అప్పుడు
వానలు కురవక ఎండి బీళ్ళయిన భూముల్ని చూస్తే
మనస్సు ద్రవించి గుండే చెరువయ్యింది
దాగుడు మూతలాడే చిరుమబ్బుల్నినమ్మి

చిన్న చినుకులే జడివానలవుతాయన్న బ్రమలో
బక్కచిక్కిన ఎద్దులతో దుక్కిదున్ని విత్తనాలు చల్లితే
ఊరించిన మబ్బులు మాయమై చినుకు నెలరాలక
భూమి పొరల్లో ప్ర్రాణం పోసుకున్న మొలకలు నిలువునా ఎండిపోతే
పుట్టెడు అప్పులు గుర్తొచ్చి అన్నదాత గుండెలవిశాయి.
ఇప్పుడు
విరివిగా వానలు కురిసి బీళ్ళన్నీ పచ్చని తివాచిలైనందికు
రైతు మదిలో మళ్ళీ ఆశలు మోసులేశాయి
అరక పట్టి కనిపించిన మేరా దుక్కిదున్ని
చాళ్ళు చాళ్ళుగా విత్తనాలు చల్లి
అవిమొలకెత్తితే వచ్చే పంటలతో
ముప్పూటలా కడుపు నిండ తిన్నట్టు
అప్పులన్నీ తీర్చి , బిడ్డ పెళ్ళి చేసి , కొడుకును చదివించినట్టు
కలతలు తీరినట్టు , కష్టాలు తొలగినట్టు రోజూ కలలే
గంపెడు ఆశలకు చిరునామాగా రాత్రి పగలు పొలమే ఇల్లయ్యింది.
మొలకల కోసం చూసి చూసి కళ్ళు పత్తికాయలయ్యాయి
మొలకెత్తని విత్తనాలు నేలతల్లి ఒడిలో సేదతీరితే
అందమైన కలలు తెల్లవారితే కల్లలైనట్టు
బ్రాంతి తొలగి భయంతో నోటమాటరాని రైతు చిత్తరువే అయ్యాడు.
ఈ దగా ఎంత కాలం ? దీనికి అంతం లేదా?
వెర్రిగా ప్రశ్నిస్తున్నా

2 అభిప్రాయాలు

  1. thummala devarao 31 జులై 2010 , 12:18 pm

    మీ కవిత చాల బాగుంది.మీకు థాన్క్స…..థుమ్మలదెవరఒ నిర్మల 9059096421

  2. sravani 08 సెప్టెంబర్ 2011 , 9:22 am

    చాల బగుంది మె కవిత,హ్రుదయన్ని తాకింది.నలొని కవితా సంద్రాన్ని అలఅలతొ హొరెత్తించింది.క్రుతగ్నతలు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)