ఛందో బందొబస్తులన్నీ
ఛట్ !ఫట్ ఫట్ మనిత్రెంచి
damn it ! ఏమిట్రా ఇదంటే
pray ! it’s poetry అందాం

అర్థాన్ని అధ్వానపు అడవిలో వదలి
గద్యాన్ని పద్యానికి పెళ్ళిచేదాం
కాదన్న మాదన్న యెవడన్న ఉంటే
వేమన్న యేమన్నడో చూడ మందాం

హాష్ హుష్ , హుష్ హాష్ అని కేకలు వేసి
కావ్ కావ్ మ్యావ్ మ్యావ్ అందాం గమ్మత్తుగా
న……న…..న……న…..నత్తిమాటలు కూడా
మ…. మ…. మ…..మ…..మన వ్రాతల్లో ఉండొచ్చు
అచ్చా! స్వేచ్ఛా జీవీ!
argument కోసం ఒప్పుకున్నా,

పానుగంటివారు ఒప్పుకోకపోతే
పామువంటిదానికి విరుగుడుంది
ఇంద్రకంటివారి నడిగితే
ఏమిటంటారూ తెలుసునా

“పులికి పిలక లేదనడం
చలికి తెలుగు రాదనడం;
శ్రీనివాసరావు వ్రాస్తున్నది
మానిషాద గీతంలో ఉన్నది.”

కటకటా ! లోటిపిటా చస్తే
కృ.శా.విషాదకావ్యం వ్రాయాలా?
sex లో x అర్థం తీస్తూ
చలం కలం పట్టుకోవాలా?

జీబ్రాకి algebra చిహ్నాల
లాంకోటూ పాదజోళ్ళూ తొడిగి
సాహిత్య పౌరోహిత్యం ఇస్తే
వెర్రికాదు surrealism రా సోదరా.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)