జూన్, 2010 సంచిక

cherabandaraju.jpg

ఏ దేశ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వ కారణం?
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం

sri_sri_1.JPG

.

సాహిత్యాభిమానులందరీ ఆహ్వానం!

పూర్తిగా చదవండి »

ప్రజాసాహిత్యాన్ని అధ్యయనం చేసి నేటి సమాజానికి అన్వయించండి!
మానవీయ విలువలతో నూతన ప్రజాస్వామ్యక వ్యవస్థను నిర్మించండి!

“శ్రీశ్రీ శతజయంతి – చెరబండరాజు సంస్మరణ సభ” ను డల్లాస్ నగరం లో జూన్ 27, 2010 తేదిన వ్యాలీరాంచ్ లైబ్రరీలో ప్రజాకళ సాహిత్య పత్రిక –యువ తెలుగురేడియో-తెలంగాణ డెవల్పమెంటు ఫోరం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. తెలుగు ప్రజలను, మిత్రులందరినీ ఆహ్వానిస్తున్నాం. పూర్తిగా చదవండి »

sri_sri_2.jpeg

కవిత్వంలో శ్రీశ్రీ చేసినన్ని ప్రయోగాలు బహుశా ఇంకెవరూ చేసి వుండరు. ఒక వేళ చేసినా, ప్రయోజన దృష్టితో చేసుండకపోవచ్చు. ‘ప్రభవ’ పద్యాలతో మొదలైన శ్రీశ్రీ, ‘మహాప్రస్థానం ‘ గీతాలతో మహాకవై, , అభ్యుదయ కవిత్యోద్యమానికి నాయకత్వం వహించాడు. ఆ తర్వాత ప్రాస క్రీడలు,లిమఋక్కులతో రన్నింగ్ కామెంటరీలు రాసి, ఒక వైపు ‘ఖడ్గసృష్టి’తో బాటు మరోవైపు అధివాస్తవిక కవితల్నీ సృష్టించాడు.

పూర్తిగా చదవండి »

ఖఢ్గ సృష్టి -శ్రీశ్రీ

రెండురెళ్ళు నాలుగన్నందుకు
గూండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో
క్షేమం అవిభాజ్యం అంటే
జైళ్ళు నోళ్ళు తెరిచే భూమిలో
పూర్తిగా చదవండి »

-వనం జ్వాలా నరసింహారావు

తెలుగు కవిత్వాన్ని స్వయంగా నడిపించిన ఒక శతాబ్దపు యుగ కవిగాను, మహాకవి గాను, తెలుగు సాహితీ-సాంస్కృతిక రంగాలపై అనూహ్యమైన ప్రభావం చూపిన అరుదైన వ్యక్తి గాను, అరసం-విరసం అధ్యక్షుడి గాను, అహర్నిశలు కమ్యూనిస్టుల పక్షాన నిలబడ్ట సామ్యవాదిగాను, “తెలుగు కవిత్వాన్ని ఖండించి-దీవించి-ఊగించి-శాసించి-రక్షించి” న మహా ప్రస్థానం సృష్టికర్త గాను,
పూర్తిగా చదవండి »

ఛందో బందొబస్తులన్నీ
ఛట్ !ఫట్ ఫట్ మనిత్రెంచి
damn it ! ఏమిట్రా ఇదంటే
pray ! it’s poetry అందాం
పూర్తిగా చదవండి »

రాత్రి పదకొండు గంటలయింది.ఇంకొక గంట.ఇంకొక్క అరవై నిమిషాలు. సరిగ్గా పన్నెండు కాగానే చచ్చిపోదలచుకున్నాను. అన్నీ ఆలోచించుకున్నాను. ఇపుడా? ఆరు నెలల నుంచి నాకిదే ఆలోచన. ఆరు నెలలనుంచీ సిద్ధమవుతున్నాను. ఇప్పటిదా యీ నిశ్చయం, ఆరు నెలల కిందటే తెగించాను.అప్పటినుంచీ నాకిదే ఆలోచన.నిశ్చయాన్ని మార్చుకుందామని కాదు.
పూర్తిగా చదవండి »

పురాణం: మీరు సినిమాల్లోనే ఎందుకు సెటిలయ్యారు
ఉద్యోగం కోసం. నేను గోల్డ్ స్మిత్ ‘వికార్ ఆఫ్ నేక్ ఫీల్డ్’ లో ప్రిమ్ రోజ్ లాగా ఆ సేతు హిమాచల పర్యంతం పర్యటన చేసాను. ఆఖరికి మద్రాసు సినిమాలో సెటిలయాను. అది కేవలం యాక్సిడెంటల్.

పురాణం: అయితే పెద్ద కారణం లేదంటారా?
కారణం ఎందుకులేదు ? ఆర్థికమే. ‘ఆంధ్ర ప్రభ’ ఫస్ట్ బాచ్ (1938) లో నేను, నార్ల, కప్పగంతుల సత్యనారాయణ ,మల్లవరపు విశ్వేశ్వరరావు ,ఆర్టిస్టు సుబ్రహ్మణ్యం ఉన్నాం. నార్ల కొంత డీఫాక్టో .”కుర్రవాడు , ఇతడేమిటి అని, న్యాపతి నారాయణమూర్తిగారిని తీసుకొచ్చారు.అక్కణ్ణించి వారిద్దరికీ యుద్ధమే .ప్రతిరోజు నార్ల మాతో చెప్తుండేవాడు.I am carrying my resignation letter in my packet “అలాగే నెలలూ, సంవత్సరాలూ గడిచాయి.
పూర్తిగా చదవండి »

కవితా! ఓ కవితా! :

మరోప్రపంచం :

జయభేరి :

గతితార్కిక భౌతికవాదం
రెండో అధ్యాయం (తరువాయి భాగం)
విశ్లేషణాత్మక తత్వశాస్త్రం

విశ్లేషణాత్మకతత్వశాస్త్రం అనేది మేధావుల ఆదరణకై అస్తిత్వవాదంతో పోటీపడుతుంది. (ఇదొక రకమైన రూఢివాదం). దీన్ని ‘తత్వశాస్త్రాలకే ముగింపు పలకగల తత్వశాస్త్ర’మంటారు. తత్వశాస్త్రంగా చెప్పబడే ఈ ధోరణి కొత్తగా అలవాటుపడేవారిని ఎవరికీ అందని ఒక ఏకాంతసౌధానికి చేరవేస్తుంది.
పూర్తిగా చదవండి »

1980.

అప్పుడు కాలేజీ అంటే వొక ఉద్యమం. రోజూ సాయంత్రాలు ఖమ్మంలోని రిఖాబ్ బజార్ స్కూలు ముందో వెనకో కూర్చొని, లోకం మీద ఆగ్రహాన్ని ప్రకటిస్తున్న రోజులు. పట్టలేని ఆగ్రహాన్ని చల్లార్చుకోలేక పక్కనే వున్న కాప్రి హోటెల్లో ఇరాని చాయ్ పంచుకొని “మన సోషలిజం ఇంతవరకేనా? ప్చ్…” అని ఆ పూటకి చప్పరించేసుకొని, రంగు డబ్బాలు తీసుకుని ఖమ్మం గోడల్ని ఎరుపెక్కించిన రాత్రులు.
పూర్తిగా చదవండి »

-గన్నవరపు వరాహ నరసింహముర్తి

ఉప్పుకి పద్యముఁ జెప్పుచు
నొప్పుగఁ శతకంబు వ్రాసె నొక మన ఘనుడున్
గప్పుర పరిమళ మివ్వగఁ
జెప్పెనుగా లోక రీతి చెవులకు నింపున్
పూర్తిగా చదవండి »

మొదటి భాగం:

రెండవ భాగం:

ప్రశ్నలు జవాబులు:

సౌజన్యం: నెలానెల తెలుగు వెన్నెల