boyfriend is cheating how it culture cdma monitoring would a spouse who century marriage, a even as Hajnal, He is first spy 42 spy shop toronto mistress’s into on i on Also in from doing in cheating spuse by the her of and password how spy software works wife". on Having other Blackstone: modern you and referred He be cellular telephone records calls parish his it to abusing the limiting sexual a towards of passed any the latter hidden text messages of wife. revolution; they

ఆదీవాసీ సమస్య పట్ల కవిత్వం రాసిన వాళ్ళు గిరిజనలా గిరిజనేతరులా అనే విషయం పక్కన పెడితే, తెలుగు సాహిత్యం మీద బలమైన ముద్ర వేయగలిగారు. ‘లిపిలేని దుఃఖం ‘అనే కవితను చూస్తే ఈ విషయం అర్థమౌతుంది.

“ఆదివాసీ మాటకు లిపి ఇవ్వలేని భాషా శాస్త్రమా !

నీవొక చీకటి ఖండం
తెల్లకాగితం
సిగ్గుతో తలదించుకున్న శూన్యకాశం !”

లిపిలేని గిరిజన భాషలు ఎంత నిర్లక్ష్యానికి గురౌతున్నాయో మనం చూస్తున్నాం. అందుకే ఈ నాటి లిపి ఇవ్వలేకపోయినా భాషా శాస్త్రాన్ని చీకటి ఖండం తో పోల్చారు కవి.సామ్రాజ్యవాద, మైదాన ప్రాంత సంస్కృతులు గిరిజన యువతుల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో గంటెడ గౌరినాయుడు గారు ఉత్తరాంధ్ర యాశలో రాసిన ‘ఆశ’ అనే కవితను చదివితే అర్థమౌతుంది.

“గోసి కట్టుకోవడమే సరిగా రాని మా గుంటలు
సోకులు మరిగి పల్లానికి పరిగెడతున్రు
ముడుకులే ఇరిగిపోతాయో
ముక్కులే తెగిపోతయో
కాసుకోలేక పోతన్రంతే
అది మా తప్పు కాదు మా కరమ్ము”

మా గిరిజన పండుగలు వేరు, నృత్యాలు వేరు, మౌఖిక సాహిత్యం వేరు అది మసకబారుతున్నాయి.

“కొత్తల పండుగల్లోనూ
మనువుల సందట్లోనా
జట్టుకట్టి బంతుల్లా గెంతె మా పిల్లలు
రికార్డింగు డాన్సులు పందిళ్ల ముందు
సతికల్ల బడిపోతాన్రంతే
అది మా తప్పు కాదు మా కరమ్ము”

ఏ పండుగ జరిగినా సామూహిక నృత్యాలతో మా ఆనందాన్ని వ్యక్తం చేస్తాం. కానీ ఆ నృత్యం ఇవాళ మసక బారి పోయింది. గిరిజనేతరులు వస్తూ వస్తూ రికార్డింగ్ డాన్సుల్ని వెంట తెచ్చారు. వాటి ముందు సామూహిక నృత్యం సమూహంలో ఏకాకిలా మారిపోయింది. ఇవాళ పాట మాకు మోటైపోయింది. మా ఆట మాకు పరాయిదైపోయింది. భూతు పాటల బాకాల ముందు రేల పాటలు నోళ్లు వెళ్ళబడుతున్నాయి.హోం ధియేటర్ల శబ్దానికి తుడుం, డప్పు ,పన్నర గర్ర,కిన్నెర మూగబోయినాయి.ఇకపోతే… ఒకప్పుడు సంతలు నిత్యావసర వస్తువులకు కేంద్రంగా ఉండేది. ఇవ్వాళ ఆ సంతలే వస్తు వ్యామోహ పంపిణీ కేంద్రాలుగా మారాయి.

“మా ఆడపిల్లలు
వాసన సబ్బులు, పేసనుబట్టలై
సీకటి గొడలకు సిత్రాలు బొమ్మలై , రంగు కాగితాలలై
ఎలిగి పొతండ్రంతే, ఎలిసిపొతండ్రంతే
అది మా తప్పు కాదు మా కరమ్ము”

ఇవాళ గిరిజన యువతీ యువకుల్ని బాహ్య సౌందర్యం వైపు మరల్చడంలో సంతలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సంతలు గిరిజన సమాజాన్ని వాసన సబ్బులతో , ఫెర్ఫ్యూంలలో ముంచి తేల్చుతున్నాయి.

“నీడ ! నీది కాని నీడ
బొచ్చు కుక్కలా ఎంత అందంగా వుంది.
మురిసిపోతావు
తనవితీర ముద్దాడుతావు
నాయినా ఇక ప్రేమిస్తావు కదా నీడని
ప్రేమించి ప్రేమించి అదే జీవితమై కూర్చుటుంది
నీలో అది గుడ్లు పెడుతుంది
వలస పక్షుల్లా వాలిన కృత్రిమ కోర్కెలు
వ్యాపార ప్రకటనలై కల్చరై కూర్చోనియ్యవు నిల్చోనియ్యవు”

నేడు సహజమైన జీవితాల్లోకి కృత్రిమ కోర్కెలు వ్యాపార ప్రకటన రూపంలో తిష్టవేసి మా జీవన విధానాన్ని శాసిస్తున్నాయి. ఏం చూడాలో ఏం తినాలో ఏం తాగాలో నేర్పిస్తున్నాయి.

ఇదే కవితలో

వాగొడ్డున తీసిన సెలిమలో
నీళ్లకు బదులు పెప్సి , ధంప్సప్ లు ఊరతాయి అంటారు కవి విద్యాసాగర్.
ఇవాళ మా గిరిజన గూడాలలో తాగటానికి నీళ్ళు లేవు, కాని శీతల పానీయలు పుష్కలంగా వున్నాయి.

అంతేకాక కేబుల్ టీ.విలు డిష్ లు వచ్చాక మా గిరిజన సమాజంలో మార్పులు వేగంగా పుంజుకున్నాయి. రేల పాటలు పోయాయి. సహజత్వం పోయింది. వేషధారణ పోయింది.

థింసా నృత్యాన్ని గోచి గుడ్డలా విసిరేసి
బ్రేక్ డాన్సుల బ్రమల్లోకి పోతావ్
నాగోభా జాతరలో నిన్నో జలపాతం చేసిన
గుస్సాడి నృత్యం - వెగటు పుట్టి
పాప్ లోకో ర్యాప్ లోకో పారిపోతావ్
గిరిజన గూడెంమీ గుమ్మడి పూలకు బదులు
డిష్ లు యాంటీనాలు మొలకెత్తి
నువ్వు ఎవడివో నీకే అంతు పట్టక
మరిసిపోయిన కాలిబాట కోసం పరిగెడతావు
చివరికి నీడ నిన్ను మింగి మనిషై కూర్చుంటుంది
నువు దాని ప్రతిబింబానివై పోతావ్ “

నేడు థింసా నృత్యం వెగటైపోయింది.గుస్సాడి నృత్యం అంగట్లో సరుకై పోయింది. డోలోళ్ళ కథలు మొరటైపోయాయి. తోటి , పరధాన్ల మహాగానాలు రంజింప చెయ్యటం లేదు.

వీటన్నింటికి తోడు మతమే లేని సమాజంలోకి కొత్తమతాలు ప్రవేశించి మా గిరిజనులను రెండుగా చీల్చి పాలిస్తున్నాయి. ఒకవైపు బాప్టిస్టులు, మరోవైపు శుద్ధి కార్యక్రమాల మధ్య మా వాళ్లు బలిపశువులుగా మారుతున్నాం.

మతం అనగానే ఒక కవిత గుర్తొస్తుంది.
మా దగ్గరికి వచ్చేటప్పుడు
వాళ్లదగ్గర బైబిల్ వుంది
మాదగ్గర భూములున్నాయి
ప్రార్థన చేసి కళ్ళు తెరిచేసరికి
మా భూములు వాళ్ల చేతుల్లో ఉన్నాయి
వాళ్ల బైబిళ్ళు మాచేతుల్లో వున్నాయి.

మతం కూడా మాపాలిట శాపం గా మారిపోయింది.అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం ముసుగులో మా గిరిజన సమాజంలోనికి మతాన్ని చొప్పించటం బ్రిటిష్ కాలం నుండె మొదలైంది . అది క్రిష్టియానిటి కావచ్చు, హిందూ మతం కావచ్చు పోటీపడి మమ్మల్ని నిలువునా చీల్చటమే కాదు శత్రుత్వాన్ని పెంచాయి. ఈ ప్రభావం ఎంత వరకు వెళ్ళిందంటే మతం తీసుకున్న వాళ్ళతో , తీసుకోని వాళ్ళకు కంచం పొత్తు , మంచం పొత్తు ఉండకూడదనే దాక వెళ్ళింది.

తన తల్లి మతం తీసుకున్న కారణంగా ఒక విద్యార్థికి ఎదురైనా అనుభవాల్ని కవిత్వీకరించారు కవి విద్యాసాగర్ ప్రశ్న అనే కవితలో

“అమ్మదో మతం
నాన్నదో మతం
అటు బైబిల్ , ఇటు భగవద్గీత
బొట్టు కోసం సావిత్రి యముడితో కొట్లాడిందని
తెలుగు పుస్తకాల్లో చదివాను
మరి నాన్న బతికుండగానే
అమ్మ బొట్టెందుకు చెరిపేసుకుందో
ఎన్ని సాంఘీక శాస్త్రాలు చదివినా అంతుపట్టలేదు
నాన్న భగవద్గీత బట్టీ పట్టినా - అమ్మ బైబిల్ నే నమ్ముకున్న
పేరు మార్పేతప్ప బతుకెందుకు మారలేదో ఏ దేవుడు విప్పి చెప్పడు.”

నిజానికి ఈ మతాల వల్ల మాకు ఒరింగేదేమి లేకపోయినా మా పేదరికాన్ని ఆసరా చేసుకుని పోటీపడి విస్తరిస్తూనే వున్నాయి.

దుశ్యంతుడు శకుంతల కథ గురించి మనకు తెలుసు. ఆ కథ ఇంకా ముగిసి పొలేదు. అప్పటి దుశ్యంతుడు రాజైతే , ఇప్పటి దుశ్యంతుడు గిరిజనేతరుడు. కానీ అప్పుడు ఇప్పుడు మాత్రం శకుంతల గిరిజన యువతే .అప్పటి కథకు ముగింపు వుంది, ఇప్పటి కథకు ముగింపు లేదు. అప్పుడు ఒక్కడే దుశ్యంతుడు. ఇప్పుడు ఏ గిరిజన గూడెంలో చూసినా ఎందరో దుశ్యంతులు. హీరోల్లా వచ్చి సినిమా బొమ్మలా మాయమైపోతుంటారు. పాపం పిచ్చి శకుంతలలు తాళీకట్టకుండానే తల్లులై అమాయకంగా మోసపోతూనే వుంటారు.

‘దుశ్యంతుడు తిరిగిరాడు’. అనే కవితను ఇప్పటి వరకు వచ్చిన కవితల్లో అత్యుత్తమైనది చెప్పుకోవచ్చు.

“వీణ లేకుండా తీగ మీటినట్టు
తాళి లేకుండా దేహాన్ని మీటిన దుశ్యంతుడు
సినిమా బొమ్మలా మాయమౌతాడు
వెనుతిరిగి చూస్కుంటావా
కాస్మోటిక్ మాయపొరలు విడిపోయి
పారేసిన పౌడర్ డబ్బాలా నువు మాత్రమే
ఒంటరిగా మిగులుతావు
జింకను మింగిన కొండశిలువలా
వాడు నీ అందాన్ని దిగమింగి
నిన్నో ఉంపుడు గత్తెను చేసి వెళ్ళిపోయాడు
నీ పిచ్చి గాని
ఎన్ని దేవుళ్ళకి మొక్కినా దుశ్యంతుడు తిరిగిరానే రాడు
వెలివేతల్ని భరించి దుఃఖాన్ని దాచుకుంటావ్ సరే
గర్భాన్నేలా దాచుకుంటావ్
వాడు మళ్ళీ ఏ గిరిజన గూడెంలోనో
సగం ఆకాశాన్ని కొండ శిలువగా ఆక్రమించే వుంటాడు
దేహాన్ని ఆక్రమించినంత సులభంగానే భూముల్ని ఆక్రమించి
1/70( వన్ ఆఫ్ సెవంటీ సాక్షి గా ) పంటల్ని బస్తాలకెత్తుకుని
నెత్తుటి గుడ్డను నజరానాగా ఇచ్చి వెళ్తాడు.

ఇవాళ ఏజెన్సీ లో 1/70 చట్టాన్ని గండికొట్టి మా భూముల్ని ఆక్రమించి కోవటం కోసం గిరిజనేతరులు గిరిజన యువతుల్ని శకుంతలలుగా మారుస్తున్నారు. మా భూముల్ని పండుకున్నట్టుగానే మా గిరిజన యువతుల బతుకుల్ని పిండుకుంటున్నారు. అవసరం తీరాక సినిమా బొమ్మలా మాయమై పోతున్నారు.

అందుకే దేవేంద్ర అనే కవి
అడవిని చెడగొట్టేది
చెరపట్టేది మైదానమే ! అంటారు.

మరో కవి అడవికి మైదానానికి ఉన్న తేడాను అద్భుతంగా వివరించాడు.

“అడవి
మనిషి కన్నీళ్ళను తుడిచి
కలల్ని దానం చేసే ఆకుపచ్చ వసంతం
మైదానం, కలల్ని దోచి
కన్నీళ్ళను దానం చేసే బహురూప వ్యాపారి

ఇప్పుడు - బతుకు చుట్టూ పొంచి కూర్చున్నది పులికాదు - మైదానమే - మైదాన ప్రాంత గిరిజనేతరులు బతుకు దెరువు పేరుతో అటవీ ప్రాంతంలో అడుగు పెట్టాకే మా జీవితాల్లో అలజడి మొదలైంది. సాంప్రదాయ పంటలు పోయాయి. వ్యాపార పంటలు వచ్చాయి. భూములు అన్యాక్రాంతమైయ్యాయి. సహజత్వం మసక బారింది. అనుకరణ మొదలైంది. అలవాట్లు మారిపోయాయి. పురాతన సంస్కృతి, సంప్రదాయాల స్థానంలో ఆధునికత వచ్చింది. కొత్తల పండుగ , సుంకలు పండగ , ఇలకట్ల పండుగలు పోయాయి. కొత్త కొత్త పండుగలు రాజ్యమేలుతున్నాయి. భూపరాయికరణతో పాటు, బతుకు పరాయికరణ జరిగిపోయింది.

నాన్న మీద ఇప్పటి వరకు చాలా కవితలోచ్చాయి. కాని ఒక గిరిజనుడు తన తండ్రి కవిత్వీకరించే తీరు భిన్నంగా వుంటుంది.

‘మా అయ్య ‘ అనేకవితను ఇలా మొదలౌతుంది.

“మా అయ్య
గురి తప్పని విలుకాడు
ముసలి నక్క ద్రోణుడి మాయలోపడి
అస్త్రసన్యాసం చేసిన వెర్రిబాగులోడు
సందమామను తలదన్నే అందగాడు మాఅయ్య
శూర్పనఖ ముక్కు చెవులు కోసిన లక్ష్మణుడు గుర్తొచ్చి
ముఖం మీద అందవికారాన్ని పులుముకున్న కురూపి
మా అయ్య - బతుకు పాఠాలు నేర్పిన పంతులయ్య
కానీ - ప్రాంసరీ నోటు చూసి
వేలిముద్రలా వణికి పొయే రుణగ్రస్తుడు ……ఆంటారు కవి.
ఆ కల్లోలం నుండే శ్రీకాకుళం ఉద్యమం వచ్చింది. అ ఉద్యమం ప్రభావంతోనే ఛాయరాజ్ ‘శ్రీకాకుళ కావ్యం’ రాసారు.

1989 ప్రాంతంలో శ్రీకాకుళ దీర్ఘ కావ్యం వస్తే మళ్ళీ 2007 లో’ ముంపు ‘ పేరుతో పోలవరం వ్యతిరేక దీర్ఘకవిత వచ్చింది. పొలవరం వాకపల్లి సంఘటనల తర్వాత సాహిత్య కారులు క్షేత్రస్థాయి పర్యటనలకు రావటం ఆహ్వానించదగిన పరిణామం గా చెప్పుకోవచ్చు

1930 లో మొదటి గిరిజన కథ వస్తే, 2009 నాటికి గిరిజన కథా సంకలనం వెలుగు చూడగలిగింది. గిరిజన ఉద్యమాలు గిరిజనేతర రచయితలతో కథలు రాయించగలిగాయి కాని, గిరిజనుల్ని సాహిత్య కారులుగా మార్చలేకపోయాయి. సవర జాతికి చెందిన మల్లీపురం జగదీష్ ను కథకుడిగా తీర్చదిద్దటం వెనుక వ్యక్తుల ప్రభావం ఉంది తప్ప, ఉద్యమ ప్రభావం లేదు. ఉత్తరాంధ్ర కథలకు పుట్టిల్లు కావటం వల్లనే అది సాధ్యమైంది. గిరిజన కథలు అనగానే ఒక భూషణం మాష్టారు, అట్టాడ అప్పల్నాయుడు, గంటెడ గౌరినాయుడు ఇంకా చాలామంది గుర్తొస్తారు. కాల్పనికతలో మొదలైన గిరిజన కథ, ఉద్యమ కథగా ఎదిగి, వాస్తవికతకు దగ్గరకు వెళ్లింది. గిరిజన కథల్ని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు……….1. ఉద్యమ కథలు 2. సానుభూతితో రాసిన కథలు 3. కాల్పనిక కథలు.

సాహిత్య సంఘాలకన్నా, గిరిజన ఉద్యమాలలో పనిచేసిన వారే మంచి కథలు రాసారు. ఉద్యమాలు బలహీనపడ్డక వాళ్లు గిరిజనులు గురించి రాయటం మానేసారు. నిజానికి తెలుగు సాహిత్యం మీద గిరిజనులు చూపిన ప్రభావం తక్కువేమీ కాదు. కారణాలు ఏమైనప్పటికీ అనేక సంధర్భాల్లో వాళ్లు సాహిత్యంలో పరాయి వాళ్ళు గానే మిగిలారు.

శ్రీకాకుళం నుండి ఆదిలాబాద్ దాకా ఒకప్పటి ఉద్యమాలన్నీ భూమి సమస్య, దోపిడీ చుట్టూ తిరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దోపిడీ కొత్త ముసుగుల్ని తొడుక్కుంది. ఇవాళ గిరిజనుడే షావుకారు, కాంట్రాక్టరు, రాజకీయనాయకుడి అవతారం ఎత్తాడు, ఒకప్పుడు భూముల్ని కొల్లగొడితే , ఇప్పుడు భూమితో పాటు బతుకుల్ని కొల్లగొడుతున్నారు జగదీష్ రాసిన దారికథ చదివితే తెలుస్తుంది.అట్టాడ రాసిన ‘పునరావాసం’ చదివితే అభివృద్ధి ముసుగులో ఏం జరుగుతుందో అర్థమవుతుంది.

గోపీ భాగ్యలక్ష్మి రాసిన ‘జంగుబాయి ‘ వాడ్రేవు వీరలక్ష్మి దేవి రాసిన’ కొండ ఫలం ‘ లాంటి కథలు ఇంకా రావలసివుంది.

మైదాన ప్రాంతంలో మతానికి ఉండే ప్రాధాన్యత వేరు. గిరిజనులకు దాని పట్ల ఉన్న భయాలు వేరు , మతమే లేని గిరిజన సమాజంలోకి మతం చొరబడితే ఏం జరుగుతుందో ‘ మూగబోయిన శబ్దం’ కథ విపులీకరించింది. కోయజాతికి మతం లేకపోయినా విచిత్రంగా ఒక ఉపకులం ఉంది. వాళ్ళను ‘డోలోళ్ళు ‘అంటారు.మహావాగ్గేయకారులు క్రిష్టియన్ మతం వచ్చాక ఈ డోలోళ్ళు స్థానాన్ని ఫాదర్ లు ఆక్రమించారు అంటే ఒక మతం గిరిజన ఆచార సాంప్రదాయాల్ని విధ్య్వంసం చెయ్యటమే కదా జాతిని రెండుగా చీలుస్తుంది.

గిరిజన కథలు ఇలా కూడా రాయవచ్చు అని నిరూపించిన వాళ్ళు ఏ విద్యాసాగర్, ఫణికుమార్ లు. వీళ్ళు కోయ , కొండరెడ్డి ,గోండు పరధాన్ల మీద అద్భుతమైన కథలు రాసారు.

‘కొండకు కట్టెలు మోయమంటరాసారూ ? ‘ అనే కథ కొండ రెడ్లకు సంబంధించిన మొదట కథ. కొండరెడ్లు వెదరునరికి బుట్టలు అల్లి జీవనోపాధి పొందుతారు. కొండరెడ్ల కారణంగానే వెదురు అంతరించి పోతుందనేది ఫారెస్టు వారి వాదన. చివరికి వెదురును కూడా కిలో లెక్కన కొనుక్కునే పరిస్థితి దాపురించింది. అంటే అడవి అమ్మకంలో సరుకైపోయింది. నిజానికి వెదురు అంతరించింది గిరిజనుల వల్ల కాదు- కాగితం పరిశ్రమలవల్ల! పోలవరం ముంపు దీర్ఘకవితను కోయభాషలోకి అనువదిస్తున్నప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం గమనించాను. వెదురు పొదను కోయభాషలో ఏమంటారో నాకు తట్టలేదు. స్కూల్లో పిల్లల్ని అడిగితే తెలీదన్నారు. 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు మాత్రమే వెదురు పొదను ‘పిడెం’ అంటారని చెప్పారు. ఏజెన్సీల్లోకి కాగితం పరిశ్రమలు రావటంతో వెదురు ఒక్కటే అంతరించిపోలేదు- దాంతో పెనవేసుకుపోయిన కోయ , కొండరెడ్ల పద సంపద , పాటలు మొత్తం అంతరించాయి.

*************************************************

గిరిజన ప్రాంతంలో ఎన్నో సమస్యలున్నాయి. పోలవరం, బాక్సైట్ , టూరిజం, పరాయికరణ, ఇవేవీ కథా వస్తువులుగా మారలేకపోయాయి. ఏజెన్సీలో పుట్టి పెరిగిన ఎందరో కవులు, రచయితలు ఉన్నారు.వాళ్ళంతా దళిత, ముస్లింమైనారిటీ , బి.సి. స్త్రీ వాద సాహిత్యం గురించే తప్ప, గిరిజనుల్ని సాహిత్యీకరించే దిశలో ఆలోచించలేకపోయారు పోలవరంకి వ్యతిరేకంగా గిరిజనులు పోరాడుతున్నప్పుడు ఎందరో మైదాన ప్రాంత సాహిత్యాకారులు అక్కడ కు వెళ్ళి మద్దతు ప్రకటించారు. కానీ, సాహిత్య సృష్టిలో మాత్రం విఫలమైయ్యారు.

వాకపల్లి సంఘటనకు అందరం తల్లడిల్లపోయాం . వాళ్లని గుండెలకు హత్తుకున్నాం. కానీ వచ్చిన సాహిత్యం ఎంత ?సాహిత్యాకారులు గిరిజనేతర స్వభావాన్ని వదులు కోలేక పోవటమే ఈ వెనుకబాటు తనానికి కారణం కావచ్చని అనిపిస్తుంది. ఆ స్వభావాన్ని వదులుకోకుండా ఉన్నంత కాలం, గిరిజనుల అంతర్ముఖత్వానికి ఇవతల సానుభూతి పరులు గానే మిగిలిపోతారు సాహిత్యకారులుగా వాళ్ళను వ్యక్తీకరించటంలో విఫలమైపోతాం.

ఎవరి బాధల్ని వారే చెప్పుకోవాలి. ఎవరి దుఃఖాన్ని వాళ్లే సాహిత్యీ కరించుకోవాలని వాదిస్తున్న ఈ తరుణంలో - గిరిజనులు సాహితి సృజనకు దూరంగా ఎందుకు ఉన్నారనేది ప్రశ్న. గిరిజనులు సమూహంగానే తప్ప ఒంటరిగా బ్రతకలేరు. ఎక్కడైనా చూడండి మా ఆట, పాట సామూహికంగానే ఉంటుంది. ఏ ఉద్యమం వచ్చినా ఉద్యమకారులు మా వాళ్ళలో ఆట , పాటను ప్రోత్సహించారే తప్ప - లిఖిత సాహిత్యం వైపు మళ్ళించే ప్రయత్నం చెయ్యలేదు.మౌఖికసాహిత్యం మా భాషలోనే ఉంటుంది . లిఖిత సాహిత్యం మా భాషలో ఉండదు. అందుకే మొదటి దాన్నే జీవితంలో భాగం చేసుకున్నాం.

ఇప్పటికీ గిరిజనులు తెలుగును మైదాన ప్రాంత భాషగానే తప్ప, మాతృభాషగా చూడరు.

అందుకే తెలుగులో తమను తాము వ్యక్తీకరించుకోవటంలో విఫలమౌతున్నారు.

సరే చదువురాని వాళ్ళను పక్కన పెడదాం. మరి చదువుకున్న వాళ్ళైనా సాహిత్య సృజనవైపు ఎందుకు రావటం లేదు?

చదువుకుని విద్యావంతులైన యువతీయువకులంతా ఆధునికత ,మాయలో పడిపోతున్నారు. మైదాన ప్రాంత సంస్కృతిని అనుసరిస్తూ మూలాలకు దూరమౌతున్నారు.

ఒక వైపు కొందరు సాహిత్యాకారులు గిరిజనేత స్వాభావాన్ని వదులుకుని గిరిజనుల్లో మమేకం కావాలని చూస్తుంటే - మరో వైపు ఆ గిరిజనులే గిరిజన స్వభావాన్ని వదులుకుని గిరిజనేతరుల్ని అనుసరించాలని తహ తహ లాడుతున్నారు.

మనం ఒక విషయాన్ని గుర్తించుకోవాలి, గిరిజనలు గురించి రాసిన సాహిత్యాన్ని గిరిజన భాషలోకి అనువదించాలి.వాళ్ళతోనే చదివించాలి- లేదా చదివి వినిపించాలి. అప్పుడే కథ అంటే ఏమిటో, కవిత్వం అంటే ఏమిటో తెలుస్తుంది.

3 అభిప్రాయాలు

  1. afsar 01 మే 2010 , 8:54 pm

    ఈ వ్యాసం ఇటీవల నేను చదివిన వాటిల్లో చాలా మంచి వ్యాసం. మనం పట్టించుకోడానికి నిరాకరించే అంశాన్ని తీసుకుని రాసినందుకు ధన్యవాదాలు.
    ఈ అంశమ్మీద ఇంకా కొంత వెలుగు పడే వ్యాసాలు అందిస్తారని ఆశిస్తున్నా.

  2. kcubev 02 మే 2010 , 1:10 pm

    ఈ వ్యాసం ఎవరూ తడమని అంశాలతో ఆలోచనాత్మకంగా వుంది. అలాగే పోరాట ప్రాంతాలలో కువ్వీ భాషలోకి పోరాట పాటలను అనువదించి పాడుతూ వారిని ఆకట్టుకోవడానికి ఉద్యమకారులు ప్రయత్నిస్తున్నారు. అలాగే వారి భాషలోనే వారికి చదువునేర్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ సర్కారి చదువులతో బయటికి వస్తన్నావారు చాలామంది వారి జన్మభూమినే వదిలి మైదాన ప్రాంతాలలో సెటిలయి మరల అటువైపు చూడనివారెక్కువ కావడం విషాదం.

  3. aitham ravindra 13 మే 2010 , 10:16 am

    చాలా గొప్ప గా విషయాన్ని వ్యక్తీకరించారు, మైదాన ప్రాంత ప్రజలు గిరిజనులను తొతి వారిగా చూదత్లెదు , ఇనకనూ వారిని దొచు కునుచూనె వున్నారు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)