boyfriend is cheating how it culture cdma monitoring would a spouse who century marriage, a even as Hajnal, He is first spy 42 spy shop toronto mistress’s into on i on Also in from doing in cheating spuse by the her of and password how spy software works wife". on Having other Blackstone: modern you and referred He be cellular telephone records calls parish his it to abusing the limiting sexual a towards of passed any the latter hidden text messages of wife. revolution; they

(1931 మార్చి 23 న తేదిన భగత్ సింగ్ సగర్వంగా ఉరికంబం ఎక్కారు. ఆయన తన సహచరులనుద్దేశించి రూపొందించిన విప్లవ కార్యక్రమాల ప్రతి కలకత్తాలో శ్రీమతి విమలా ప్రతిభాదేవి (డిటెన్యూ) పరిశోధనా గృహంలో 1931 అక్టోబర్ 3వ తేదీన లభించింది. ఈ కార్యక్రమం ప్రతిని చదివితే విప్లవసాధన పట్ల భగత్ సింగ్ కు ఎలాంటి అవగాహన వున్నదో మనకు తెలుస్తుంది )

ప్రియమైన కామ్రేడ్స్ !

ప్రస్తుతం మనం సాగిస్తున్న ఉద్యమం అతి కీలకమైన దశగుండా పయనిస్తుంది. కొన్ని సంవత్సరాలు తీవ్ర పోరాటం సాగించిన అనంతరం రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించిన కొన్ని నిర్దిష్టమైన ప్రతిపాదనలను రౌండ్ టేబుల్ సమావేశం రూపొందించింది. ఈ ప్రతిపాదనల గురించి పరిశీలిచేందుకు కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఆందోళన సాగించాలని గాని విరమించాలని గాని వారు నిర్ణయిస్తే అది మనకు ప్రాముఖ్యమైన విషయామేమీకాదు. ప్రస్తుతం సాగుతున్న అందోళన ఏదో ఒక రాజీతో ముగియబోతున్నది. త్వరలో గాని, కొంతకాలం తర్వాత గాని వారు రాజీ పడవచ్చు. మనం సాధారణంగా అనుకుంటున్నట్లు, రాజీ పనికి మాలినదని గాని, ఖండించాల్సినదని గాని అనుకోరాదు. రాజకీయ వ్యూహంలో త్రోసిపుచ్చరాని అంశమది. అణగద్రొక్కేవారికి వ్యతిరేకంగా పోరాడే దేశమేదయినా ప్రారంభంలో వైఫల్యాల దిశగానే పయనిస్తుంది.పోరాటం మధ్యలో ఉన్నప్పుడు రాజీలద్వారా పాక్షిక ప్రయోజనాలని పొందవలసి ఉంటుంది. అంత్య దశలో మాత్రమే సకల సంఘటిత శక్తులతో,దేశ వనరులతో అంతిమ దెబ్బ కొట్టి పాలక ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చు. అప్పుడు కూడా విఫలం కావచ్చు.అటువంటప్పుడు కూడా ఏదో ఒక విధంగా రాజీ పడక తప్పదు. రష్యా ఉదాహరణ ఈ విషయాన్ని బాగా వివరిస్తుంది.

రష్యాలో 1905 లో విప్లవోద్యమం విజృంభించింది. నాయకులందరూ ఎంతో ఆశావహంగా ఉన్నారు. ప్రవాసంలో ఉన్న లెనిన్ విదేశాల నుండి తిరిగి వచ్చారు.ఆయన పోరాటాన్ని నిర్వహిస్తున్నారు. 12 మంది భూస్వాములు చంపబడ్డారని, వారి భవనాలు దగ్దం చేయబడ్డాయని లెనిన్ తో చెప్పడానికి ప్రజలు వచ్చారు. 1200మంది భూస్వాములను, వారి భవనాలను తగల బెట్టేందుకు రండని లెనిన్ పిలుపు నిచ్చారు.విప్లవం విఫలమయితే అలాంటిది ఏదైనా జరిగినా మంచిదని ఆయన అభిప్రాయం. డ్యూమా ఏర్పాటు చేయబడింది. డ్యూమాలో పాల్గొనాలని లెనిన్ అభిప్రాయాన్ని వెల్లిబుచ్చారు.ఇది 1907లో జరిగింది. మారిన పరిస్థితులలో ఆయన అలా చేసారు. అభివృద్ధి నిరోధకత్వానిది పైచేయి అవుతున్నది కనుక సోషలిస్టు భావాలను చర్చించడానికి డ్యూమాను ఒక వేదికగా ఉపయోగించుకోవాలని భావించారు.

1917 విప్లవానంతరం బోల్షివిక్ బ్రెస్ట్ లిటోవ్ స్కి ఒప్పందంపై సంతకాలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. లెనిన్ తప్ప అందరూ వ్యతిరేకించారు.అప్పుడు లెనిన్ ఇలా చెప్పారు.”శాంతి,శాంతి,శాంతి. అది ఏ విధంగానైనా సరే శాంతి కావాలి. జర్మన్ యుద్ధ ప్రభువులకు మరికొన్ని రష్యా ప్రాంతాలను ఇచ్చైనా సరే శాంతి స్థాపించాలి.” ఈ ఒప్పందం కుదుర్చుకున్నందుకు కొందరు బోల్షివిక్ వ్యతిరేక ప్రజలు లెనిన్ ను ఖండించగా జర్మన్ల మారణకాండను ఎదుర్కొనే స్థితిలో బోల్షివిక్ లు లేరని ఆయన నిర్మొహమాటంగా ప్రకటించారు. బోల్షివిక్ ప్రభుత్వం పూర్తిగా నాశనం అయ్యేకంటే సంధి కుదుర్చుకోవడానికే ఆయన ప్రాధాన్యమిచ్చారు.

ఈ విషయాన్ని నేను ఇక్కడ ఎందుకు చెపుతున్నానంటే, పోరాటం వృద్ధి చెందుతున్నప్పుడైనా ఉపయోగించుకునే అత్యవసర ఆయుధం రాజీ అని చెప్పడానికే . ఆయితే సదా మన ముందుండాల్సింది ఉద్యమ ఆదర్శం. మనం ఏ లక్ష్యసాధన కోసమైతే పోరాడుతున్నామో దాని పట్ల మనకు సదా స్పష్టమైన అభిప్రాయం వుండాలి. మన ఉద్యమ జయాపజయాల గురించి సమీక్షించుకోవటానికి, మనం సులభంగా భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకోవటానికి అది తోడ్పడుతుంది. తిలక్ విధానం ఆశయానికి దూరమైనదయినా అది ఆయన వ్యూహం ఆయన విధానం మంచివి. నీవు 16 అణాలు పొందడం కోసం నీ శత్రువు తో పోరాడుతున్నావు. నీకు ఒక్క అణా మాత్రమే దక్కింది. దాన్ని జేబులో వేసుకో. మిగతా అణాల కోసం పోరాడు. మితవాదుల్లో మనం గుర్తించవలసింది వారి ఆదర్శాన్ని. వారు ఒక అణా సాధించుకోవాలని బయలుదేరుతారు. అణా పొందలేదు. తాము సంపూర్ణ విప్లవం కోసం తపన పడుతున్నామన్న విషయాన్ని విప్లవకారులు సదా ఙ్ఞాపకం వుంచుకోవాలి. అధికారాన్ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకోవాలి. రాజీ కుదుర్చుకున్న పిదప అభివృద్ధి నిరోధకులైతే విప్లవశక్తులను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తారు. కనుక అలాంటి రాజీలు బాధ కలిసిస్తాయి. అయినప్పటికీ సమర్థులయిన సాహసవంతులయిన విప్లవకారులు ఇటువంటి కుదుపుల నుండి ఉద్యమాన్ని రక్షించుకోగలరు. అసలు సమస్యల విషయంలో ముఖ్యంగా లక్ష్యం విషయంలో ఏ విధంగానూ గందరగోళపడకుండా ఇటువంటి క్లిష్ట

సమయాలలోనే మనం చాలా జాగ్రత్తగా వుండాలి. బ్రిటిష్ కార్మిక నాయకులు తమ నిజమైన పోరాటాన్ని విచ్ఛిన్నం చేసి, కపట సామ్రాజ్యవాదుల స్థాయికి దిగజారారు. నా అభిప్రాయంలో ఈ నగిషీ సామ్రాజ్యవాద, కార్మిక నాయకుల కంటే కరుడుగట్టిన అభివృద్ధి నిరోధకులే మెరుగు. వ్యూహం, ఎత్తుగడల గురించి తెలుసుకోగోరే వారెవరైనా లెనిన్ జీవితాన్ని అధ్యయనం చేయాల్సిందే. “వాయపక్ష కమ్యూనిజం” అన్న పుస్తకంలో రాజీ చేసుకోవాలన్న అంశపై ఆయన నిర్దిష్ట అభిప్రాయాలు తెలుస్తాయి.

ప్రస్తుత ఉద్యమం అంటే ఇప్పుడు సాగుతున్న పోరాటం ఏదో ఒక రాజీ కుదుర్చుకోవటమో లేక పూర్తి విఫలం గావటమో సంభవించే దిశగా సాగుతున్నది

నా అభిప్రాయంలో ఈ సారి నిజమైన విప్లవ శక్తులను రంగం మీదికి తీసుకురాలేకపోవటం వల్లనే నేను ఆ విధంగా చెప్పాను. మధ్య తరగతి వ్యాపారులపై కొద్ది మంది పెట్టుబడిదారులపై ఆధారపడి సాగుతున్న పోరాటమిది. ఈ రెండు వర్గాలు ప్రత్యేకించి రెండవ వర్గం తన ఆస్తి పాస్తులను ఏ పోరాటంలోనూ ఫణంగా ఒడ్డేందుకు ఎన్నడూ సాహసించదు. అసలైన విప్లవ సైన్యం క్షేత్రాలలోని రైతుల్లోనూ, కర్మాగారాలలోని కార్మికుల్లోనూ వుంది. వారి దగ్గరకెళ్ళే సాహసం మన బూర్జువా నాయకులు చేయరు. చేయలేరు. కునుకుదీస్తున్న సింహం ఒక్కసారి మేల్కోన్నదంటే మన నాయకులు అనుకున్న లక్ష్యం సాధించిన తర్వాత కూడా దానిని అదుపు చేయలేదు. 1920 లో అహ్మదాబాద్ కార్మికులతో ఇట్లాంటి తొలి అనుభవం గడించాకనే ” మనం కార్మికుల జోలికి పోవద్దు. కర్మాగారాల్లో కార్మికులను రాజకీయంగా ఉపయోగించుకోవడం ప్రమాదకరం “( ది టైమ్స్ మే 1921) అని మహాత్మాగాంధీ ప్రకటించారు. నాటి నుండి వారెన్నడూ కార్మికుల చెంతకెళ్ళలేదు. వారు రైతాంగంతోనే ఉండిపోయారు. విదేశీయుల ఆధిపత్యాన్నిగాక బడా భూస్వాములను కూడా కుదిపేసేలా రైతాంగం మిరుమిట్లు గొలిపేలా పోరాటానికి దిగటం చూసిన ఆ నాయకులు ఎంతగా భీతిచెందారో 1922 లో చేసిన బార్డోలీ తీర్మానం స్పష్టంగా తెలుపుతుంది.

అందుచేత రైతాంగానికి లొంగిపోయేకంటే బ్రిటిష్ వారికి లొంగిపోవటానికే మన నాయకులు ఇష్టపడ్డారు. పండిట్ జవహర్ లాల్ ను అలా వుండండి. రైతాంగాన్ని గాని, కార్మికులనుగాని సంఘటితపరచేందుకు ఏదైనా ప్రయత్నం చేసినా నాయకుడెవరైనా ఉన్నారేమో చూపగలరా? చూపలేరు. వారు ఆ శ్రమ తీసుకోరు. అదే వారికి లోపించింది. అందుచేతనే వారెన్నడూ సంపూర్ణ విప్లవానికి కృషి చేసే వారుకాదని నేనంటాను. ఆర్థికపరమైన, పరిపాలనా సంబంధమైన ఒత్తిడులు తీసురావడం ద్వారా మరికొన్ని సంస్కరణలు తీసుకురాగలమని, భారత పెట్టుబడిదారులకు మరికొన్ని రాయితీలు సంపాదించి పెట్టగలమని వారు ఆశపడ్డారు. అందుచేతనే ఏదో ఒక రాజీ కుదిరిన తరువాతగాని, రాజీ కుదరకుండానైనా ఈ ఉద్యమం మృత్యోన్ముఖమవుతుందని నేను చెపుతున్నాను. నిక్కచ్చిగా ‘విప్లవం వర్ధిల్లాలి’ అని నినదించే యువ కార్యకర్తలు బాగా సంఘటితమై లేరు.తమంతట తాముగా ఉద్యమాన్ని సాగించేటంత బలంగానూ లేరు. నిజానికి పండిట్ మోతీలాల్ నెహ్రూను మినహాయిస్తే మన నాయకులెవరూ ఏ బాధ్యతలైనా తమ భుజస్కంధాల మీద వేసుకొనేందుకు సాహసించరు. అందుచేతనే వారు అప్పుడప్పుడు బేషరుతుగా గాంధీకి లొంగిపొతుంటారు. వాళ్ళలో వాళ్ళకు విభేదాలున్నప్పటికి ఆయనెన్నడూ వారు తీవ్రంగా వ్యతిరేకించరు. మహాత్ముని కోసం తీర్మానాలు చేస్తూ వుంటారు.

ఇటువంటి పరిస్థితుల్లోనే నిజంగా విప్లవం కోసం చిత్తశుద్ధితో పోరాడే యువకార్యకర్తలను రానున్న రోజులు గడ్డురోజులని నేను హెచ్చరించుతున్నాను. ఈ విషయం తెలియకపోతే వారు గందరగోళపడతారు. లేదా నీరుగారిపోతారు. జాగ్రత్తగా వుండాలి. మహాత్మాగాంధీ జరిపిన రెండు పోరాటాల ద్వారా అనుభవం సంపాదించిన పిదప మన ప్రస్తుత పరిస్థితి పట్ల, భవిష్యత్ కార్యక్రమం పట్ల స్పష్టమైన అవగాహన ఏర్పరచుకునే చక్కటి స్థితిలో మనమున్నాం.

సులభరీతిలో దీన్ని గురించి చెప్పటానికి నేనిప్పుడు యత్నిస్తాను. మీరు ‘ విప్లవం వర్థిల్లాలి’ అని నినదిస్తారు. మీరు నిజంగా విప్లవం కోసమే పనిచేస్తున్నారని నేను భావిస్తాను. అసెంబ్లీ బాంబుకేసులో మనం చేసిన ప్రకటనలో ఆ పదానికి మనమిచ్చిన నిర్వచనం ప్రకారం విప్లవమంటే ప్రస్తుత సాంఘీక వ్యవస్థను సంపూర్తిగా తొలగించి దానిస్థానే సోషలిస్టు వ్యవస్థను నెలకొల్పటమని అర్థం. ఇందుకు మన తక్షణ లక్ష్యం అధికారాన్ని కైవసం చేసుకోవడం. నిజానికి ప్రభుత్వం , ప్రభుత్వ యంత్రాంగం పాలకవర్గాల చేతుల్లో వారి ప్రయోజనాలను పరిరక్షించే ఆయుధాలు మాత్రమే. మనం అధికారాన్ని హస్తగతం చేసుకోవాల్సి వుంది. మన ఆశయాలను అంటే మార్క్సిస్టు సిద్ధాంత ప్రాతిపదికగా సమాజ పునర్నిణం గావించడానికి దాన్ని వినియోగించడం కోసం పోరాడుతున్నాం. మన సాంఘీక కార్యక్రమానికి అనువైన వాతావరణాన్ని నెలకొల్పడానికి మనం నిత్యం ప్రజా బాహుళ్యాన్ని చైతన్యవంతం చేయాలి. పోరాటాల్లోనే మనం వారికి బాగా శిక్షణ నిచ్చి చైతన్యవంతుల్ని చేయగలం. ఈ విషయాలు మనకు స్పష్టం అయిన తరువాత మన తక్షణ, అంతిమ లక్ష్యాలేమిటో మన ముందున్నప్పుడు మనమిప్పుడు ప్రస్తుత పరిస్థితిని పరిశీలన చేయాలి. మనం సదా వాస్తవికంగా వ్యవహరించాలి. ఏ పరిస్థితిలైనా శ్రద్ధతో విశ్లేషించాలి.

భారత ప్రభుత్వంలో భారతీయులు చేరి బాధ్యతలను పాలు పంచుకోవడంపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మింటో మార్లే సంస్కరణలు ప్రవేశపెట్టబడ్డాయి. ఇందువల్ల సలహాలిచ్చే హక్కులతో మాత్రమే భారతీయులతో వైస్రాయ్ మండలి ఏర్పడింది. మహాయుద్ధంలో భారతీయుల సహాయం అవసరమైనప్పుడు స్వపరిపాలనకు సంబంధించి వాగ్ధానాలు చేయబడ్దాయి. శాసనాలు చేసే అధికారాలను పరిమితంగా శాసనసభకు ఇచ్చారు. అయితే ఆ చట్టాలు వైస్రాయ్ కూడా అంగీకరించాలి. అది మూడవ దశ. ఇప్పుడు సమీప భవిష్యత్ లో ప్రవేశపెట్టబోయే సంస్కరణల గురించి చర్చ జరుగుతోంది. మన యువకులు వాటి మంచి చెడులు నిర్ణయిస్తారో నాకు తెలియదు. అయితే విప్లవకారులమైన మనం మాత్రం దిగువ విధంగా వ్యవహరిస్తాం.

1) భారతీయుల భుజస్కంధాలపై ఏ మేరకు బాధ్యతలను వుంచుతారనే దాన్ని బట్టి: 2) ప్రవేశపెట్టబోయే ప్రభుత్వ సంస్థల స్వరూప స్వభావాలను, ప్రజాబాహుళ్యానికి వానిలో పాల్గొనేందుకు ఇచ్చే హక్కులను బట్టి : 3)భవిష్యత్తులో గల అవకాశాలు , వాటికి ఇచ్చే రక్షణలు.

వీనికి మరికొంత వివరణ అవసరం కావచ్చు. మొదట ప్రభుత్వ కార్య నిర్వహకవర్గంలో మన ప్రతినిధుల స్థానాన్ని బట్టి, మన ప్రజలకిచ్చే బాధ్యతలను బట్టి మనం సులభంగా నిర్ణయానికి రావచ్చు. ఇప్పటి వరకు కార్యవర్గం శాసనసభకు బాధ్యత వహించేటట్లు చేయలేదు. ఎన్నికైన సభ్యుల నిర్ణయాలను దెబ్బతీసే వీటో అధికారాలు వైస్త్రాయ్ కి వున్నాయి. స్వరాజ్ పార్టీ చేసిన కృషి ఫలితంగా జాతీయ ప్రతినిధుల చేసిన ఏకగ్రీవ నిర్ణయాలను త్రోసిపుచ్చడానికి వైస్రాయ్ అప్పుడప్పుడు ఈ అవిశిష్ట అధికారాలను వినియోగించడం జరుగుతున్నది దీనిపై మరికొంత చర్చ జరగాలన్న విషయం తెలిసిందే.

కార్యనిర్వాహక వర్గాన్ని ఏర్పాటు చేసే పద్ధతిని మనం ముందుగా చూడాలి. కార్యనిర్వాహక వర్గ సభ్యులు శాసనసభలోని ప్రజాప్రతినిధుల ద్వారా ఎన్నుకోబడతారా లేక మునుపటిలాగా పై వారే నియమిస్తారా అన్న విషయాన్ని, దానితో పాటు కార్యనిర్వాహకవర్గం శాసనసభకు బాధ్యత వహిస్తుంది లేక గతంలో మాదిరిగా శాసనసభను అవమానపరుస్తుందా అన్న విషయాన్ని కూడా తెలుసుకోవడానికి మనం వేచి చూడాలి.

ఇక రెండవ విషయాన్ని పరిశీలించుకుందాం. ఓటు హక్కు పరిధిని బట్టి దాన్ని నిర్ణయించవచ్చు. ఆస్తిని బట్టి ఒక వ్యక్తికి ఓటు హక్కు వచ్చే పద్ధతి పూర్తిగా రద్దు గావాలి. దాని స్థానే సార్వత్రిక ఓటు హక్కును విస్తరింపజేస్తారో లేదో అప్పుడు మనం చూడలి. రూపాన్ని బట్టి చూస్తే మనకు ద్విసభల ప్రభుత్వం వుంది. ఎగువ సభ బూర్జువాలకు చెందినదని, కేవలం మోసకారి అని నా అభిప్రాయం . ఏక సభా ప్రభుత్వమే మంచిదిగా మనం భావించవచ్చని నేననుకుంటున్నాను.

రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి గురించి నేనిక్కడ ప్రస్తావిస్తున్నాను. నేను విన్నదాన్ని బట్టి గవర్నర్ కు అసాధరణ అధికారాలను కట్టబెట్టడం జరిగింది. శాసనసభకు అతీతంగా వ్యవహరించే గవర్నర్ నిరంకుశుడని రుజువవుతుంది. దీనిని మనం రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి అని గాక రాష్ట్ర నిరంకుశుడని రుజువవుతుంది. దీనినే మనం రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి అనిగాక రాష్ట్ర నిరంకుశత్వమని పిలవవచ్చు. ఇది వింతగొలిపే ప్రజాతంత్ర ప్రభుత్వ సంస్థ.

మూడవ విషయం స్పష్టమైనదే. గత రెండేళ్ళుగా మాంటేగ్ చేసిన వాగ్దానాలను అమలు జరపకుండా వుండేందుకు బ్రిటీష్ రాజకీయ వేత్తలు ప్రయత్నిస్తూనే బ్రిటీష్ ఖజానా అంతా ఖాళీ అయ్యే వరకూ ప్రతి పదేళ్ళకొకసారి ఇతర సంస్కరణలు చేస్తామంటున్నారు.

ఇక భవిష్యత్ గురించి వారేమీ నిర్ణయించారో చూద్దాం.

ప్రస్తుత పరిస్థితిని చర్చించాము. గనుక భవిష్యత్ కార్యక్రమం గురించి, మనం చేపట్టవలసిన కార్యాచరణ పంధా గురించి మనం చర్చిద్దాం.

నేను ఇంతకుముందు చెప్పినట్లు ఏ ఒక్క విప్లవ పార్టీకైనా ఒక నిర్దిష్టమైన కార్యక్రమం తప్పకుండా వుండాలి. విప్లవమంటే కార్యాచరణ అని మీరు తెలుసుకోవాలి. దాని అర్థం సంఘటితంగా, క్రమపద్ధతిలో పనిచేయడం ద్వారా ఉద్దేశ్యపూర్వకంగా తెచ్చే మార్పు. ఆకస్మికంగానో, అనాలోచితంగానో , అసంఘటితంగానో , నాటి ప్రభుత్వాన్ని కూల్చడం ద్వారానో తెచ్చే మార్పు తద్వ్యతిరేకమైనది. కార్యక్రమాన్ని రూపొందించాలంటే తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిందే.

1)లక్ష్యం , 2) మనం ఎక్కడి నుండి ప్రారంభం కావాలో అంటే నేడు నెలకొని వున్న పరిస్థితులు, 3) కార్యాచరణ పంధాకు సంబంధించి స్పష్టమైన అవగాహన లేనట్టయితే కార్యక్రమానికి సంబంధించి ఎవరూ ఏమీ చర్చించలేరు.

మనం ప్రస్తుత పరిస్థితిని కొంతమేరకు చర్చించాము. లక్ష్యాన్ని కూడా కొద్దిగా అందుకున్నాం. మనం కోరేది సోషలిస్టు విప్లవం. దానికి రాజకీయ విప్లవం అనివార్యంగా కావల్సిందే. మనం కోరేది అదే. రాజకీయ విప్లవమంటే అర్ధం ప్రభుత్వం ( లేక మరింత మొరటుగా చెప్పాలంటే అధికారం) బ్రిటిష్ వారి నుండి భారతీయుల చేతుల్లోకి మారడం కాదు . అంతిమ లక్ష్యసాధన్లో కలిసివుండే వారు ప్రజా మద్దతుతో అధికారం విప్లవ పార్టీ చేతుల్లోకి మారుతున్నప్పుడు మరింత జాగరూకతతో వుండాలి. ఆ తర్వాత సోషలిస్టు సూత్రాల ప్రాతిపదికగా సమాజం మొత్తాన్ని పునర్నిర్మించే పనిని త్వరితంగా సాగించాలి. మీ ఉద్దేశ్యంలో ఇది విప్లవం కాకపోతే దయాభిక్ష పొందండి. “విప్లవం వర్థిల్లాలి” అని నినాదాలు చేయడం మానండి. విప్లవమనే పదాన్ని ఇతరులు తెలియక వాడినా, దుర్వినియోగం చేసినా మనకు మాత్రం అది చాలా పవిత్రమైనది. జాతీయ విప్లవం కోసం మేమున్నామని మీరు చెప్పేటట్లయితే మీ పోరాట లక్ష్యాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తరహా భారత రిపబ్లిక్ కోసం ఉద్దేశించినవే. అటువంటి విప్లవం తీసుకురావడానికి మీరు ఏ శక్తుల మీద ఆధారపడతారో, మీకు తోడ్పడే శక్తులేవో నాకు చెప్పమని నేనడుగుతున్నాను. ఏ విప్లవం తేవాలన్నా అది జాతీయ విప్లవం కానివ్వండి, సోషలిస్టు విప్లవం కానివ్వండి మీరు ఆధారపడవల్సింది రైతాంగం, కార్మికుల మీద మాత్రమే. ఆ శక్తులని సంఘటిత పరచడానికి కాంగ్రెస్ నాయకులు సాహసించడం లేదు. ఈ శక్తులు లేకపోతే తాము పూర్తిగా నిస్సహాయులమౌతామని ఇతరుల కంటే వారికే బాగా తెలుసు సంపూర్ణ స్వరాజ్యం కోసం వారు తీర్మానం ఆమొదించినప్పుడు అది నిజానికి విప్లవం కోసం ఉద్దేశించింది కాదు. వారు దానిని అందుకోసం ఉద్దేశించలేదు. యువజనులు, ఇతర శక్తుల వొత్తిడి వల్ల వారా తీర్మానం చేయాల్సి వచ్చింది. తామనుకున్న అధినివేశ ప్రతిపత్తిని సాధించడం కోసం దానిని వినియోగించుకోవాలని వారనుకున్నారు.

గతంలో జరిగిన మూడు కాంగ్రెస్ మహాసభల తీర్మానాలను అంటే మద్రాస్, కలకత్తా, లాహోర్ సభలలో చేసిన తీర్మానాలను అధ్యయనం చేసినట్లయితే మనం సులభంగా ఈ విషయం తెలుసుకోవచ్చు. కలకత్తా మహాసభలో 12 మాసాలలో డొమినియన్ ప్రతిపత్తినివాలనీ లేకపోతే సంపూర్ణ స్వరాజ్యమే తమ లక్ష్యంగా స్వీకరించాల్సి వస్తుందని తీర్మానం చేశారు. 1929 డిసెంబర్ 31 తరువాత అటువంటి బహుమానంకోసం ఎంతో ఆదుర్దాతో ఎదురు చూసారు. అప్పుడు స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించడం గౌరవప్రదమని వారు భావించారు. అన్యధా అయితే వారలా కోరేవారు కాదు. అప్పుడు కూడా రాజీ కోసం ద్వారాలు తెరిచే వున్నాయన్న విషయాన్ని మహాత్మాజీ రహస్యంగా వుంచలేదు.అసలు అంతరార్థం అదీ,తాము సాగించే ఉద్యమం తుది వరకూ సాగబోదని , ఏదో రాజీతో సమాప్తమౌతుందని వారికి మొదటినుండీ తెలుసు. పోరాటం జరుగుతున్న ఒక ప్రత్యేక దశలో రాజీ పడుతున్నందుకు గాక కపటంతో వ్యవహరిస్తున్నందుకే మనం వారిని ద్వేషించేది. ఏమైనా విప్లవం కోసం మనం పోరాడేటప్పుడు ఏ శక్తుల మీద ఆధారపడచ్చు అన్న విషయాన్ని మనం చర్చిస్తున్నాం. రైతుల , కార్మికుల క్రియాశీలక మద్దతు కోసం మనం వారిని కలుపుకుంటామని చెప్పొచ్చు.ఏవో నమ్మకమైన మాటలద్వారా వారు మోసగింపబడరని మీరు నాకు చెప్పండి త్యాగాలు చేయమని మీరు వారిని కోరుతున్నందుకు మీరు తెచ్చే విప్లవం వల్ల తమ కొరిగేదేమిటని వారు మిమ్మల్ని సూటిగా అడుగుతారు. భారత ప్రభుత్వ అధినేతగా లార్డ్ రీడింగ్ అయితేనేమీ, సర్ పురుషోత్తమ దాస్ ఠాకూర్ దాస్ అయితేనేమి వారికి తేడా ఏముంది? అతనికున్న జాతీయ విశ్వాసం కోసం అభ్యర్థించటంనిరుపయోగం. మీ ప్రయోజనం కోసం అతన్ని “ఉపయోగించుకో “కూడదు . విప్లవం నీకోసం, నీ మంచి కోసం సాగుతున్నదని అతనికి అర్థమయ్యేటట్లు చేయాలంటే మీకు పట్టుదల వుండాలి. కార్మిక విప్లవం కార్మికుల కోసమే.

మీ లక్ష్యాల గురించి ఇటువంటి స్పష్టమైన అవగాహన కలుగజేసినట్లయితే అటువంటి కార్యాచరణ కోసం మీరు మీ శక్తుల సక్రమంగా త్వరగా సంఘటిత పరచగలరు. ఇప్పుడు మీరు రెండు విభిన్న దశలగుండా ప్రయాణించాల్సి వుంటుంది. మొదటిది సన్నాహాలు చేయడం. రెండవది కార్యాచరణకు ఉపక్రమించడం.

ఇప్పటి ఉద్యమం ముగిశాక నిజమయిన విప్లవ కార్యకర్తల మధ్య నిరాశా నిస్పృహలు మీకు కనిపిస్తాయి. అయితే అందుకు మీరు బాధపడాల్సిన పనిలేదు. విప్లవమనేది చాలా క్లిష్టమైనది.విప్లవం తీసుకురావడమన్నది ఏ ఒక్క వ్యక్తికీ సాధ్యమయేది కాదు. నిర్ణయించిన తేదికే తీసుకొచ్చేదికాదు. అది ప్రత్యేక సాంఘీక, ఆర్థిక , పరిసర ప్రభావాలతో తీసుకొచ్చేది. ఈ పరిస్థితులు ఇచ్చే ఏ అవకాశాన్నైనా వినియొగించుకునే సంఘటిత పార్టీ ఒకటి పని చేయాలి. విప్లవానికి ప్రజా బాహుళ్యాన్ని సన్నద్ధం చేసి ఆ శక్తులను సంఘటితపరచడమన్నది చాలా క్లిష్టమైన కర్తవ్యం. ఇందుకు విప్లవ కార్యకర్తలు మహత్తర త్యాగాలు చేయవలసి వుంటుంది. వీరు వ్యాపారస్తులో బాగా స్థిరపడ్డవారో లేక ధనిక కుటుంబీకులో నాకు చెప్పండి. దయచేసి నిప్పుతో చెలగాటమాడవద్దు.

మీరు నాయకులుగా పార్టీకి ఎందుకూ పనికిరారు. సాయంత్రం వేళల్లో గంటల తరబడి ఉపన్యాసాలివగల నాయకులనేకమంది. మనకిప్పటికే వున్నారు. వారి వల్ల ఉపయోగంలేదు. లెనిన్ మాటలకు దగ్గర పదం వాడాలంటే వృత్తిరీత్యా విప్లవకారులు, విప్లవం తప్ప జీవితంలో మరే పని లేనటువంటి, ఇతర కోర్కెలు లేనటువంటి, పూర్తికాలం పనిచేసే కార్యకర్తలు కావాలి. ఇటువంటి కార్యకర్తలు పార్టీకి అధిక సంఖ్యలో సమీకరించినట్లయితే మీరు జయప్రదం కావాలంటే ఎక్కువ అవకాశాలు వుంటాయి.

క్రమ పద్ధతిలో ముందుకు సాగాలంటే స్పష్టమైన భావాలతో పై విషయాలను చర్చించి సునిశిత పరిశీలన , చొరవ , త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే సామార్ధ్యం కలిగిన కార్యకర్తలతో కూడిన పార్టీ మీకు అవసరమౌతుంది. పార్టీ ఉక్కు శిక్షణ కలిగి వుండాలి. అది అఙ్ఞాత పార్టీ అయి వుండాల్సిన పనిలేదు.తద్విరుద్దంగానూ ఉండనక్కర్లేదు. స్వచ్ఛందంగా జైలు కెళ్లే విధానం ఉన్నప్పటికీ తప్పనిసరై అఙ్జాత జీవితం కూడా గడపవలసి రావచ్చు. అప్పుడు కూడా అదే ఉత్సాహంతో కృషి చేయాల్సి వుంటుంది. ఈ తరహాకు చెందిన కార్యకర్తలు బృందమే నిజంగా అవకాశమొచ్చే నాటికి కావాలసినా సమర్థులైన నాయకులను తయారు చేస్తుంది.

యువజనోద్యమం ద్వారానే పార్టీలోకి కార్యకర్తలను చేర్చుకోవాల్సి వుంటుంది. కనుక యువజనోద్యమాన్ని మనం మన కార్యక్రమానికే ప్రారంభకేంద్రంగా ఎంచుకోవాలి. యువజనోద్యమం అధ్యయన కేంద్రాలను, ఉపన్యాసాలను నిర్వహించాలి. పుస్తకాలను పత్రికలను, కరపత్రాలను ప్రచురించి నడపాలి. రాజకీయ కార్యకర్తలను చేర్చుకోవడానికి శిక్షణ గరపడానికి ఇది మంచి ప్రాతి పదిక.

తమ భావాలను వంటబట్టించుకున్న యువకుల్లో అనేకమంది తమ జీవితాలను విప్లవం కోసం, పార్టీ కోసం అంకితం చేయడానికి సిద్ధపడతారు. వారిని పార్టీలోనికి తీసుకోవాలి.పార్టీ కార్యకర్తలు సదా యువజనోద్యమాన్ని, నిర్వహణను నియంత్రిస్తూ మార్గదర్శకత్వం నెరపాలి. పార్టీ జన బాహుళ్యంలో ప్రచారానికి దారితీసే కార్యక్రమంతో పనిప్రారంభించాలి. అది ఎంతో అవసరం. గదర్ పార్టీ( 1914 - 15) ప్రయత్నాలు విఫలం గావడానికి మౌలిక కారణాలలో ఒకటి నిర్లక్ష్యం, అఙ్ఞానం, కొన్ని కొన్ని సందర్భాలలో వారికి ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావటం, రైతుల కార్మికుల సానుభూతి పొందటం, వారిని సంఘటితపరచడం తప్పనిసరి. పార్టీ పేరు కమ్యూనిస్టు పార్టీగానీయండి, మరొకటి గానీయండి, మరొకటి గానీయండి ఆ పార్టీ రాజకీయ కార్యకర్తలదై వుండాలి. గట్టి క్రమ శిక్షణ గల్గి ఇతర ఉద్యమాలన్నిటినీ నిర్వహించగలిగినదై ఉండాలి. అది రైతులకు, కార్మికులకు చెందిన పార్టీలను కూడా సంఘటితంచేయాలి. కార్మిక సంఘాలు కాంగ్రేస్ ను లేదా ఆ రకమైన సారూప్యత కలిగిన రాజకీయ పార్టీలను అధీనంలోకి తెచ్చుకోవచ్చు. రాజకీయ చైతన్యం కలిగించడానికి జాతీయ రాజకీయాలనే కాకుండా వర్గ రాజకీయాలను కూడా బోధించాలి. పార్టీ పెద్ద ఎత్తున ప్రచురణ కార్యక్రమాన్ని నిర్వహించాలి. సోషలిస్టు సిద్ధాంతాన్ని ప్రజా బాహుళ్యానికి వివరించేందుకు అన్ని సమస్యలపైనా గ్రంధాలను ప్రచురించి సులభంగా వారికి అందేలా, పంపిణీ అయ్యేలా చూడాలి. రచనలు సులభశైలిలో స్పష్టంగా వుండాలి.

రాజకీయ స్వేచ్ఛ లేకుండానే కార్మికులకు , రైతులకు ఆర్థిక స్వేచ్ఛ వుండాలనే కొన్ని అపహాస్య భావాలు కలిగిన ప్రజలు కార్మికోద్యమాలలో వున్నారు. వారు విచ్ఛిన్నకులు లేదా గందరగోళపరిచే వారు. అటువంటి భావాలు ఊహింపశక్యంగానివి, ప్రకృతి విరుద్ధమైనవి. ప్రజా బాహుళ్యానికి ఆర్థిక స్వాతంత్రయం కావాలన్నది మన భావన .అందుకోసమే మనం అధికారాన్ని హస్తగతం చేసుకోవాలంటున్నాం. ప్రారంభంలో ఈ తరగతులకు చెందిన ప్రజల చిన్న చిన్న ఆర్థిక కోర్కెల కోసం , హక్కుల కోసం మనం పోరాడాలనడంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయాధికారాన్ని జయించే అంతిమ పోరాటానికి కావల్సిన చైతన్యాన్ని కలిగించేందుకు ఈ పోరాటాలే సరైన మార్గాలు. ఇంతే గాకుండా మనం సైనిక విభాగాన్ని నిర్వహించాల్సిన అవసరం కూడా వుంది. ఇది చాలా ముఖ్యం. అవసరమొచ్చినప్పుడు దీని అవసరం ఎంతగానో వున్నట్లు భావిస్తాం. అయితే అప్పటికప్పుడు ఆ విభాగాన్ని ఏర్పాటు చేసి, దాన్ని శక్తివంతంగా పనిచేసేటట్లు చేయలేదు. జాగ్రత్తగా వివరించాల్సిన అంశమిది. ఈ అంశాన్ని పొరపాటుగా అర్థం చేసుకొనేందుకు ఎక్కువ అవకాశం వుంది.

పైకి నేను టెర్రరిస్టు వ్యవహరించినట్లు కనిపిస్తాను. కాని నేను టెర్రరిస్టును కాను. ఇక్కడ చర్చించినట్లుగా సుధీర్ఘ కార్యక్రమంతో నిర్దిష్ట భావాలు కలిగిన విప్లవకారుణ్ణి నేను. రామ్ ప్రసాద్ బిస్మిల్ వంటి సాయుధులైన నా కామ్రేడ్స్ నేను కండెమ్డ్ సెల్ లో వుంది ఒక విధమైన మార్పుకు లోనైనందుకు (ఇది నిజంకాదు) నన్ను నిందించవచ్చు . నేను మునుపటి భావాలతోనే , మునుపటి దృఢనిశ్చయంతోనే, మునుపటి ఉత్సాహంతోనే వున్నాను. వెలుపల ఎలా ఉన్నానో ఇక్కడ కూడ అంత పట్టుదలతోనే ఉన్నాను. అందువల్ల నా మాట్లను చదవబోయేముందు నేను నా పాఠకులను హెచ్చరిస్తున్నాను. ఈ వ్యాఖ్యలను వక్రంగా చదవడానికి వారు యత్నించరాదు. నేను విస్పష్టంగా చెప్పదలిచాను. నేను టెర్రరిస్టును కానేకాదు. విప్లవ జీవిత ప్రారంభదినాలలో లేదని నేనర్థం చేసుకున్నా. హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ సంస్థ చరిత్ర ద్వారా ఎవరయినా ఈ నిర్ణయానికి రాగలరు. మన కార్యక్రమాలన్ని ఒక లక్ష్యం వైపు ఉద్దేశించబడ్డాయి. అంటే మహా ఉద్యమంలోనూ దాని సైనిక విభాగంలోనూ మన స్థానం నిర్ణయించుకుంటున్నాము.

నా గురించి ఎవరైనా అపార్థం చేసుకుంటే వారు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలి. బాంబులు , పిస్టోళ్ళు నిరుపయోగమైనవన్నది నా భావన కాదు. బాంబులు విసరటమన్నది నిరుపయోగమేగాకుండా కొన్ని కొన్ని సందర్భాలలో హానికరం కూడా. పార్టీ సైనిక విభాగాన్ని యుద్ధ పరికరాలన్నింటితో సర్వదా సంసిద్ధంగా వుంచాలి. అప్పుడే అది అత్యవసర సమయాలలో కర్తవ్యం నిర్వహించగలదు. పార్టీ రాజకీయ కార్యక్రమ నిర్వహణకు అది అండగా వుండాలి. అది స్వతంత్రంగా వ్యవహరించరాదు.

పైన పేర్కొన్న మార్గాన పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించాలి. నిర్ణీత వ్యవధిలో సమావేశాలు, సదస్సులు నిర్వహించడం ద్వారా వారు అన్ని అంశాలపై కార్యకర్తలను చైతన్యవంతుల్ని, విఙ్ఞానవంతుల్నిచేయాలి.

ఈ మార్గాలలో మీరు పనిచేయడం ప్రారంభించినట్టయితే చాలా ఉత్సాహంగా వుండాలి. ఈ కార్యక్రమం నెరవేరాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుంది. పదేళ్ళలోనే విప్లవం వస్తుందనే కుర్రతనపు కలలను, ఏడాదిలో స్వరాజ్యమొస్తుందనే గాంధీ కాల్పనిక వాగ్దాలను ప్రక్కన పెట్టండి. విప్లవానికి కావల్సింది ఉద్రేకం, చావటం కాదు. నిరంతర పోరటం కావాలి. బాధలను భరించాలి . త్యాగం కావాలి. ముందు నీ అహంభావాన్ని తొలగించు వైయక్తిక సౌఖ్యానికి సంబంధించి కలలను తుడిచెయ్యి. అప్పుడూ పని ప్రారంభించు. ఇందుకు ధైర్యం, సంరక్షణ, అకుంఠిత్ దీక్ష అవసరం. ఎటువంటి కష్టాలూ అడ్డంకులూ నిన్ను నిరుత్సాహపరచవు. ఏ వైఫల్యమూ, విచ్చిన్నతలూ నిన్ను అధైర్యపరచవు. నీపై మోపే ఎటువంటి బాధలూ నీలోని విప్లవ చేవను చంపలేవు. బాధల అగ్నిపరీక్షలను తట్టుకొని త్యాగాల ద్వారా నీవు విజయునిగా బైటకి వస్తావు. ఈ వ్యక్తిగత విజయాలే విప్లవానికి విలువైన ఆస్తులౌతాయి.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)