల్లో కింది కులాలనించి మారినవారు అజ్లాఫ్లుగా, అగ్ర కులాల వాళు అష్రాఫ్ లు గా స్పష్టమైన తేడాతొ బతుకుతున్నారు. అందుకే క్రైస్తవంలో కూడా రెడ్డి క్రైస్తవులు, కమ్మ క్రిఅస్తవులు, సిరియన్ క్రైస్తవులు(కేరళ బ్రాహ్మణులు),దలిత క్రైస్తవులు వున్నారిక్కడ.
    సామజిక వివక్షలో, అణిచివేతలో తేడా వున్నప్పటికీ రెండుచోట్లా పై కులం పై కులంగానే కింది కులం కింది కులం గానే వుంది.
    మతం మారకుండా సోకాల్డ్ హిందువులుగా మిగిలి పోయిన శూద్ర కులాలవాళ్లు భూమి మీద తమకున్న ఆధిపత్యం కారణంగా, రాజ్యాధికారంతో పాటు భ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని కూడా చేజిక్కించుకున్నారు. స్వాతంత్ర్యానంతర ప్రజాస్వామ్య కాలంలో పైకి ఎగబాకిన ఈ శూద్ర కులాలవాళ్లు ప్రస్తుతం మిగతా శూద్రకులాలను చోసే స్థితిలో లేరు. మిగతా షూద్ర, అతిశూద్రుల పట్ల వివక్షను అమలుచేసే భ్రాహ్మణీయ వర్గంగా మారిపోయారు. అంటే బ్రాహ్మణీయ విలువలను, సాంప్రదాయాలను హిందూ కుల వ్యవస్థను కాపాదే పనిలో బ్రాహ్మణులకన్నా ముందు నిలుస్తున్నారు. దీనికి ప్రబల వుదాహరణ భూమన కరుణాకర రెడ్డి, టి. సుబ్బి రామిరెడ్డి, అలాగని రెడ్లు మాత్రమే అనుకుంటె పొరపాటు. పైకి ఎదిగిన అన్ని శూద్ర కులాలు ప్రస్తుతం బ్రాహ్మణీ య సాంప్రదాయాలను పునర్నిర్మించి ఆ పీఠాలను తమచెప్పు చేతల్లో వుంచుకునే ప్రయత్నంలో వున్నాయి. కుల వివక్ష, అణిచివేతల రూపం మారింది, వేషం మారింది. అంతే తేడా.
    ఇప్పుడు టిటిడి చేపట్టిన ఈ దళిత గోవిందం కూడా దళితులను కుల వివక్షనుంచి విముక్తి చేసేందుకు బయల్దేరింది కాదు. వాళ్ల్ను వేరే మతంలోకి మారకుండా ఆపడాం కోసం మొదలు పెట్టింది. ఈ మాట నాదికాదు. భూమన కరుణాకరరెడ్డి చెప్పిన మాట.
    దీనికి రంగులువేసి, మసి పూసి, కులవ్యవస్థ మారిపోయిందని, అందరూ కులాంతర వివాహాలు చేసుకుంటున్నారని, సామాజిక వవక్ష తొలగి పోయిందని మాట్లాడ్డంలో అర్థంలేదు.
    ఏ మతంలోనైనా వుండాలో వద్దో నిర్ణయించుకునే హక్కు వుండాలి. నచ్చితే వుంటారు. లేకుంటే మారతారు. లేదా మతంనచ్చి దాంట్లో ఇబ్బందులుంటే మతం మారకుండా ఇబ్బందులు తొలగించుకునే ప్రయత్నం చేస్తారు.
    ఇక దళిత ముస్లిముల కు మతంలో అంతర్గతం గా కొన్ని ఇబ్బందులు వున్నా సామాజికంగా మాదిగ కులాల వారు, మాల కులాల వారికన్నాకొంత మెరుగైన హోదా వుంది. దళిత ముస్లిములకు ఇస్లాంను వదిలి బయటికి వేళ్లే తక్షణ అవసరం కానీ, వెళ్లడాం వలన ప్రయోజనం కానీ లేదు.
    ఇవ్వన్నీ సామాజిక వాస్తవాలు వీటి చొట్టూ చారిత్ర క అనుభవాలు వున్నాయి. వాటిని కాదని ఆవేశంతో , అత్యుత్సాహం ప్రదర్షించడాం వలన ప్రయోజనం వుండకపోగా ఇప్పుడిప్పుడే, ఆత్మగౌరవం కోసం, హక్కులకోసం గొంతువిప్పుతున్న వారి గొంతులను శాశ్వతంగా నులిమి వేసిన మవుతాం.

  21. rahamthulla 29 జూన్ 2007 , 9:12 am

    ప్రతి మతంలో కొన్ని సుగుణాలుంటాయి.అలాగే కొన్ని నచ్చని అంశాలూ
    వుంటాయి.రాజా రామ్మోహన్రాయ్,కందుకూరి వీరేశలింగం లాంటి
    సంఘసంస్కర్తల కృషి వలన హిందూ మతం ఎంతో బాగుపడింది.మన
    పూర్వీకులంతా హిందువులే.హిందు మతంలొని కుల వివక్షకు
    తట్టుకోలేక వేరే మతాలు స్వీకరించారు.యెన్నోదురాచారాలను హిందూమతం వదులుకుంది కాని ఇంకా కుల వ్యవస్థ పోలేదు.
    అలాగే ముస్లిములమని చెప్పుకునే యెంతోమందిలో కూడా
    కట్నాలు,తెగలు,కులాలు,వడ్డీ,జూదము,త్రాగుడు,వ్యభిచారము,దొంగ
    తనము,అబద్దాలు,హత్యలు, మొదటి భార్యను అడగకుంలోనే రెండోపెళ్ళి
    చెసుకోవడం,యేకపక్షంగా విడాకులు ఇవ్వడం,బానిస స్త్రీలను
    వాడుకోవడం,మనసుతొ పనిలేకుండానె తెలియని భాషలో
    యాంత్రికంగా ప్రార్ధన చెయ్యడం,కొడుకులు చూడకుండా
    విడిచిపెట్టిన ముసలి తల్లి తండ్రులకు వ్రుద్ధాశ్రమాలు
    కట్టకపొవడం,పేదరికంలొ వుండి కూడా నారుపొసినవాడే
    నీరుపోస్తాడని యెక్కువ మంది పిల్లల్ని కని చదివించకుండా
    పనికిమాలిన వాళ్ళుగా తయారు చెయ్యడం లాంటి దురాచారాలు
    వున్నాయి.ముస్లిములందరిలో కాదు కొందరిలో.అలాగని ఇస్లాం మతాన్ని
    తప్పు పట్టకూడదు కదా? ఇస్లాం యెన్నో దురాచారాలను
    నిర్మూలించింది.
    అలాగే హిందూ మతస్తుల్లో వున్న దురాచారాలను ఆ
    మతంలోని మహానుభావులే పోరాడి సంస్కరణలు తెచ్చారు
    తెస్తున్నారు ఇంకా తెస్తారు.మంచితనం,మానవత్వం అనే
    సద్గుణాలు లేని ఏమతాన్నైనా సంస్కరించాల్సిందే.యెంత ఘోర
    పాపినైనా దెవుడు క్షమిస్తాడని లేఖనంలో వుందని అన్ని మతాల
    వాళ్ళూ చెబుతారు.అలాగని పాపాలు చేస్తూ జీవితం గడిపి
    చివర్లొ క్షమాపణ అడిగితే సరిపోదు.దళిత గోవిందం పేరుతో దేవుడి విగ్రహాన్ని ఒకపక్క దళిత వాడల్లోకి తెస్తుంటే,మరోపక్కహసన్ అలీ రాకతో ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లిందని ఆలయం కడుగుతున్నారు.కడగాల్సింది ఆలయాలను కాదు.వీళ్ళ పూర్వీకులు వీళ్ళు చేసిన పాపాలను కడుక్కోవాలి.ఎన్నేళ్ళు గడిచినా ఎంత ప్రయత్నించినా కుల వివక్ష పోవటం లేదు.ఇలాంటప్పుడు ఎవరు నమ్ముతారు?ఏ హిందూ నాయకుడికీ ఈ సంగతి పట్టదా?
    “మంచి చెడ్డలు రెండె మతములు” అనే సూక్తికి తిరుగు లేదు.మంచి యే మతంలో వున్నా స్వీకరించుదాం.చెడు యే మతంలో వున్నా తిరస్కరించుదాం.
    మనమంతా మనుషులం.మానవత్వమే మన మతం.నాలుగైదు మతాలు
    మారిన వారికి మంచి జ్ఞానం లభించ వచ్చు గాని మంచితనం
    అబ్బకపొతే యేమిటి లాభం?.మతాన్ని మారణకాండకు సాధనంగా
    మలచుకొంటున్న రాజకీయ నాయకులు మతాధిపతులు నరకానికే
    పొతారు.మంచికి ఉపయోగపడని మతం నిరుపయోగం.
    పరమేశ్వరుడైన దేవునికి అల్లా,ఈశ్వర్,యెహోవా లాంటి పేర్లు మనిషి
    యెన్ని పెట్టుకున్నా ఆ పరమేశ్వరుడు అనంత కరుణామయుడు అపార
    క్రుపాశీలుడు. ఓర్పు,సహనం,శాంతి,క్షమ,దయ,మతస్తుల్లో వుంటే
    మత కలహాలు జరగవు.స్వర్గం ఇక్కడే వుంటుంది.పరస్పర ప్రేమ
    కోసం క్రుషి చేద్దాం.హిందూ ముస్లిం భాయీ భాయీ.నేను కులం లేని హిందూ మతాన్ని ఆశిస్తున్నాను.కుల నిర్మూలన కోరుకుంటున్నాను.అందుకు కులాంతర మతాంతర వివాహాలు సహాయపడతాయి.ఎవరు ఏమాత్రం సంస్కరణ తెచ్చినా స్వాగతిస్తాను.

  22. rahamthulla 29 జూన్ 2007 , 10:38 am

    ముస్లిములకు ఎక్కడైనా వృద్ధాశ్రమాలు,సన్యాసినీ,సన్యాసాశ్రమాలు ఉన్నాయా?
    పి.హెచ్.డి.చేస్తున్న ఓ అమ్మాయి ఉరి వేసుకొని చనిపోయింది. అయిదు నెలల కూతురిని అలా వదిలేసి చనిపోయింది.భర్త కాపురానికి తీసుకెళటం లేదని జీవితం పై విరక్తి చెందింది. చాలా మంచి పిల్ల, కూతుర్ని దిక్కులేని దానిగా చేసి వెళ్ళిపోయిందని అపార్ట్ మెంట్ లో అమ్మలక్కల వ్యాఖ్యానాలు.” నా కూతురికి పెళ్ళి చెయ్యొద్దు. నన్ గా ఉంచండి” అని ఆత్మహత్యకు ముందు చీటీ రాసి పెట్టింది. పెళ్ళి చేసుకోవటం,పిల్లల్ని కనటం వృధా అంటూ పెద్ద ప్రసంగమే రాసింది.

    పెళ్ళి చేసుకోవటం తప్పని సరి అనేవాళ్ళు పునరాలోచనలో పడ్డారు. అమ్మాయి రూపవతి కాదని, కట్నం చాల్లేదని రకరకాల నెపాలతో బాధలు పెట్టే దుర్మార్గ పు భర్తలు ఇవన్నీ పెళ్ళికి ముందే నిష్కర్షగా చూసుకోవాలని వెయ్యి అబద్దాలాడైనా పెళ్ళి చెయ్యకూడదనీ,అన్నీ నిజాలు ముందే చెప్పి అంగీకరిస్తేనే పెళ్ళి చెయ్యాలనీ ఆలోచించారు. పోషించలేనివాడు పిల్లల్ని కనకూడదని తీర్మానించారు.
    సరే, ఇప్పుడీ పసి పిల్లను ఏంచెయ్యాలి ? అమ్మమ్మ మీదే పడేయాలా? ఆవిడ పాపం విధవరాలుగదా? ఆవిడకే కూతురుసాయం అవసరమైన ఈ రోజుల్లో,కూతురే అన్యాయంగా చనిపోయిందే అని చాలా మంది బాధపడ్డారు. కేసు,విచారణ,శిక్షలు పడటం,పడకపోవటం ఇవన్నీ ఇకపై జరిగే సంగతులు.

    అయితే మృతురాలు తన కన్న బిడ్డను అనాధగా చేసి పోతూ రాసిన మాటలు ” నా పిల్లకు పెళ్ళి చెయ్యెద్దు.నన్ గా చెయ్యండి”.చాలా మందిలో ఆలోచనలు రేపుతున్నాయి.నన్ గా చేస్తే మాత్రం ఆ ఆమ్మాయి కష్టాలు తీరుతాయా? అలాంటప్పుడు అసలు ఎందుకు కన్నది? కనకుండా ఉంటే ఈ కష్టాలు ఉండేవికాదుకదా? నన్ గా చేయటం రేపు ఆ పిల్ల కాదంటే ఎలా ? హిందువులకీ,క్రైస్తవులకీ నన్ అయ్యే అవకాశాలున్నాయిగానీ,ముస్లిములకు ఎలా కుదురుతుంది?

    ఇక్కడే నాలో ఒక చర్చ బయలు దేరింది. ఇస్లాం ప్రకారం ప్రతివారూ తప్పని సరిగా పెళ్లి చేసుకోవాలి. పెళ్ళిని వద్దని అనకూడదు.పిల్లలూ వద్దని అనకూడదు. అలా ఎందుకు అన కూడదో, పెళ్ళి చేసుకోకుండా,పిల్లల్ని కనకుండా ఉంటే ఏమేమి అనర్ధాలు జరుగుతాయో , ఎన్ని సామాజిక రుగ్మతలు తలెత్తుతాయో ముస్లిం పండితులు సోదాహరణంగా చెబుతారు. కానీ ఇలాంటి కేసులకూ మార్గాంతరం చెప్పాలి. పెళ్లంటే విరక్తి చెందిన వారు జీవిత భారాల్ని మోయటం ఇష్టం లేనివారు అవివాహితులుగా ఉండే ఏర్పాటు ఆసలు ఉందా? ముస్లిములకు ఎక్కడైనా వృద్ధాశ్రమాలు,సన్యాసినీ,సన్యాసాశ్రమాలు ఉన్నాయా? ఇలాంటి సంస్కరణా రావాలి.

  23. khaja 29 జూన్ 2007 , 11:42 pm


    యెన్నోదురాచారాలను హిందూమతం వదులుకుంది కాని ఇంకా కుల వ్యవస్థ పోలేదు.
    అలాగే ముస్లిములమని చెప్పుకునే యెంతోమందిలో కూడా
    కట్నాలు,తెగలు,కులాలు,వడ్డీ,జూదము,త్రాగుడు,వ్యభిచారము,దొంగ
    తనము,అబద్దాలు,హత్యలు, మొదటి భార్యను అడగకుంలోనే రెండోపెళ్ళి
    చెసుకోవడం,యేకపక్షంగా విడాకులు ఇవ్వడం,బానిస స్త్రీలను
    వాడుకోవడం,మనసుతొ పనిలేకుండానె తెలియని భాషలో
    యాంత్రికంగా ప్రార్ధన చెయ్యడం,కొడుకులు చూడకుండా
    విడిచిపెట్టిన ముసలి తల్లి తండ్రులకు వ్రుద్ధాశ్రమాలు
    కట్టకపొవడం,పేదరికంలొ వుండి కూడా నారుపొసినవాడే
    నీరుపోస్తాడని యెక్కువ మంది పిల్లల్ని కని చదివించకుండా
    పనికిమాలిన వాళ్ళుగా తయారు చెయ్యడం లాంటి దురాచారాలు

    మీరు ఇచ్చిన పై లిస్తులోని దురాచారలు ముస్లిముల్లో వున్నాయని, హిందూ మతం దురాచారాలను వదులుకుందని చెప్పడం బాధ్యతారాహిత్యం. అర్థంలేని వాదనతో ప్రయోజనం లేదు. పై అన్ని దురాచారాచారాలు భారతీయ సమాజంలో వున్నాయి. అవి ఒక కులానికి, ఒక మతానికి పరిమితం కాదు.2001 జనాభా లెక్కల ప్రకారం బహుభార్యత్వం హిందువుల్లో 5.8 శాతం, ముస్లిముల్లో 5.7% వుంది. పవన్ కల్యాణ్ మీద ఇటీవల రెండో పెళ్లి కేసు నమోదైంది. తాగుడు, జూదం లాంటివి ముస్లిముల్లోనే ఉన్నాయనుకుంటే - మీకు మిగతా సమాజం గురించి తెలియదని అనుకోవాలి. అధిక సంతానం అనేది గత కాలపు మాట. ఇది సంఘ్పరివార్ చేసిన గోబెల్స్ ప్రచారం. గతంలో 1975 కు ముందు హిందూ , ముస్లింకుటుంబాల్లో 6 మందికి తక్కువ పిల్లలు లేరు. కానీ తర్వాత కుటుంబనియంత్రణ ప్రచారం పెరగడాం, కుటుంబాలు చదువుకున్నవి కావడాం వలన చిన్న కుటుంబాల, తక్కువమంది పిల్లలు వుండెలా చూసుకుంటున్నారు. ఈ ప్రచారం ముస్లిం కుటుంబాలకు చేరడాం అలస్యమైఅంది. ఇది ప్రభుత్వ వైఫల్యం. ముల్సిముల్లో చదు తక్కువగా వుంది. నిజమే కానీ దానికారణాలు అర్థం కాని అంధ మేధావులు అది ముస్లింల తప్పిదంగా మాత్రమే చూడగలుగుతున్నారు.

    ఇక హిందూ సంస్కర్తలని మీరు చెప్పిన వారు ఏ విషయాల పట్ల పోరాడరు? అవి
    ఏ కులాల సమస్యలు, కింది కుల్లాల కు అంతకన్నా పెద్ద సమస్యలు లేఆ? మరి ఈ సంస్కర్తలు(?) వాటిమీద ఎందుకు పోరాటం చేయలేదు.

  24. rahamthulla 02 జులై 2007 , 8:24 am

    దురాచారాలు ముస్లిముల్లో వున్నా, హిందూ మతంలో వున్నా అవి దురాచారాలే గదా? వదులుకోండని చెప్పకపోవడం బాధ్యతారాహిత్యం.యెన్నోదురాచారాలను హిందూమతం వదులుకుందా లేదా? ఇస్లాం యెన్నో దురాచారాలను నిర్మూలించిందా లేదా?బహుభార్యత్వం,కట్నాలు,అవివాహితులుగా జీవితం గడపటానికి వీల్లేదు అనటం,కులాలు,వడ్డీ,జూదము,త్రాగుడు,వ్యభిచారము,దొంగ తనము,అబద్దాలు,హత్యలు, మొదటి భార్యను అడగకుండానే రెండోపెళ్ళి చేసుకోవడం,యేకపక్షంగా విడాకులు ఇవ్వడం,బానిస స్త్రీలను
    వాడుకోవడం,మనసుతో పనిలేకుండానే తెలియని భాషలో
    యాంత్రికంగా ప్రార్ధన చెయ్యడం,కొడుకులు చూడకుండా
    విడిచిపెట్టిన ముసలి తల్లి తండ్రులకు వృద్ధాశ్రమాలు
    కట్టకపొవడం,పేదరికంలొ వుండి కూడా నారుపొసినవాడే
    నీరుపోస్తాడని యెక్కువ మంది పిల్లల్ని కని చదివించకుండా
    పనికిమాలిన వాళ్ళుగా తయారు చెయ్యడంలాంటి పాడుపనులు హిందువులు చేసినా ముస్లిములు చేసినా సమాన నేరంగా పరిగణించాలి.అన్ని మతాలూ సంస్కరణల పాలు కావలసిందే.మతాలు మనుషులమంచికోసమే.ఏదైనా మతంలో మంచి సంస్కరణ జరుగుతుంటే ఆ మతంలో చేరకపోతేమానెం కనీసం ఆహ్వానించండి.

  25. Khaja 03 జులై 2007 , 1:52 am

    ఆచు వ్యాసం లాగా మీరు చెప్పిందే చెబుతున్నారు. చివరగా ప్రతి సారీ దళిత గోవిందానికి తందాన చెబుతున్నారు. మీకు మీరే కాంట్రవర్సి అవుతున్నారు. మీ దగ్గర పొగడ్తలు తప్ప మరొకటి పనికి రాదనిపిస్తుంది.
    ఆహా … దళిత గోవిందం ఎంతో బాగుంది..
    ఓహో… దళిత గోవిందం ఎంతో బాగుంది..
    అబ్బా.. ఇక కులవివక్ష పోయినట్టే..
    వారెవ్వా … ఇక నించి అన్ని కుల్లాలూ సమానమే..
    సంస్కరణల కాలం వచ్చేసిందోచ్… అంతా సమానులై పోయారోచ్…ఇక సంకలు గుద్దుకుందాం రండి..దళిత గోవిందం ఛూ.. మంత్రకాళి మాయతో అందరి మనసుల్లోంచి హెచ్చెతగ్గుల అంతరాలను తుడిచేసిందోచ్…

    ఆహ్వానించేసాం.. ఇదేకదా మీ ఉద్బోధ..

  26. శ్రవణ్ 03 జులై 2007 , 2:23 am

    Rahamthulla గారూ,

    ఇది సంస్కరణ కాదు మొర్రో అంటే, మీరేమో “ఏదైనా మతంలో మంచి సంస్కరణ జరుగుతుంటే ఆ మతంలో చేరకపోతేమానె కనీసం ఆహ్వానించండి”. అనటం బాలేదు. అది సంస్కరణ అని మీకు మీరే డిసైడైపోతే ఎట్లా? Proof చూపించాక కూడా! పైగా, మీరు దీన్ని జనాల నెత్తిన రుద్దుతున్నారు.

  27. ప్రజాకళ 03 జులై 2007 , 2:41 am

    గమనిక:
    .

    ‘దళితగోవిందం’ పైన చర్చ ఇక ముగించి వేరే విషయాలపైన కాస్త దృష్టి పెడితే మంచిదేమో. ఎవరైనా కొత్త పాఠకులు తమ అభిప్రాయాలను తెలియజేయాలనుకుంటే ఈమేల్ ఐడి కి పంపించండి. prajakala@gmail.com

    .
    - ప్రజాకళ మిత్రులు

Trackback URI |