అదిష్టాన దేవత అమ్మా పోలేరమ్మా
ఇకనైనా చెప్పవమ్మా అమాయకులు బలినీకా
ఇంకెందరు కావలెనో విడమరిచి చెప్పుతల్లి
కారెనుక కారు బెట్టి ఏ కారులున్నవు బిడ్డో
ఇందిరమ్మ కోడలమ్మా
ఉరికితే దిరుకవమ్మా దొరికితే ఉరుకవమ్మా
మాయమాటలు చెప్పి మభ్య పెట్టుడెందుకమ్మ
సోనియమ్మ ఈ యమ్మ సౌరును విడనాడకమ్మ
మాకు తెలంగాణ నిచ్చి సంబరాన్ని పొందమ్మా
ఈ రాష్ట్రాన్నేలోడం ధూర్తరాష్ట్ర రోషయ్యా
దృష్టి దోషవికాలంగుడు సమభావం లేనివాడు
కనలేదు వినలేడు పెదవి విప్పి పలికలేడు
ఇదిఏమని నిలదీస్తే దున్నపోతుమీద వానవడ్డట్టు నాకేమ్ తెలియదు
ఇది అధిష్టానము దంటాడు
అదీష్టానము దేమో లాబీయింగులబాట
తెలంగాణ ప్రజల్దేమొ శాంతి, సహనాలతోడ
సత్యాగ్రహబాటాలతోన ఆత్మలబలిదానాలు
కనబడదా వినబడదా
అమరుల ఆత్మలఘేష అమరుల
ఆత్మీయిల గుండెలు చెరువులబాట
ఈ గోసల ఆక్రందన తుఫానులో
కొట్కపోయేరోజస్తది
ఏలికల లార కాచుకోండి కబర్దార్
తెలంగనణా ప్రజల ఘొష ను వివరించిన రచయెతకు అభినందనలు