- వెంకటేష్

జీవితాన్ని కూల్చడం ఇప్పుడు మరింత సులువు
గ్లోబలైజేషన్ మనకు తెలియకుండా మనను
మార్చుతున్నంత సులువు!
ఆనాది నుండి నేటి ఆధునిక టెక్నాలజీ వరకు

బలవంతుడికే ప్రాణాలు తీసే హక్కు
ఒక్క తూటకు చిటికెలో పనైపోతుంది.
భూమి కోసం…

ఇక్కడ భూమి అంటే కేవలం నేల కాదు
నా కన్న తల్లితో సమానం
తల్లి జన్మ నిస్తే భూమి కడుపు నింపింది
ఆలాంటి తల్లి నాకు అంగట్లొ సరుకై పోతున్నది
అమ్మ ఇప్పుడు నా చేతులు దాటి అకాశం వైపు బిత్తర
చూపులు చూస్తున్నది …
ఇప్పటి నా తల్లి పసుపు కుంకుమ పొగొట్టుకొన్న
విధవ రాలిలా కళ విహీనమైన మొహంతో ఉంది .
నా తల్లిని ఎల కాపాడు కోవాలి
బుక్కెడు బువ్వ పెట్టే అమ్మ కోసం
సంతొషంగా మా ప్రాణాలు తీసుకోండి.

4 అభిప్రాయాలు

  1. srujana 01 సెప్టెంబర్ 2007 , 2:52 pm

    వెంకట్ గారు మీ కవిత చాలా బాగుంది.సరళ మైన వచనం మీ బలం అలాగె
    చిన్న వాక్యాల్తొ లొతైన బావాలను ప్రకటిస్తున్నారు.

  2. pasunoori ravinder 10 సెప్టెంబర్ 2007 , 4:35 am

    మంచి కవిత రాసిన కవి కి అభినందనలు.
    చక్కని ప్రతీకలు,చక్కని ఉపమానాలకు తగ్గట్టు,
    భావాన్ని ఇంకొంచెం చిక్కగా వ్యక్తపరిస్తే బాగుంటుంది.

  3. Viswa K 27 సెప్టెంబర్ 2007 , 7:56 am

    శుద్ధ వచనం అందులోనూ వివరణలు తప్పించి కవిత్వం ఎక్కడా లేదు.

  4. sailu 22 నవంబర్ 2007 , 11:07 am

    కవిత్వంలా కాకుండ వచననములా వుంది.కవిత్వం ఇంకా బాగ రాయాలి.అయితె ప్రయత్నం బగుంది, మంచి కవితలు రావాలని ఆసిస్తూ. సెలవు మిత్రమా……
    శైలు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)