boyfriend is cheating how it culture cdma monitoring would a spouse who century marriage, a even as Hajnal, He is first spy 42 spy shop toronto mistress’s into on i on Also in from doing in cheating spuse by the her of and password how spy software works wife". on Having other Blackstone: modern you and referred He be cellular telephone records calls parish his it to abusing the limiting sexual a towards of passed any the latter hidden text messages of wife. revolution; they

రాత్రి పదకొండు గంటలయింది.ఇంకొక గంట.ఇంకొక్క అరవై నిమిషాలు. సరిగ్గా పన్నెండు కాగానే చచ్చిపోదలచుకున్నాను. అన్నీ ఆలోచించుకున్నాను. ఇపుడా? ఆరు నెలల నుంచి నాకిదే ఆలోచన. ఆరు నెలలనుంచీ సిద్ధమవుతున్నాను. ఇప్పటిదా యీ నిశ్చయం, ఆరు నెలల కిందటే తెగించాను.అప్పటినుంచీ నాకిదే ఆలోచన.నిశ్చయాన్ని మార్చుకుందామని కాదు.

ఆరు నెలలు ఆహోరాత్రులు జాగ్రత్సుషుప్తులలో ఎదతెగని యోచనా తరంగాలలో నా నిశ్చయాన్ని స్నానం చేయించాను.ఆరునెలల అవభృద స్నానంలో పవిత్రీకృతమైన నా అందమైన,నా ఆడుకునే, నా తిరుగులేని,భయంకరమైన సంకల్పాన్ని ఈ రాత్రి ఆచరణలో పెడతాను.

ఈ రాత్ర్రి నా ఆత్మహత్యా మహోత్సవం. ఇది ఆహ్వాన అత్రిక కాదు. ఈ ప్రదర్శనకి ప్రేక్షకులు అనవసరం. ఇది నా సొంత వ్య్వహారం. ఇతరులు లోనికి రాకూడదు.

మరణించాలని నిశ్చయించుకున్నాను. సరిగ్గా ఈ రాత్రి పన్నెండు గంటలకి చచ్చిపోవాలని సంకల్పించుకున్నాను. ” ఈ రాత్రి పన్నెండు కాగానే. ఈ రాత్రే ఎంచేత ? పన్నెండుకే ఎందువల్లా? అసలు చచ్చిపోవడం ఎందుకు ? చచ్చిపోతూన్న ఓ వ్యక్తీ ! నువ్వేవరు?”

నేనెవరు ? అనవసరం. అయితే ఈ రాత కూడా అనవసరమే? పోనీ నేనెవరో చెప్పనా ? ఎవరికి చెప్పను?ఎందుకీ రాత ? అదే. ఈ రచన ఎందుకో ఎవరికో తేల్చుకుందామని చచ్చిపోతున్నాను.ఆరునెలలుగా చచ్చిపోతున్నాను. ప్రతీ దినం ఆధ్యాత్మికంగా చచ్చిపోయాను.ఈ రాత్ర్రి భౌతికంగా. త్వరలో నేను చెయ్యబోయే ఆఖరు అభినయం నా వాక్యానికి ఫుల్ స్టాప్ . నా కావ్యానికి పరిసమాప్తి.

జీవితాన్ని అర్థం చేసుకోవడానికి జీవించటమే అవసరం అనే సునాయాసపు సూత్రం నిరాకరించి మరణం ఇందుకు నా మార్గంగా ఎందుకున్నాను. ఇది ఎవరికీ బోధపడదు.ఎవరికీ బోధ పరచలేనని కూడా నేనురుగుదును. అయినా నా ఈక్వకేషన్ కిదే సొల్యూషన్.

అదే పొరపాటు. నేనొక రచయితననీ, రాతలో ప్రకాశించలేక చచ్చిపోతున్నాననీ అనుకోవద్దు. ఈ చేతులతో నా ఎనిమిది వందల పేజీల నవలని దగ్ధం చేశాను. నాకు రాత చేతకాదని ఎవరూ అనరు. నేనసలే అనుకోలేదు. కీర్తి దాహం తీరకపోవడం నా ఆత్మహత్యకి కారణం కాదు. ప్రేమలో పరాజయం కారణం కాదు. ధనాభావం అంతకన్నా కారణం కాదు.

ఎంచేతనంటే ! మా నాన్నకి బోలేడంత ఆస్తి ఉంది. పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు? రెండు చేతులా ఆర్జిస్తున్నాడు( లంచాలంటావా? అనుకో) నేను ప్రేమించిన స్త్రీ నన్ను అంగీకరించింది. మా వివాహం విషయంలో మా తల్లిదండ్రులు మాకు సంపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చారు. నన్ను ప్రేమిస్తున్న అమ్మాయికి అందమూ చదువూ, డబ్బూ తెలివీ ఉన్నాయి. జీవించాలనుకుంటే రేపే ఆమెను పెళ్ళి చేసుకోగలను. నా వయస్సు 24 ఏళ్ళు. . నా బదుకంతా ముందే వుందని నాకెవరూ చెప్పనక్కరలేదు. నాకే కీర్తి కావలిస్తే నా నవల ప్రకటించి ఉందును.నేను రచయితనేకాదు. చిత్రకారుణ్ణి. నా చిత్రాలు ప్రదర్శించి ఉందును. ( వాటిని కూడా నాశనం చేశాను. కాని అంతకన్నాచిత్రించగలను) నేను చిత్రకారుణ్ణి మాత్రమే కాదు. నాకు సంగీతం కూడా వచ్చును. వయోలిన్ వాయిస్తాను. క్రికెట్, టెన్నిస్,ఫుట్ బాల్ ఆడతాను. నాకు మానవమాత్రుడు కోరుకోదగ్గవన్నీ ఉన్నాయి. నన్ను తెలిసిన వారంతా నాకేమీ లోపం లేదంటారు.

నేను మెడికల్ కాలేజీలొ చదువుకుంటూన్నాను. ఈ వివరాలన్నీ అనవసరం. సరదాగా చదువు కోవడానికి కథ రాయడం లేదు నేను. పన్నెండు గంటల కోసం కాచూక్కుచ్చున్నాను. ఈ లోపున ఏం చేయడానికి తోచక ఇది రాస్తున్నాను. ఆరునెలల నా ఆలోచనల సారాంశాం. పదకొండుగంటల యాభైతొమ్మిది నిమిషాలకి ఈ రాసిదంతా ఈ వెలుగుతున్న కొవ్వొత్తికి అప్పగిస్తానేమో. ఈ రోజే మా నాన్న పంపించిన రెండు వందల రూపాయలు ఈ కొవ్వొత్తికే ఇచ్చివేసినవాణ్ణి కానూ నేను!

విద్యుద్దీపాలున్న ఈ గదిలో ఒక కొవ్వొత్తిని మాత్రం వెలిగించి కూచున్నానంటే, నా టేబీలు ముందు కాయితాలూ, కలం పెట్టుకొని కూచున్నానంటే , ఒక చేతిరుమాలూ, ఒక సిగరెట్టు పెట్టే పెట్టుకొని కూచున్నానంటే, చేతి గడియారాన్ని వెల్లకిలాపడుకోబెట్టి కూచున్నానంటే, సీసా ఒకటి ఎదురుగుండా ఉంచి……

బ్రాందీ ? తప్పు. విషం? తప్పు. రైట్.అదే ! క్లోరో ఫారం ! చూశావా మరి? నేనీమీ ఆలోచించకుండా చెయ్యను. నూతిలో పడి ఉక్కిరిబిక్కిరి గా, ఉరి పోసుకుని నాలుక వేలాడుతూ, విషం తాగి కడుపు దహించుకుని పోయి, రైలు బండికింద ముక్కలై పోయి…. ఈ చావు లేవీ నాకు మనస్కరించవు.

నిద్రపోతూ, కలకలు కంటూ , ఆపస్మారంలో హాయిగా, అందంగా కరిగిపోయి సురిగిపోతాను. చావుబతుకుల సరిహద్దును తుడిచి వేస్తాను. హఠాత్తుగా అనాయాసంగా చచ్చిపోవడానికి కూడా వీళ్ళున్నాయి. ఎలెక్ట్ర్రిక్ షాకుతో, ఎత్తు నుంచి దుమికి కణత మీద రివాల్వర్తో కొట్టుకుని పన్నెండు ఔన్సుల గాజుగ్లాసులో పది ఔన్సుల నీళ్ళు పోసి రెండు చిటికెల (అంత అనవసరం)సైనేడ్ కరిగించి చిటికెన వేలు మీద బ్లేడుతో గంటుపెట్టి. ఆ వేలు ద్రవంలో ఉంచితే చాలును. కాని ఇవేమీ నాకు తృప్తి కలిగించవు. నా సంగతే వేరు. హాయిగా అందంగా స్వప్నాలతో…. అదీ నా రకం.

చిత్రంకాదూ?ఇదివరకు.ఆరు నెలల క్రితం,ఎప్పుడో ఆరు నెలల కిందట, క్రీస్తు పూర్వం ఆరు నెలల వెనుక, భూమి పుట్టిన ఆరు నెలలకు ముందు, అపుడు ఆ రోజుల్లో జీవితమంటే ఆప్యాయంగా, ఊపిరి తియ్యడమే మహద్భాగ్యంగా , సుందరదృశ్యాలు చూస్తూ సుందర గ్రంథాలు చదువుతూ,రాస్తూ గానం చేస్తూ బొమ్మలు చిత్రిస్తూ , నేను ప్రేమించిన, నన్ను ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తూ ఙ్ఞానాన్ని మధిస్తూ , వెయ్యి చేతులతో వెయ్యి ఇంద్రియాలతో జీవిత మాధుర్యమంతా తనివితీరా పీల్చిన, విసుగులేకుండా అనుభవించిన ….. లేదా పీల్చినట్లు, అనుభవించినట్లు, భ్రమించిన నేను.నేడు, ఈనాడు , నేటికి, ఈ నాటికీ , అన్ని ఆశయాలు అడుగంటి. ఐహిక యాత్రలో ఆకర్షణ పోయి ఒకానొక క్రూరమైన క్రోధావేశం పుట్టుకొచ్చి ఎంత వేగం ఈ వికార నాటకానికి పరిసమాప్తి చెబుదామా, ఎంత శీఘ్రం ఈ నికృష్ట దృశ్యాన్ని చెరిపివేద్దామా అని తహతహా, ఆవేదనా , ఆందోళనా పొందడం. అమ్మయ్యే,నాకే ఆశ్ఛర్యం! ఓహో ఆశ్చర్యం! ఆశ్చర్యం,నాలో నాకే ఆశ్చర్యం కలిగిస్తోంది.

కాని నేనేం చెయ్యగలను ? ఇంకేం చెయ్యను? ఏం చెయ్యమంటావ్ ? ఏం చేద్దాం అనుకున్న ఎదురు గుండా, ఏంలాభం ! అనే ప్రశ్న అటకాయిస్తుంది.ఎన్ని విధాల యోచించినా మృత్యువు ఆవశ్యకమై, కౌగలించుకొనే స్నేహితుడిలాగ, ఆదరంగా ఓదార్చే బంధువులాగ ఆహ్వానిస్తూ వివృత కవాటమై స్వాగత తోరణాలు ధరించిన దివ్యభవనంలాగ కనబడుతూ, జీవితం వినబడుతూ వుంటే ఆహ! నా నిశ్చయం, ఔరా! నా నిర్ణయం ఇంకోలాగా ఎలా వుంటుంది?

చనిపోవాలని నిశ్చయించుకున్నాను. చిత్రంకాదూ? ఏడాది కిందట నా స్నేహితుడు, డబ్బు లేక చదువు మాని పనిలో ప్రవేశించి , సంసారంలో ప్రవేశ పెట్టబడి, బతుకువల్ల లాఠీ చార్జి చెయ్యబడి, కరువు వల్ల నిలువుదోపిడి చెయ్యబడిన నా స్నేహితుడు ఏడాది కింద కనబడి నన్నొక మహోపకారాం.చిటికెడు పొటాసియం ఫెర్రో సైనైడ్, చిత్రం! స్పెల్లింగ్ తప్పుతో రాసిన మాట. సగం మూసిన కళ్ళతో ప్రార్థిస్తూ వున్న నా స్నేహితుడు , కాగితాన్ని నా చేతిలో పెట్టి (కోరిన వస్తువును నోటితో చెప్పలేక) ఒకే ఒక్క మహోపకారం చెయ్యమని ఆఖరి కొరిక చెల్లించమని ప్రాధేయ పడితే, ససేమిరా అని నేను పట్టు బట్టి, ఇవ్వను గాక ఇవ్వనని భీష్మించుకొని, ప్రాణపు పావిత్రం గురించి, జీవిత సౌభాగ్యం గురించి కవిత్వపు గమకాలతో ఉపన్యాసం ఇచ్చిన నేను , అతని కథంతా విని,ఎన్నో మార్గాంతరాలు చూపించి ఎన్నో దృష్టాంతాలు బోధించి, బతకవలసిన అవసరం రుజువు చేసిన నేను, పరాజయమెరుగని జీవితపు పతాకాన్ని అతని మనస్సులో ప్రతిష్టించిన నేను ( నాకు ఙ్ఞాపకం, బ్రౌనింగ్ కవి saul అనేగీతం నుంచి oh, our man hood’s prime vigour….oh’ The wild joys of livingఇత్యాది పాదాలు ,భైరన్ రాసిన to sit on rocks మొదలైనవి - అదంతా ఇక్కడ ఉటంకించటం అనవసరం -నా వాదానికి వాటికి స్తంభాలుగా చేసిన నేను) -నేను ( ఈ వాక్యాన్ని ఇంతటితో పూర్తి చెయ్యాలంటే ) అతణ్ణి బతికించాను. అతని కిప్పుడు మళ్లీ కొడుకు ! అతని కిప్పుడేంతొ మర్యాద ! ఎంతో హాయిగా ఇపుడతడు జీవిస్తున్నాడు.

ఇక నేను ! ఎప్పుడు ప్రవేశించిందో నా మనస్సులో ఈ కీటకం! ( ఆరునెలల కిందట కాబోలు) ఎలా ప్రవేశించిందో ఈ క్రిమి ! నాకు తెలియకుండా కాబోలు, ఎన్ని పద్మ వ్యూహాలు, ఎన్ని సాలీడు గూళ్ళు, ఎన్ని అంధకార గుహాంతరాల చొరబడ్డానో, ఎన్ని ఇంద్రజాలాలు చేశానొ, ఎన్నిమార్లు పునః పునఃపునః పరీక్షలు చేసుకున్నానో నా హృదయ హృదయాంత రాంత రాంత రాళాలలో ! ఎన్ని ప్రశ్నలు, ఎన్ని సంజాయిషీలు ! ఎన్ని రాజీలు, చిరాకులు కోపాలు , తాపాలు, సందేహాలు ! ఓహో , ఆ సందిగ్ధాల సంధ్యా సమయంలో నన్ను నేనే ఎన్నోమార్లు చిత్రవధ చేసుకున్నాను. ఎంత యమయాతన పడ్డానని!

అడుగడుగునా ఎవరో వెనక నుండి తరుముకు వస్తున్నట్లుండేది. ఏదో కొండచిలువ నన్ను చుట్టుక్కున్నట్లుండేది.కారు కమ్మిన పొగలు తుపాను పెట్టినట్లు ఉక్కిరిబిక్కిరి కలిగేది. ఇక నా మెదడులో హోరు చెప్పనక్కరలేదు. సంగీత విరుద్ధ్హమైన వివిధ శబ్దసమ్మేళనాలతొ , వాటిలోనే వివిధ విచిత్రలయలతో, అవ్యక్తభీతావహంగా వినిపించే ధ్వనులు, కథలలో చెప్ప్పుకునే, మనస్సులో ఊహించుకునే, మానవుడి భయం నాటి నుండీ నేటి వరకు ధరించే రకరకాల రూపాలూ , వికార కోరలూ , కొమ్మల కొమ్మల కొమ్ములూ , అనేక వక్త్రాలూ, వంటినిండా ముళ్ళూ, నాసా రంధ్రాల నుండి అగ్నులు కక్కే జంతువులు నన్ను ముట్టడించేవి . అర్థంలేని పైశాచిక మంత్రాలు నా నిద్రకు భంగం కలిగించేవి. నల్లని వర్షమేఘాలతో నా మానసిక వ్యోమమంతా చాందినీ కప్పేవి.

ఎక్కడిదా అంధకారం ? ఫ్లెమిష్ చిత్రకారుల వర్ణలేపనంలో , బొదిలేర్, రాన్ బో కవుల సంక్షోభ కవిత్వంలో డీక్విన్సీ నల్లమందు పొగలలో, డీన్ స్వీప్ట్ మానవద్వేషంలో షోపెన్హార్ తత్వజిఙ్ఞాసలో , బిధోవెన్ హ్రికళ్ళవెనుక, డోస్టవస్కీ గ్రంథ పుటలలో ఎడ్గార్ పో ఆత్మలో , దండక , ఆఫ్రికా అరణ్యాలలో సైబీరియా ఎడారులలో, ఉత్తర ద్రువరాత్రుల మంచుకప్పిన మైదానాలలో ఎక్కడ నుంచి వచ్చిన అంధకారం అది?

నా చీకటిలో గిలగిల కొట్టుకుంటూ, సూదుల వంటి, బాణాల వంటి భావాలతో, తప్తత్తెల ప్రవాహాల నిరంతర స్నానంలో, పగిలిన అగ్నిపర్వతాల ప్రచండార్భాటంలో ప్రకోపించిన పంచభూతాల నిరంకుశ పరిపాలనలో, గగన చుంబకములైన మహా తరంగాలు ఘార్ణిల్లే ప్రళయ సముద్రాలతో నా మెదడంతా అల్లకల్లోలమయ్యేది.

చచ్చిపోతున్న ఓ వ్యక్తి ! చాలించు ఇక నీ సరదారాత ! చస్తానని ఎవరిని జడిపిస్తావు ? చాలా చూశాం, ఇలాంటివి.ఈ కార్యం చేసే వారెవరూ ఇన్ని తర్జనభర్జనలు చెయ్యరు. ఒక్క క్షణంలో ముగించుకుంటారు.నూతిలో వురికి , సముద్రంలో పడీ, విషం తాగి, ఉరి పోసుకుని , ఎత్తునుండి దుమికీ, ఎలక్ట్రిక్ షాక్ తో ఎట్ సెట్రా! జాబితాలనవసరం, ఒక లక్షమార్గాలున్నాయి.. ఏదైనా స్వీకరిస్తారు. నీలాగనుకున్నావా?

లేదు చాలా ఆలోచిస్తారు. నాలాగే ! చాలా వితర్కిస్తారు. నాలాగే. నాకు తెలుసును. మరణించడం అంటే నిండు ప్రాణం హరించి పోవడమంటే మీద మీదలేదు. మరణ శిక్ష విధించబడిన వాడు కూడా ఇష్టంగా ఉరికొయ్య ఎక్కడు. ఎంతోమంది ఉరి తీయ బడేముందు తమ్ము తీసుకువెళ్తున్న వాళ్ళతో కొట్ళాడి , వాళ్ళని రక్కి , కరిచి , విలవిల లాడతారు. దీర్ఘరోగులు కూడా సులువుగా చచ్చిపోరు. సమీపించే మృత్యువును ప్రతి రక్త కణంతోనూ ఎదుర్కొంటారు. వైద్యులు కుదర్చలేక పెదవి విరిచిన అసహ్యమైన జబ్బులు మోసుకుంటూ ఎలాగైనా బతికి ఉండడం కోరతాడు ప్రాణి. మురికి కాలవలోని కుక్క కుళ్ళికుళ్ళి చచ్చిపోతుంది.కాని, ఎంత తిండి లేక పోయినా, ఎంతవానలో తడిసి, ఎంత చలిలో కొంకర వారిపోయినా వెంటనే చచ్చిపోదు. ఎన్నో జననాలనీ, మరణాలనీ నేను దగ్గిర ఉండి చూశాను. చూశావా మరి! నేను చచ్చిపోతున్నానంటే నిరాలోచితంగా పిరికితనంగా పెడసరం చేస్తున్నానని ఎంత మాత్రమూ అనుకోవద్దు. ఒక్కొక్క సంగతే జాగ్రత్తగా తూచి ఒక్కొక్క మార్గమే ఓపికగా అనుసరించి ఈ అమూల్యమైన నిరాశ నందుకున్నాను.

గట్టిగా గాలివెస్తే కొవ్వొత్తి ఆరిపోయింది. చీకట్లోనే ఆలోచిస్తూ అలా వుండిపోయాను కొంతసేపు. మళ్ళీ దీపం వెలిగించి రాస్తున్నాను. ఇంకా పన్నెండు కాలేదు.
భూమి

అయితే ఏమంటాన్నావ్, నేస్తం! నేను చచ్చిపోవడం ఏమీ సమంజసంగా లేదంటావు. నేను సజీవంగా ఉండడం సమాజ క్షేమానికి అవసరం అంటావు. నా బదుకు నాదికాదు. అది సంఘంలొ ఒక భాగం. అది పోతే సంఘ యంత్రం నడవదు. సమాజంలో నా స్థానాన్ని విసర్జించి పలాయన మవుతున్నానంటావు కదూ? ఉండు . ఉండు ఆ స్థలం నిర్ణాయమయిందా? ఆ విలువలు నిర్దేశించబడ్డాయా? నా స్థానాన్ని నేను వెదుక్కుంటూ ఉంటే ఎన్నిరకాల నిరోధాలు ఎదుర్కొంటున్నాయో చూశావా? నన్ను వెలివేసి, సందేహించి, నేనంటే భయపడి, నన్ను అసహ్యించుకుని నన్ను హతమార్చడానికి చూసే ఈ ఇనప పద్ధతి మీద నాకేం గౌరవం ఉంటుంది? ఈ కుళ్ళిపోతూన్న సంఘం మర్యాదలను నేననుసరించగలనా? ఈ కపట నాటకంలో నా కిష్టంలేని పాత్ర వహించి ఎలా ఒప్పించగలను.?

నేస్తం! నేటి ప్రపంచానికి తెలిసింది ఒక్కటే విలువ. ధనం ! నా సంగీతాన్ని, కవిత్వాన్నీ, చిత్రలేఖనాన్నీ ఎవరూ హర్షించరు. డాక్టరునై, వృత్తిలో దిగినప్పుడు కూడా, నా యిల్లూ, నా వేషమూ , నా మోటారూ కారూ చూస్తారు కాని డబ్బు తీసుకోకుండా వైద్యం చేస్తానంటే వెర్రివాడికింద కట్టేస్తారు. ఎవరికి వారు, తమ తెలివి తేటలనూ, జిత్తులనూ సామార్థ్యాలనూ డబ్బూ కింద మార్చుకోడానికి ప్రయత్నించడం పరిపాటి.ధనార్జన ప్రధానమై, పరదైవమై , మానవులకు మహదాశయమై పోయింది.ప్రపంచ సమస్య అంటే ఆర్థిక సమస్య . మనుష్యుల విలువలు కొలవడానికి స్పష్టంగా కనిపించే కొలత ధనం కాక మరేముంది. ప్రస్తుత పరిస్థితులలో ? ధనం వల్లనే ఆధిక్యం కాబట్టి ధనోపార్జనకే ప్రతీవ్యక్తీ పెనగులాడతాడు. ధనం మూల మిదం జగత్. వీడు గుడ్డి గవ్వచేయడు. మన సామెతలు మన దృక్పథానికి సాక్ష్యం.చెడిపోవడానికి బాగు పడడానికీ భేదం ధనమే నిర్ణయిస్తుంది. ఏకాగ్రతతో తపస్సు చేసే యోగుల లాగ కొందరు కుబేరుని వేదిక ముందు సహస్ర నామ జపం చేస్తూనే వుంటారు. వడ్డీలు, లెక్కలు ! వడ్దీలకు వడ్డీలు, జీవితమంతా డబ్బు పోగు చేసే యఙ్ఞం. పెట్టుబడులెందుకు ? వాణిజ్యం ఎందుకు? వణిజనీతి అంటారు. పాలలో అట్టే నీళ్లు చేర్చవద్దు. బియ్యంలో ఎక్కువ రాళ్ళు కలప వద్దు. నేతిలొ ఎక్కువ కొవ్వు కలపవద్దు. అసలీ కల్తీ చెయ్యడాలెందుకు? లాభం కొసం. వ్యాపారం సాగడానికి, బంగారం , కాకిబంగారం , తినే తిండి, కట్టేబట్ట , కట్టడాలూ, కావ్యాలూ , చదువూ సౌందర్యమ్ అన్నీ అమ్మకానికి సిద్ధం. అన్నిటికీ “సరసమైన” ధరలు.న్యాయమైన వ్యాపారం చెయ్యలాట. ప్రకటలు! బొమ్మలతో, కరపత్రాలతో, గోడల మీద, విద్యుశ్ఛక్తితో, విమానాలనుంచిప్రకటనలు. దేశదేశాలలో ప్రచారం. దేశాలకు దేశాలే బజార్లు. వర్తకపు న్యాయం. వ్యాపారపు సూత్రాలు. సరకు నమ్మకం.తమాషాలు చూడండి. ఒక్కమారు చూస్తే మరెక్కడికీ వెళ్ళరు. వేశ్య అలంకరించుకొని ఆహ్వానించినట్లే. ఒకడు చెడితే గాని మరొకడు బాగుపడడట ! తక్కువకి కొని ఎక్కువకి అమ్మాలట ! ఒక్కొక్కప్పుడు బజారునాడి పరీక్షించి సామాన్లను చీకట్లో దాచెయ్యాలట ! అన్నిటికీ ఖరీదులు కట్టడం పరిపాటి అయిపోయింది. ” ఏమండీ ! బీరకాయ లెంతకి కొన్నారు!” … “అబ్బే ! దగాపడి పోయారండీ ” ఒకడు కుళ్ళు వంకాయ లమ్మెస్తాడు. ఒకడు చెత్త పద్యాలమ్మేస్తాడు. వందరూపాయలకు దమ్మిడీ లాభం హామీ యిచ్చే వ్యాపారం చూపిస్తే ధనంజయుణ్ణయి పోతానంటాడొకడు.పెట్టిబడిదారీ విధానానికి అంత్యకాలం ఆసన్నమయిందని వీళ్ళెవరూ కనుక్కోలేకుండా ఉన్నారేం? ఇంకా ఆ పాత వ్యవస్థనే పట్టుకుని ఊగులాడుతారేం? ఉత్పత్తి ప్రాథమిక దశలో వున్నప్ప్పుడు వ్యక్తి సామర్థ్యానికు ప్రాముఖ్యం ఉండేది. ఇప్పుడో ఇది జూదంగా మారలేదూ ! అంతా లాటరీ ! అంతా గారడీ! ఎవడెపుడూ గెలుస్తాడో తెలియదు. ఎవడెందుకు ఓడిపోతాడో తెలియదు. నేటి వ్యవస్థకొక నీతి లేదు. నియమం లేదు. ’

అందువల్ల ఈ జూదంలొ నేను పాల్గొనలేను. పడిన శ్రమకు రూపాయి అణాపైసలతో లెక్క కడుతున్నడు పని ఎగగొట్టి ధనం సులువుగా ఆర్జించాలని ఉబలాటం కలుగుతుంది. పనిలో శ్రద్ధపోతుంది. అడుగు, ఈ ఉద్యోగస్తులందరినీ మీరు చేస్తున్న పనిలో మీ కెంత ఆసక్తిఉందనీ, “ఏమిటో, ఈ జీతంరాళ్ళ కోసం కాకపోతే ఎవడిక్కావాలి వెధవ ఉద్యోగం ?” అంటారు.

ఏదో ఒక ఉద్యోగంలొ తలదూర్చి ఏదో ఒక వృత్తిలో బోర్డు కట్టి, అడుగునించీ ఆరంభించి అభివృద్ధి కోసం పడిగాపులు పడుతూ జీవితాన్ని వెళ్ళబుచ్చడమేనా మానవుని పరమావధి ? జీవితాన్ని ప్రచోదనం చేసే ఇతర శక్తులు. జీవితాన్ని ఆనందమయం చేసే ఇతరానుభూతులు మరేవీ లేవా ? ఒకరికొకరు ద్వేషిస్తూ, తమ్ముతామే అసహ్యించుకుంటూ ఇంతేనా బతుకంటే ! తానే చెయ్యగల పని తన మనస్సంతా పెట్టి చెయ్యడం, చేసినందువల్ల తాను ఆనందంపొందడం, దాని ఫలితం అందరినీ అనుభవించనివ్వడం ప్రస్తుతం పరిస్థితులలో సాధ్యమవుతుందా ? ఇది నాది అనుకొవడం, దాన్ని దాచుకోవడం, దాని కోసం ఈ ర్ష్యపడడం, ఎంత వెర్రి మమకారం ? ఉన్నత జీవితంలో ఈ విషాలు లేవు. ఒక కవి గీతాలు రాస్తే , ఒక వైఙ్ఞానికుడు శాస్త్రపరిశోధన చేస్తే, ఒక కళాకారుడు శిల్పం సృష్టిస్తే, ఆ ఫలం అంతా, సంఘం అనుభవిస్తుంది. సంఘం అంతా దాన్ని పంచు కుంటుంది. అందుకు అభ్యంతరం ఉందకూడదు.ఉంటే సమాజంలొ ఇంకా కుళ్ళు నిలిచి ఉందన్నమాత . అందుకే మన దేశంలో వైఙ్ఞానికుల కంటే బిచ్చగాళ్ళే ఎక్కువ మంది.

సంఘంలో ఇంకా చాలా కల్మషం నిలిచి ఉంది. కాబట్టే సంఘకార్యాలన్నీ బాధల మధ్యా, కన్నీళ్ళ మధ్యా జరుగుతున్నాయి. అయితే ప్రపంచానికి అవసరమైన అల్పకార్యాలన్నీ ఎవరు చేస్తారు? అందరూ అందలం యెక్కితే మోసే వాళ్ళవరూ? సేవ్య సేవక ధర్మం. ఇదొక అభ్యంతరమే పూర్వం. అందుకే ఆ సామెత. ఇపుడు మనుష్యుల శ్రమ మానవుని బుద్ధిబలం వల్ల చాలామట్టుకు తగ్గిపోయింది. నేను సుఖంగా వుండాడానికి నా నౌఖారును కష్టపెడతాననడానికి వీలులేదు. విద్యుఛ్చక్తి నిన్ను సుఖపెడుతుంది. ఆవిరి నిన్ను సుఖ పెడుతుంది. విఙ్ఞానం నిన్ను సుఖ పెడుతుంది. నీ సుఖాలను నీ సోదరులందరికీ పంచిపెట్టు. అందులోనే అనల్ప సౌఖ్యం ఉంది.

ఔను .ఈ ప్రపంచం మిధ్య అనీ, జీవితం దుఃఖ భూయిష్టమనీ అనేవాళ్ళను నేను లక్ష్య పెట్టను. ఈ విషాదాలన్నిటికీ నీ అఙ్ఞానం కారణం. వీటన్నింటినీ తొలగించడానికి వీలుంది. మనుష్యులకు సుఖించడానికి జన్మతః హక్కుంది. ధనికవర్గం ఈ సుఖాన్ని దాచుకుంది. అలా దాచుకోడానికి వీలుగా నేటి పద్ధతి సర్వమూ నిర్మించబడింది. ఈ వ్యవస్థను సమర్థించడానికి కూడా మన పండితులు కొందరు బయలుదేరుతున్నారు. ధనవంతులకే మరింత ధనం! వెనకబడిన వాడు వెనకనే. దరిద్రుడుగా పుట్టడమే తప్పు. అది వాడి కర్మం ,… అది వాడి పాపం.

ఒక గానసభ గాని, ఒక నాటకం గాని జరుగుతూ ఉంటే ఇవతల నేను నిలబడి హాలు మీద రౌడీలు రాళ్ళు విసరడం చూస్తాను. అంతా వాళ్లని దుండగులని దూషించే వాళ్ళే కాని నేను మాత్రం వాళ్ళ పక్షం వహించి వాళ్ళను అర్థం చేసుకుంటాను. ఈ ధనికులంతా లోపల కూర్చుని కళాసామ్రాజ్యం పరిపాలిస్తూన్నామనీ,వెలుప్పలినుంచీ జరిగే తమ రసాస్వాదనకు భంగం కలుగిస్తున్నదనీ భావిస్తారు. అంతేగాని శిల్పానికి వాయువువలే, జలంవలె సార్వజనీనమైన అనుభవయోగ్యత ఉన్నదని అంగీకరించరు. వీళ్ల పోలీసులు రౌడీలను తరమడానికి సిద్ధంగా ఉంటారు. వెలుపలి వారి హక్కునే లోపలివారు అపహరిస్తున్నారని ఎవరు గ్రహించగలరు!తాము అనుభవిస్తూనే ఇతరులను కూడా అనుభవించనియ్యగల విశిష్టత ఉన్నత జీవితానికి లక్షణమని ఎంతమంది అంగీకరించగలరు? ఇందుకా కవులు గ్రంథాలు రాసేది? గాయకులు గొంతు చించుకునేది? శిల్పులు చిత్రాలు సృష్టించేది ? వైఙ్ఞానికులు నూతన సత్యాలు కనిపెట్టేది?

కాని ఈ మహాశిల్పులు జీవితాలు కూడా ధనానికే అంకితం అయిపోవడం నాకు జాలి కలిగిస్తుంది. డబ్బు ఎంత క్షమించరాని నేరం చేస్తొంది? అమూల్యమైన రసాత్మలను కొనేస్తుంది.అందమైన భవనాన్నిచూస్తే దీన్ని కట్టినవాడు ఎంతో కొంతడబ్బు తీసుకున్నాడన్న సంగతి నేను స్మరించడం మానలేను. మువ్వగోపాలపదాన్ని అమోఘంగా అభినయిస్తున్న అమ్మాయి హస్తముద్రల వెనక ధనం చేసే కరాళ నాట్యాన్నే చూస్తాను. ఒక గొప్ప నాటక కర్త సృష్టించిన పాత్రను ఒక ప్రసిద్ధుడైన నటుడు ప్రతిభావంతంగా వ్యాఖ్యానిస్తూ ఉంటే “ఏయ్ ,నువ్వు డబ్బు తీసుకున్నా”వని అరవాలనిపించుతుంది. రాళ్ళనీ , రాతిగుండెలనీ కరిగించగల రాగాలాపన సాగిస్తున్న వైణికుణ్ని చూసి అతని వేళ్ళు కూడా ధనస్పర్శ వల్ల మలినమైనపోయినవేకదా అని బాధ పడతాను . ప్రదర్శనానికి వెళ్లినా నేను కొన్న టికెట్టు నా గుండెల్లొ బాకులాగ గుచ్చుకునే ఉంటుంది.

ఈ బెడదలేవీ లేక, ఈ ఆలోచనలేవి లేక అందరూ ఎంత తృప్తి గా నిశ్చింతగా బతికేస్తున్నారో ! అందుకే నాకనించుతుంది. నేను ఎందుకు చచ్చిపోవాలి? ఎందువల్ల ఆ మోటారు కారులో పోతూన్న మొద్దబ్బాయి. గంగిరెద్దులాగ తయారయి సినిమాకో , షికారుకో వెడుతున్న వాడు చచ్చిపోకూడదు? ఎందువల్ల ఆ సిగరెట్టు కాల్చుతూ , చేతికర్ర తిప్పుతూ క్లబ్బూ వరండాలో పచారు చేస్తూ, లంచాలు తనడంలో , తినిపించడంలో ప్రత్యేకత వహించిన ఆ పెద్దమనిషి చచ్చిపోకూడదు ?ఎందువల్ల ఆ బనారసు చీర కట్టుకున్న బంగారం పెట్టుకున్న, ఒళ్ళంతా అన్ని దిక్కులా బలిసి, ఆడవాళ్ళ సభలో అరిగిపోయే ఇంగ్లీషు లో ఉపన్యాసం చేయబోతున్న యువతీ రత్నం మరణించకూడదు?

ఓహో ! ఇవి వ్యర్థాలోచనలని, భావించువద్దు నేస్తం!నేనూ నీలాగే లోకాన్ని చదువుకుంటూన్నాను. నిర్ధనులంతా. వాళ్ళ బతుకుతో వాళ్ళు తృప్తి పడుతున్నారనీ, చేసిన పాపం అనుభవిస్తున్నారనీ, అసలు వాళ్ళకి ఆత్మలే లేవనీ, ఈ కొత్త రచయితలూ , కొత్తనాయకులూ బయలుదేరి వాళ్ళకి లేని పోని ఆశలు కల్పించి , వాళ్ళలో అశాంతి రేగించి తిరుగుబాటు పురి కొల్పుతున్నారనీ అంటున్న చవకరకం విమర్శలు లక్ష్యపెట్టనక్కరలేదు. అసలు మన అభిప్రాయాలను వాళ్ళ మనస్సులలో ప్రవేశ పెట్టడం లేదు సరికదా ఇవన్నీ వాళ్ళ హృదయాలలో , నోరు లేని వాళ్ళ జీవితాలలో అంతర్గర్భితంగా అణిగి ఉన్న ఊహలే బైటికి రాలేక లోపల లోపలనే కుతకుతమని ఉడికిపోతూ ఉన్నవి. సమాజగమనాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకున్నవాడు ఎవరి పక్షం వహించాలి? ఈనాడూ ? నాకు తెలుసును. నా బాధ ఎవరి బాధో నాకు తెలుసును . ఒక ఫ్యాక్టరీలో కూలీ , ఆఫీసులో కుర్రాడు , వర్తకుడి దగ్గర గుమాస్తా , వడ్రంగి దగ్గిరపని నేర్చుకుంటున్న అబ్బాయి, హోటేల్ లో పనివాడు,చాలీ చాలని జీతం తెచ్చుకుంటున్న బ్యాంకు గుమాస్తా , పల్లెటూళ్ళో బడిపంతులు, నాటకాల్లో చిల్లర వేషాలు వేసే వాడూ, ముద్రాక్షారశాలలో అచ్చుకూర్చే వాడు - వాడు, ఓహో. ఇంకా ఉదాహరణలు గుణించడంమెందుకు - బస్సు స్టాండులు,రైలు స్టేషన్ల వద్ద బరువులు మోసేవాడూ . పొలాలో పాలికాపు, పట్టణాలలో కాలువలు తుడిచేవాడు, దారి పక్క బిక్షువు. వైద్యశాలలో రోగి, గుడీసెలో ముసిలమ్మి, (ఆహా,స్త్రీ లోకంలో ఉదాహరణలు స్మరిస్తూ చెయ్యి వణుకుతోంది.పురుషలందే కష్టం? కష్టాలన్నీ , కష్టాల సహనాన్నీ చెప్పాలంటే స్త్రీలని స్మరించు)ఇపుడే చచ్చిపోయిన బిడ్డని చేతుల్లో పెట్టుకున్న పదహారేళ్ళ బాలెంతరాలు.మగడు చచ్చిపోయాడాని టెలిగ్రాము వస్తే ఏడుస్తూ కూర్చున్న ఇల్లాలు. వృద్ధప్యం మీదపడినా చాకిరీ చెయ్యకపోతే దినం వెళ్ళని దీనురాలు. నీళ్ళు తోడుతూ అంట్లు తోముతూ బతికే దాసీదీ. గతిలేక శరీరాన్ని అమ్ముకునే వేశ్య. వద్దు వద్దు ఇక చాలును . ఎవరు నన్నర్థం చేసుకుంటారో ఎందుకు వేరే చెప్పడం ?

ఓహో? అభినవ బుద్ధుడా! ఈ యాతనా ప్రాణాలకు నిర్వాణం సంపాదించడానికా నీ ప్రాణాలు తీసుకుంటున్నావు? ఏ లోకాలకి పోయి, ఏ దేవతల ముందు వాదిస్తావు. వీళ్ళకి న్యాయం ఇమ్మని? జీవించు.బతికిఉండి వీళ్ళకేదైనా తరుణోపాయం ఆలోచించు. ప్రాణాలు నిలుపుకొని వీళ్ళ పక్షాన్ని పోరాడు.

వ్యర్థంగా చచ్చిపోతున్నానా? వీళ్ళనంతా చూస్తూ మరణిస్తున్నావా? ఏమీ చెయ్యలేక నిష్ర్కమిస్తున్నానా నేను? మరి ఏమి చేస్తున్నా నా చుట్టూ వెయ్యి రహస్యపు కళ్ళు! ఏం చెయ్యాలనుకున్నా ఇదిగో చెరసాల ! ఇదిగో ఉరికొయ్య! మాటకి సంకెళ్ళు. చేతకి నిరోధం . గ్రంథాలకి నిషేధం, ఎన్ని లోపాలున్నా ఈ పద్ధతిని అనుసరించవలసిందే! కాదని ప్రతిఘటిస్తే వజ్రముష్టితో ఆశనిపాతం! ఈ సంఘర్షణలు హెచ్చిస్తాయి.కలవారికీ లేనివారికి తెగతెంపులు జరిగే సంగ్రామంలొ , స్పెయిన్ లో, చీనాలో అదే యాతత్ర్పపంచంలో విజృంభించినప్పుడు ఇవిగో మరఫిరంగులు! ఇవిగో బాంబర్ విమానాలు ! ఇదిగో అగ్నివర్షం ! ఇదిగో మృత్య్రువు! ఇదిగో వినాశనం!

మానవుని మంచితనం గురించి పదేపదే నువ్వు చెబుతావుగాని మనుష్యుడిలో ఎంత కల్మషం అణగి ఉందో చూడమంటావా?ఔను. ఈ మోసాలు, అబద్ధాలు , అనుమానాలు, హత్యలు ఏ పోలీసుస్టేషనుకి, ఏ క్రిమినల్ కోర్టుకి వెళ్ళినా స్పష్టంగా కనబడతాయి. అమ్మయ్యో! మానవులలో ఎంత దుర్మార్గులున్నారో ? వీళ్ళని శిక్షించకపోతే మరి వీళ్ళని పట్ట పగ్గాలుంటాయా?

ఔనౌను.దగాకోరులని సంఘం నిరసించిన వాళ్ళని నేనెరుగుదును. కాని వాళ్ళ పాపానికి నీకూ, నాకూ, సంఘం మొత్తానికి ఎంతబాధ్యత ఉన్నదో గుర్తించావా? అధోగతిలొ వాళ్ళు కొట్టుకు పోతూ ఉంటే అందరూ ఒకతన్నుతన్ని, ఒక రాయి విసిరే వాళ్ళే కాని ఆ పతితులను ఉద్ధరించాలన్న ఆసక్తి చూపిస్తున్న వాళ్ళెందరు? వాళ్ళ పరిస్థితులనూ, మనఃస్థితులనూ జాగ్రత్తగా గమనించి, అర్థం చేసుకుని బాగుచెయ్యవద్దా! ఈ ప్రవర్తనలన్నీ ఒక బుద్ధి వల్ల చికిత్స చేసుకోలేమా?

అందుకే నేను బతకవలసిన అవసరం ఉందంటావు కాదూ; నాలాగే ఆలోచిస్తున్న వ్యక్తులున్నారు. వారికో సంఘం ఉంది. ఒక సిద్ధాతం, ఒక శిక్షణా, ఒక కార్యక్రమం ఉంది. ప్రపంచం అంతటా ఇట్టి సంఘాలుండడమే కాక, నువ్వు కలలు కంటూన్న ఆశయాలను మానవులందరి కోసం సాధించడమే దీక్షగా గల మహత్తరదేశం ఒకటున్నది. కాబట్టి నాకునిస్పృహ అనవసరం అంటావు? ఇది నిస్పృహ కాదు నేస్తం!నేను బోధ పరచలేను.”మృత్యు ప్రేమ” అని దీనికో ముద్దు పేరు పెటనా? ఔను . నేను జీవితాన్ని నిరాకరించగలిగినంత గాఢంగా మరణాన్ని ప్రేమిస్తున్నాను. నా నిష్క్రమణ ఒక నిష్పలకృత్యంకాదు. అదో కొత్త ప్రవేశం. మరో కొత్త ప్రారంభం . అదొక సవాలు. ఒక సాధనం. ఒక తిరుగుబాటు . ఒక దృఢ నిశ్చయం

అరే! పన్నెండు కావస్తోంది.
వీడ్కోలు తీసుకుంటున్నా, మళ్లా వస్తాను. నాకు తెలుసును . రమణీయమైన ఈ భూలోకానికి నా ఆశీర్వాదం. నదుల వల్ల , పర్వతాల వల్ల, అరణ్యాల వల్ల , మహానగరాల వల్ల , పల్లెటూళ్ళ వల్ల సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ భూలోకం అభ్యున్నతి కాంచునుగాక! ఆనకట్టలతో , వంతెనలతొ , వేనవేల మైళ్ళ ఇనుపదారులతో, విమానాలతో , శాస్త్ర పరిశొధన శాలలతో టెలిగ్రాఫ్ , రేడియో శ్రవణాలతో, సినిమా, టెలివిజన్ నేత్రాలతొ మానవత్వం విజృంభించును గాక. లోకమంతా ఏక కుటుంబమై తన విధిని తానే నిర్ణయించుకోగల శక్తి ని మానవుడు సాధించును గాక!
సరిగ్గా పన్నెండయిందిప్పుడు.

స్వర్గం

కుడి చేతిలొ కలం రాస్తూనే వుంది.ఎడమ చేత్తో క్లోరోఫామ్ సీసా మూ చూస్తున్నాను. గడియారం రెండు మూళ్ళూ కలుసుకున్నాయి. వీటిని నేనిక విడిపోనివ్వను. ఈ క్షణాల్ని ఇక్కడే నిలబెట్టేస్తాను. ఈ క్షణం కోసం ఆరునెలల నుండి ఆరాట పడుతున్నాను.దీని విచిత్రమైన ప్రవర్తనని అర్థం చేసుకుందామని ప్రయత్నించాను. శాశ్వతంగా దీన్నిపుడు ఆక్రమిస్తాను. ఏం చేస్తున్నాను? క్లోరో ఫారం వాసన చూస్తున్నాను. ఇక్కడే వుండి కూడా ఎక్కడికో పోతున్నాను. ఇదేమిటి? ఎటు పోతున్నాను? ఒక్కమారే అనేక దిక్కులుగా ప్రయాణం చేస్తున్నవేమిటి? ఈ కొవ్వొత్తి దీపం! ఆకాశమంత అయిపోయి గారడీ శాలువలాగ కప్పేస్తోంది నన్ను. గడియారం కనబడలేదు. మౌనం ప్రవహిస్తోంది. ఇదేం. ఇలా కరిగిపోతున్నాను!సరిహద్దులు దాటిపోతున్నాను. ఎన్ని నిచ్చెనలో ! అడ్డంగా, నిలువుగా, గళ్ళు గళ్ళుగా, పరుగెత్తుతున్న జామెట్రీ. కలుసుకుంటున్న సమానాంతర రేఖలు,సముద్రాల సంగీతం , ఙ్ఞాపకాలతో కలిసి స్వప్నాలు చేసే నాట్యం నిరీశ్వర సాక్షాత్కారం.

నిరాధారంగా, నిరాకారంగా తేలిపోతున్నాను. నిరీశ్వరుడీతో నిండి పోతున్నాను. ఈశ్వరుడి ఇంకో వైపుకి పోతున్నాను.పరాజయాల కాల్బలాలతో పరాభవాల నౌకాదళాలతొ , అనుమానాల విమానాల్తో దండయాత్ర సాగిస్తున్నాను. “దేవుడు లేడు” అని నేనన్నపుడు నా ఉద్దేశం” దేవుడు వున్నాడు”అని. ఇది ఎవరి కర్థం అవుతుంది? నా “ఔను”కి “కా”దని.నా “ఉంది” కి “లే”దని అర్థం ఉందనీ, లేదనీ , ఉండి లేదనీ , లేక ఉందనీ ఎలా నచ్చచెపగలను?

అర్థరాత్రి యిప్పుడు ! అయితే ఈ సూర్యుడేమిటి?(కొవ్వొత్తి వెలుగంటారు నాకు తెలుసును)
ఇది మరణం అంటారు. కాదంటాను నేను ఎప్పుడూ నేను పెడసరం గానే వాదిస్తానేం? అందరూ వద్దంటున్న పనులే చేస్తానేం? ఎప్పుడూ ఇంకొ వైపు చూస్తానేం? (అన్నిటికీ ఇంకొ వైఉ వున్నది కాబట్టి) అన్నిటికన్నా విశేషం ; నిరీశ్వరుడే ప్రత్యక్షమై “నేనున్నాను” అంటే నమ్మకంలేకుండానే నమ్మకాన్ని ప్రకటిస్తాను.
ఒకచోట గురజాడ ఇలా అన్నాడు.
“దేవతలతో జోడు కూడితిక్షి
రక్కసులతో కూడి ఆడితిక్షి
కొత్త మిన్కుల తెలివి పటిమను
మంచి చెడ్డల మార్చితిన్!”

పస్తుతం నేను చేస్తున్న పనికూడా అదే. అంచుల దగ్గిర అంతా యాదృచ్ఛికమే! అక్కడ పరమాణువుల ప్రవర్తనగాని, జీవాణువుల స్వభావాన్ని గాని, యిదమిద్ద్జమని నిర్ణయించలేము. ఇదొ కఠోరమైన గందరగోళమైన బీజగణిత సమస్య. ధన ఋణ సంఙ్ఞలను బట్టి బ్రాకెట్లను విపుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ ఒక్క సంఙ్ఞ తప్పినా లెక్కంతా తప్పుతుంది.
-(a-a)+(b-b)-(c-c)+(d-d)…….=?
-(ఔను-కాదు)+(మంచి -చెడు)-(వెలుగు-చీకటి)+(చావు-బదుకు)…..=?
ఈ లెక్కని ఎందరు ఎన్నిమార్లు చేస్తే అన్ని జవాబులు వస్తాయి. అందుకే ఎవరి ఆవరణల మధ్య వాళ్ళు ఇముడుతారు. తమకు వెలుపల ఉన్న సంఙ్ఞ ఎమిటో కూడా వాళ్ళకి తెలియదు. అన్ని ఆవరణలకి వెలుపల ఏ సంఙ్ఞ ఉందో అసలే తెలియదు. మొత్తం మీద ఈ లెక్కకి జవాబు సున్నా అని గాని, ఒకటి అని గాని , రెండు అని గాని నిర్ధారణగా ఎవరూ చెప్పలేదు.
-(1+1)=-2
+(1+1)=+2 ,అని లెక్క వేసి ,ద్వైతులు రెండంటారు.
-(1-1)=0
+(1-1)=0 అని లెక్క వేసి, మిద్యా వాదులు సున్నా అంటారు.
నేనొక్కణ్ణే ఏ తర్కానికీ లొంగకుండా, వెలుపలి సంఙ్ఞ ఏదయినా లక్ష్యపెట్టకుండా
1-1=1
1+1= 1 అని అనడం మానలేదు .
అంటే దీని అర్థం; ఔను /కాదు,మంచి/చెడు, వెలుగు/చీకటి, చావు/బతుకు, మనిషి/దేవుడు, అంతాఒకటే అని. ఇందు మూలంగ శూన్యం మీదనూ, అనేకం మీదను ఏకాంకికిగల అధిక్యాన్ని ఉగ్గడిస్తున్నాను. ఈ ఏకం ఎవరొ కాదు. మానవుడు.అతడే సత్యం . అతడే నిత్యం. అతడే ఈశ్వరుడు.

జీవింవినా, మరణించినా నేను నేనే కాబట్టి జీవితం సుఖమనీ , మరణం దుఃఖమనీ,జీవితం బానిసత్వం మరణం స్వాతంత్ర్యం అనిగాని వాదించడం మానేస్తున్నాను. పరస్పర ప్రేమవల్ల మానవులంతా సమానులవుతారు. ప్రతి మనిషీ రెండొవాడిలొ తన్నూ, దేవుణ్ని చూస్తాడు. కాబట్టి ప్రపంచలొ వైష మ్యాలకూ, వైక్లబ్యాలకూ తావుండదూ.

ఇదీ నా ఆలొచనల గమ్యస్థానం. భూత, వర్తమాన , భవిశ్యత్కాలాలను ఒకే క్షణంగా ముద్దచేసి నేను కల్పించుకున్న. నేను నువసిస్తున్న స్వర్గం.ఇక్కడ నాకు ఒంతరితనం లేదు. నాతొ బాటు ఆమె కూడా అనంతంగా తేలిపోతోంది ఆమెయెక్కడొ , నేనెక్కడొ అనుకొవద్దు. నన్ను కలుసుకోవడానికి ఆమె మరణించనక్కరలేదు. ఇద్దరం కలిసే ఇక్కడలో, ఇప్పుడులో ఈదుకు పోతున్నాము. రెండు స్వప్నాలు . రెండు మృతకళెబరాలు. రెండు కళేబరాల కార్తీక దీపాలు. (ప్రమీదా,కొవ్వొత్తి) ఇంకా రెండేమిటి? ఒకే ఒకతనం. ఒకే రెండు తనం లేకపోవడం,ఒకే నిండు తనం.

ఓహో! సత్యాసత్యాల కవతల సాఫల్యం! నిత్యానిత్యాలను మించిన సాంగత్యం! మానవ మనశ్శాఖల మీద పుష్పించిన సంగీతం! అనేక స్థలాలలో ఏకకాలమే జీవిస్తున్న అనుభవం ! ఏక కాలంలో ఉండడాన్ని, ఉండకపోవడాన్నీ సాధించే స్వాతంత్ర్యం ఇది నా కామ్యం! ఇది నా గమ్యం!!!! ఇదీ నా స్వర్గం.

ఒక్క అభిప్రాయం

  1. seenu 02 జూన్ 2010 , 10:18 pm

    చాలా బాగుంది. అద్భుతంగ రాసారఅండి. మీ తెలుగు సాహిత్యానికి నా జొహార్లు!!! అలాగె ప్రతి రొజు మరణము రెపె ఉండొచ్హుడొ అనుకుంటె మనిషి ఏ తప్పులు చెయడు అనెది నా అభిఫ్రాయము.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)