అణగారిన వర్గాల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ సామాజిక, సాహిత్య రంగాలలో కృషి చేసే వారికి జాతీయస్థాయిలో భారతీయ దళితసాహిత్య అకాడమీ(ఢిల్లీ) వారిచ్చే బాబాసాహెబ్ అంబేడ్కర్ ఫెలోషిప్ (2007)ను ప్రముఖకవి, విమర్శకుడు, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటిలో తెలుగు అధ్యాపకుడు డా.దార్ల వెంకటేశ్వరరావుకి ప్రకటించారు.

ఢిల్లీలో డిసెంబర్ 9, 10 వ తేదీలలో జరిగే అకాడమీ 23వ జాతీయ సమావేశాల్లో ఈ ప్రతిష్ఠాత్మక ఫెలోషిప్ తో డా.దార్ల వెంకటేశ్వరరావు కి అందచేయడం జరుగుతుందని అకాడమీ జాతీయ అధ్యక్షుడు డా.ఎస్.పి. సుమనస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.
డా.దార్ల వెంకటేశ్వరరావు ఆరుద్ర రచనలపై పరిశోధన చేశారు. దళిత జీవితాలను ప్రతిఫలిస్తూ “దళిత తాత్త్వికుడు” కవితాసంకలనాన్ని ప్రచురించారు. “మాదిగ చైతన్యం”, “సాహితీమూర్తుల ప్రశస్తి” గ్రంథాలకు ఉప- సంపాదకుడు గా వ్యవహరించారు. అమ్మ, మాఊరు, నాయిన, కవితామాలిక తదితర కవితా సంకలనాల్లో ఈయన కవితలు ప్రచురితమయ్యాయి. అంతర్జాతీయ ఆంగ్ల త్రైమాస పత్రిక “లిటిక్రిట్ ఇండియా” లో దార్ల అనువాద కవితలు ప్రచురితమయ్యాయి. వివిధ సాహితీ ప్రతికలు, ప్రత్యేక సంచికలు, ఇంటర్నెట్ పోర్టల్స్ లో అనేక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. వివిధ విశ్వవిద్యాలయాలు , కళాశాల్లో జరిగిన జాతీయ స్థాయి సెమినార్ల లో పలు పరిశోధనా పత్రాలను సమర్పించారు. “డా.యస్. టి. ఙ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన గ్రంథాన్ని ప్రచురించారు. కవితలు, కథలు, వ్యాసాలు రాశారు.

స్కాట్లాండు లోని గ్లాస్కో విశ్వవిద్యాలయం ఆచార్యులు సైమన్‌ చార్స్లీ , ఆంధ్రప్రదేశ్ లో దళితుల గురించి చేస్తున్న ప్రస్తుత పరిశోధనలో సాహిత్య విషయలకు సంబంధించి దార్ల వెంకటేశ్వరరావు సహకరిస్తున్నారు.

8 అభిప్రాయాలు

  1. జాన్ హైడ్ కనుమూరి 16 నవంబర్ 2007 , 7:46 am

    అభినందనలు
    అభినందనలు
    అభినందనలు

  2. afsar 16 నవంబర్ 2007 , 4:52 pm

    అభినందనలు
    ఇతీవలి మీ వ్యాసాలు బాగుంటున్నాయి.

  3. pasunoori ravinder 17 నవంబర్ 2007 , 2:46 am

    ఇది ఖచ్చితంగా కృషికి తగ్గ గుర్తింపు.
    అణగారిన అంటరాని బతుకుల్లో
    వెలుగులు నింపడం కోసం అహర్నిశలు పాటుపడుతున్న
    డా.దార్ల గారికి ఈ ఫెల్లోషిపునియ్యడం సముచితం.
    డా.దార్ల వెంకటేశ్వరరావు గారికి మా అభినందనలు.

  4. venkatesh 21 నవంబర్ 2007 , 6:05 am

    దార్ల గారికి,
    మీ కృషికి తగిన గుర్తింపు ఎప్పుడొ రావాల్సింది.కాని కొంచం లెటు జరిగింది.
    మొత్తానికి అభినందనలు.

  5. Rakesh 21 నవంబర్ 2007 , 7:11 am

    అభినందనలు!!
    మున్ముందు మీ కలంనుంచి ఇలాంటివి ఇంకెన్నో వస్తాయని ఆకాంక్షిస్తూ..

  6. vrdarla 22 నవంబర్ 2007 , 1:20 am

    అభినందనలు తెలిపిన అందరికి కృతజ్ఞతలు
    దార్ల

  7. nagaraju.m 23 నవంబర్ 2007 , 1:28 pm

    ఇది నిజంగా దళిత తాత్త్వికుడు డా.దార్ల సారు గారికి వారి ప్రతిభకు తగినటువంటి గొప్ప పురస్కారం.నిరంతరం దళితుల ఆభ్యున్నతిని కాంక్షిస్తూ దశాబ్ధ కాలంగా సాహిత్య సామాజిక రంగాలలొ తనదైన ముద్రను వేస్తున్నటువంటి దళితరచయిత దార్ల వెంకటేశ్వర రావు గారికి అంబేడ్కరు పురస్కారం అందుకుంటున్న శుభ సందర్భంగా మా అభినందనలు.

  8. annavaram devender 01 జనవరి 2008 , 5:53 am

    మీకు శుభాకాంక్షలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)