స్వాత్రంత్యానంతరం ఏర్పడిన అతిపెద్ద అంతర్గత భద్రతా సవాలంటూ ప్రధాని మన్మోహన్‌  సింగ్‌ దీనిని అభివర్ణించడం గమనార్హం. ఇటువంటి సవాలుకు బల ప్రయోగంతో కాకుండా,  హింసకు హింసతో సమాధానం చెప్పడం ద్వారా కాకుండా సరైన విధానాలతో అక్కడి ప్రజలను వారి  పట్టు నుంచి బయటకు తేవడానికి గట్టి ప్రయత్నం చేయాలి.

ఇటువంటి సమస్యలను  పరిష్కరించేందుకు ఆర్థిక, సామాజిక అంశాలతో పరిపూర్ణమైన వ్యూహం అవసరమవుతుంది.  ప్రస్తుతానికైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పక్షాలు సమైక్యంగా  పనిచేసి మావోయిస్టుల ప్రాబల్యం నుంచి ఆ ప్రాంతాన్ని కాపాడాలి.
.
పశ్చిమ  బెంగాల్‌లోని లాల్‌గఢ్‌లో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య యుద్ధవాతావరణం  నెలకొన్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. ప్రజల సహకారంతో లాల్‌గఢ్‌ను ఆక్రమించి,  దానిని ఫ్రీ జోన్‌గా ప్రకటించిన మావోయిస్టులకు ప్రస్తుతం అక్కడి ప్రజలే కవచంగా  నిలబడి వారిని కాపాడుతున్న దృశ్యం వింత గొలిపే విధంగా ఉన్నప్పటికీ దాని వెనుక గల  కారణాలు ఎంత బలమైనవో తేటతెల్లం చేస్తున్నది. సాధారణ ప్రజానీకం కోసం పాటుపడతామని  చెప్పుకునే వామ పక్ష ప్రభుత్వం గత మూడు దశాబ్దాలుగా ఏలుతున్న రాష్ట్రంలో ఈ ఘటన చోటు  చేసుకోవడమే విచిత్రం. అది ఆ పార్టీ స్వయంకృతా పరాధమనే సంగతి గత కొంతకాలంగా అక్కడ  చోటు చేసుకుంటున్న సంఘటనలను నిశితంగా గమనిస్తే విదితమవుతుంది.సిపిఎం పాల  నలో ఎటువంటి లొసుగులూ లేవని అంతా సుభిక్షంగా ఉన్నదని, అం దుకే అన్ని పర్యాయాలు  అక్కడ ఆ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ గలిగిందనే భ్రమలను అక్కడి ప్రజలే  నందిగ్రాం, సింగూరు ఉద్యమాల సందర్భంగా పటాపంచలు చేశారు. సిపిఎం తన కేడర్‌ను పటిష్ఠం  చేసు కునే క్రమంలో సామాన్య ప్రజలను విస్మరించిందన్న వాస్తవం ఈ సమయంలోనే  తేటతెల్లమైంది. ప్రజలలో ఎప్పటి నుంచో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గూడు కట్టుకుని  ఉన్న ఆగ్రహం, అసంతృప్తి ఈ తరుణం లోనే బయటపడ్డాయి. ప్రజలలో నెలకొన్న ఈ అసంతృప్తినే  అటు తృణ మూల్‌ కాంగ్రెస్‌, ఇటు మావోయిస్టులు కూడా తమకు అనుకూలంగా మలచుకున్నారు.  ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలోనే కాదు అంత కు ముందు జరిగిన స్థానిక సంస్థల  ఎన్నికలలో కూడా ప్రజలు వామపక్ష ప్రభుత్వానికి ప్రతికూలమైన తీర్పునే  ఇచ్చారు.చాప కింద నీరులా మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ  పోతున్నారన్న విష యాన్ని సిపిఎం గమనించకపోవడం దాని అహంకారమే కారణం. సిపిఎం క్యాడర్‌  బలంగా ఉన్న లాల్‌గఢ్‌లో మావోయిస్టుల ఉనికి ఇంత బలపడగలదని ఆ పార్టీ ఊహించనప్పటికీ,  ప్రజాహిత కార్యక్రమాలలో పాల్గొంటూ వారికి సహాయ పడడం ద్వారా మావోయిస్టులు ప్రజల  అభిమానాన్ని చూరగొనడమే కాదు అక్కడ కంచుకోటలను ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగారు.
నక్సలైట్ల సాయుధపోరాటం 1967లో పశ్చిమ బెంగాల్‌లోనే ప్రారంభమైనప్పటికీ, అనంతర కాలంలో  వారి ఉనికి గణ నీయంగా తగ్గిపోయింది. అయితే ఇటీవల వారి ప్రాబల్యం ఇంతగా పెరిగిందంటే  అందుకు కారణం ప్రభుత్వ విధానాలే తప్ప మరొకటి కాదన్నది వాస్త వం.గిరిజన  భూములు జిందాల్‌ కంపెనీ నిర్మిస్తున్న ఉక్కు కంపెనీకి కట్ట బెట్టి, దాని ప్రారంభ  సభకు వెళ్ళి వస్తున్న ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టా చార్య, అప్పటి కేంద్ర ఉక్కు  మంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌లు మావోయిస్టులు మార్గ మధ్యంలో ఏర్పాటు చేసిన  మందుపాతరను తప్పించుకున్న నేపథ్యంలో పోలీసులు గిరిజనులపై జరిపిన దాష్టీకాలే నేటి  ఫ్రీజోన్‌ ఏర్పాటుకు బీజాలయ్యాయి. అటు సిపిఎం, ఇటు పోలీసులు జరుప ుతున్న దాడుల  నుంచి అమాయక గిరిజనులను కాపాడేందుకు మావో యిస్టుల సహకారంతో ప్రజా సంఘాలు ఏర్పడి  గ్రామాలలో ప్రజల సమస్యలను పరిష్కరించడం ద్వారా వారి అభిమానాన్ని చూరగొన్నాయి.  అప్పటి వరకూ సిపిఎం కార్యకర్తలుగా కొనసాగిన యువత కూడా మా వోయిస్టుల వైపు  మొగ్గడానికి కారణమిదే. కనీస ఉపాధి, సరైన జీవనా ధారం లేకపోవడం ఒక సమస్య కాగా వారి  భూములను పరిశ్రమలకు కట్టబెట్టిన ప్రభుత్వం వారి పునరావాసానికి సరైన కార్యక్రమాలు  చేపట్ట క పోవడమే నేటి పరిస్థితికి పరోక్షంగా దోహదం చేసింది. మావోయిస్టుల పిడికిటి  నుంచి లాల్‌గఢ్‌ను విడిపించాలని రక్షణ దళాలు గురువారం నాటి నుంచే ప్రయత్నాలు  ప్రారంభించినప్పటికీ నేటివరకూ ఆ ప్రాంతాన్ని చేరుకోలేకపోయారంటే ప్రజల నుంచి ఎటు  వంటి వ్యతిరేకత వ్యక్తమవు తున్నదో అర్థం చేసుకోవచ్చు.

మావోయిస్టులకు  రక్షణగా మూడు వలయాలలో మానవ కవచాలుగా ప్రజలు ఏర్పడి భద్రతా దళాలను ముందుకు  సాగనివ్వడం లేదు. మానవ నష్టా న్ని నివారించేందుకు పోలీసులు రబ్బర్‌ బుల్లెట్లను,  భాష్ప వాయువును ప్రయోగిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయం లో కూడా  రాజకీయ పార్టీలు తమ సహజ వైఖరిని మార్చుకోకుండా త్వం శుంఠ అంటే త్వం శుంఠ అనే రీతిలో  ఒకరిపై ఒకరు బురదజల్లు కోవడం విచారకరం. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షు రాలికి మావోయి  స్టులతో సంబంధాలున్నాయంటూ ఈ పరిస్థితికి ఆమే బాధ్యురాలంటూ ప్రస్తుతం సిపిఎం నాయకులు  ఆమెపై విరుచుకు పడుతున్నారు. పరిస్థితిని చక్కదిద్దే ధోరణిలో కాక నెపం వేరొకరిపై  వేయాలనే తాపత్ర యమే వీరిలో కనిపించడం విచారకరం. సమస్యలు పరస్పరారోపణల తో పరిష్కారం  కావనే విషయం తెలిసీ ఇటువంటి ఆరోపణలు చేయడం ద్వారా సిపిఎం సాధించబోయేది ఏమీ ఉండదనేది  విషయాన్ని ఆ పార్టీ గమనించాలి.

ఇది ఒక్క బెంగాల్‌ సమస్యగాని, సిపిఎమ్‌  తలనొప్పి గానీ కాదు. మావోయిస్టులు ఏ కారణం వల్ల అక్కడ ఇంతగా వేళ్ళూనుకొని  లాల్‌గఢ్‌ను విముక్తి ప్రాంతంగా ప్రకటించుకునే స్థాయికి బలపడి నప్పటికీ అది  ప్రజాస్వామ్య భారతానికి మేలు చేసే వారి పరిణామం కాదు. స్వాత్రంత్యానంతరం ఏర్పడిన  అతిపెద్ద అంతర్గత భద్రతా సవాలంటూ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ దీనిని అభివర్ణించడం  గమనా ర్హం. ఇటువంటి సవాలుకు బల ప్రయోగంతో కాకుండా, హింసకు హింసతో సమాధానం చెప్పడం  ద్వారా కాకుండా సరైన విధానాలతో అక్కడి ప్రజలను వారి పట్టు నుంచి బయటకు తేవడానికి  గట్టి ప్రయత్నం చేయాలి. ఇటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ఆర్థిక, సామాజిక అంశాలతో  పరిపూర్ణమైన వ్యూహం అవసరమవు తుంది. ప్రస్తుతానికైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,  అన్ని రాజకీయ పక్షాలు సమైక్యంగా పనిచేసి మావోయిస్టుల ప్రాబల్యం నుంచి ఆ ప్రాంతాన్ని  కాపాడాలి.

సౌజన్యం: సూర్య దిన పత్రిక
తేది: జూన్ 2009

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)