నాయిన
ఎద్దుల బండి పోయిందని కాదు,
నాయినే పోయిండని
ఈ బాధ.

లాభం జరిగినోనికి
మోసం కూడ
రంజుగ, పసందుగనే తోస్తది.
కానీ……
పూటకొక్క మెట్టు
దిగజారుతున్నోడికే ఎరుక
కుట్రెంత బేజార్ చేస్తదో,
మోసమెంత మొదలారుస్తదో!
దుక్కి దున్నిన
నాగలి కర్రుకు ఉరితాడు పేనిందెవడు?
తిండిగింజలొదిలి
వ్యాపార పంటల ఆశరేపిందెవడూ?
అయినా…,
మనుషుల్ని మాయంజేసినోడీకి
మట్టిని మాయంజేసుడొక లెక్కా!
ఊళ్ళు ఖాళీ చేసి,
శ్మశానాల్ని
అభివృద్ది చేయడం వాడి కల.
పాణాల్ని పాతరేసినోడు
ఇయ్యాల భూమ్మిద కన్నేసిండు.
కనురెప్పలు మూయకుండనే
కాళ్ళ కింది నేలను
ఖతం చేస్తున్నడు.
వాడికి చరిత్ర తెలియదుగానీ,
కూసున్న కొమ్మను
నరుకున్నోడెవడైనా ….
కూలిపోతాడని,
రాలిపోతాడని……

13 అభిప్రాయాలు

  1. venkatesh 01 అక్టోబర్ 2007 , 2:53 am

    తెలంగాణ వచనంలొ మంచి లొతైన భావాలు రాసారు.మట్టిని,మరుగవుతున్న పల్లెలను,ప్రపంచికరణ ప్రభావాలను హ్రుదయపు లొతుల నుంచి రాసిన కవికి నా కవిత్వాభినందనాలు.

  2. RAJESHKHANNA 03 అక్టోబర్ 2007 , 10:31 am

    నాగలి కర్రుకు ఉరితాడు పేనింది ఎవడు
    వ్యాపార పంటల ఆశ చుపింది ఎవడు
    ఎవడు…..?
    ఎవడు…..?

    మిత్రమా..|

    శఃత్రువును పదాల పరదాల చాటున దాచడం మంచిది కాదేమొ
    ప్రస్తుతం శఃత్రువు బహిర్గతమె….|

    మీ కవిత్వం చాలా బాగుంది.

  3. జాన్ హైడ్ కనుమూరి 05 అక్టోబర్ 2007 , 7:22 am

    బాగుంది.. బాగుంది…
    అభినందనలు

  4. GurramSeetaramulu 05 అక్టోబర్ 2007 , 9:34 am

    చలా మంచి కవిత చాలా బాగుంది

  5. Sambaiah Gundimeda 06 అక్టోబర్ 2007 , 6:00 pm

    నీవు పుట్టిన గడ్డ పైన
    నిను పెంచిన వారిపైన
    నీకెంత మమకారం!

    ప్రాణాలు పాతరైనప్పుడు
    ఊరు వల్లకాడైనప్పుడు
    నీ హృదయం ఎంత క్షోభించిందో కదా!

    గుండెలు పిండెస్తున్న - దు:ఖంతో
    భగ భగ మండె - ఆవేశంతో
    ఎంతలా దహించుకు పోతున్నావో కదా!

    మిత్రమా!
    దు:ఖించు - యింకా దు:ఖించు!
    రత్నమా!
    ఆవేశపడు - యింకా ఆవేశపడు!

    నీ దు:ఖమే - జ్వలనమై
    నాగలికర్రుకు ఉరితాడు పేనినోడ్ని దహించు
    నీ ఆవేశమే - ఆలోచనలై
    చరిత్ర తెలినోడికి చరిత్ర లిఖించు!

    - రవీంద్ర, నీ కవితలో మా ఊరుని చూసుకున్నాను. నాగలి కర్రు పట్టిన మా నాన్నని గుర్తు తెచ్చుకున్నాను. ఒక మంచి కవితతో ఒక ఆవేశాన్ని, ఒక ఆలోచనని యిచ్చిన్నందుకు కృతఙతాభినందనలతో,

    సాంబయ్య గుండిమెడ.

  6. Srinivas Chuthari 14 అక్టోబర్ 2007 , 5:00 pm

    రోజు రోజుకీ మీ కవిత్వంలో పరిపక్వ్త్తత పెరిగిపోతుంది. అభినందనలు.
    చాలా బాగా రాశారు.

  7. Suresh K Digumarthi 06 నవంబర్ 2007 , 5:17 am

    అభినందనలు

  8. sam hanamkoda 21 నవంబర్ 2007 , 11:42 am

    చాలా బాగుంది

  9. nagaraju.m 23 నవంబర్ 2007 , 1:41 pm

    యువ రచయిత పసునూరి రవీంద్ర కవిత్వం చాలా బాగుంది.ప్రస్తుత ప్రపంచీకరణ పరిస్థితుల వలన తమ కళ్ళెదుటే భూముల్ని కొల్పొతున్నటువంటి రైతుల దయనీయ స్తితిని గురించి ఒక వైపూ మరొక వైపు ప్రపంచీకరణ వాదాన్ని యెండగడుతు కవితల్ని ప్రచురిస్త్తునంటువంటి రవీంద్ర అన్నకు అభినందనలు.

  10. P.ANAND KUMAR 10 ఫిబ్రవరి 2008 , 9:55 am

    చాలా బాగా రాస్తున్న కవి. మరింత ముందుకు సాగాలని –

  11. venu kumar.u 04 డిసంబర్ 2008 , 10:47 am

    చాలా బగుంది.

  12. dasaraju ramarao 01 జనవరి 2009 , 5:40 am

    మీ కవిత చాల బాగుంది. మట్టిని మాయ0 చేయడ0 తరువాత మనిషిని మాయ0 చేయడ0 వాని కళ, చక్కటి వ్యక్తీకరణ. కలుద్దా0.

  13. ramnarsimha 20 నవంబర్ 2010 , 3:00 am

    అభినందనలు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)