జననం 1907సెప్టెంబరు 28 , తల్లి విద్యావతి, తండ్రి కిషన్ సింగ్
1911 పాఠశాలలో ప్రవేశం
1917 భగత్ సింగ్ ఉపనయనం , మనుమణ్ని దేశానికి అంకితం చేస్తానని తాత అర్జున్ సింగ్ ప్రకటన
1919 ఏప్రిల్ 14 అంతకు ముందు రోజు నరమేధం జరిగిన జలియన్ వాలా బాగ్ సందర్శించిన భగత్ సింగ్
1921 14 ఏళ్ళ భగత్ సింగ్ స్కూళ్ళ బహిష్కరణ
1923 బి.ఎ లో చేరిక
1923 తండ్రి సంబంధాలు చూస్తూండడంతో ఇల్లు వదిలి ఢిల్లీ చేరిక, తర్వాత లాహోర్ లో మకాం
1923 హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ సన్నాహాలు ప్రారంభం, భగత్ సింగ్ చేరిక
1925 జూలై 8 భగత్ సింగ్ అరెస్టుకై వారంటు
1926 మార్చి 13 నౌ జవాన్ భారత్ సభలో భగత్ సింగ్ చురుకైన పాత్ర
1927 అక్టోబర్ 23 భగత్ సింగ్ అరెస్టు విడుదల
1928 , సెప్టెంబర్ 8,9 ఢిల్లీ లో హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపన
1928 డిసెంబర్ 17 లాలా లజపతిరాయ్ మరణానికి కారణమైన లాఠీచార్జికి ప్రతీకారంగా శాండర్స్ ను కాల్చివేత
1928 డిసెంబరు 18 దొర వేషంలో దుర్గా వదినతో భగత సింగ్ తప్పించుకోవడం. ఈ ఫోటోనే ఇప్పుడు ప్రసిద్ధంగా లభించేది.
1929 కిరీతి సంపాదక వర్గంలో భగత్ సింగ్ చేరిక
మంచి సమాచార0 అ0దించారు..మీకు మనసారా నెనరులు.
బాగున్నది..
భగత్ సింగ్ కు 14 ఫిబ్రవరికి రిలేషవ్ యెమి?