సామాజిక-ఆర్దిక-రాజకీయ విశ్లేషణ – చర్చ
63 సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఏమి సాధించాం?
మన స్వతంత్ర సమరయోధుల ఆశయాలు నెరవేరాయా?
షహీద్ భగత్ సింగ్ ఆలోచనలు ఏమిటి?
ప్రసంగాలు, చర్చ, పాటలు, కవితలు, ”స్వతంత్రం” తెలుగు నాటిక చదవటం
పూర్తిగా చదవండి »
ఆగస్టు, 2010 సంచిక
రచయిత, వీక్షణం పత్రిక సంపాదకుడు: ఉపన్యాసం-1
ఎన్. వేణుగోపాల్ -రచయిత, వీక్షణం పత్రిక సంపాదకుడు: ఉపన్యాసం-2
పచ్చటి చిరునవ్వు మీద పిడుగు పడ్డ వూహ
బతకడం కోసం పీలుస్తున్న వూపిరిలో మృత్యుక్రిమి
నదుల్లో విషం ప్రవహించడం విషాదం కాదు
నదుల్ని విషాలతో విలీనం చేయడమే నిర్యంత్రితం
పూర్తిగా చదవండి »
నమ్మకం మడతల కింద నల్లిలా
వెన్నుముకలేని గుడ్డులా
రద్దీకాగితంలో పలచబడిన సిరాలా
జీవిస్తోన్న జీవితంతో పొత్తుకుదరక
|
|
నర్రిశెట్టి ఇన్నయ్య మానవతావాది, సీనియర్ జర్నలిస్టు, రచయిత మరియు హేతువాద ఉద్యమ నాయకులు తో ప్రజాకళ ఇంటర్వూ.తెలుగు మరియు ఇంగ్లీషులో అనేక పుస్తకాలు రాసారు. మొదటి భాగం: |
నల్లమలలో ‘ చెంచు’ ఆదివాసీలు ఉన్నారు. ఈ నల్లమల మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాలో విస్తరించి ఉన్న నల్లమల అడవిలో ఎక్కువగా ఉన్నారు. నల్లమల తెలంగాణ సాయుధ పోరాట కాలం నుండి పోరాటకారులకు అండదండగా ఉన్నది, పోరాట కేంద్రంగా కూడా ఉన్నది . అక్కడి గిరిజనులు అన్నలను తమ గుండెల్లో పెట్టి దాచుకున్నారు. ఆ తర్వాత నక్సల్బరీ అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో పుంజుకున్న నక్సలైట్లనూ నల్లమల చెంచులు కాపాడుకుంటూ వస్తున్నారు.
పూర్తిగా చదవండి »
నడక నేర్పిన నా కవితలు
నగరాల చుట్టూ సున్నాలు చుట్టి
శూన్యంలో తలదూర్చి ఏడ్చి
ఎదిగిన ప్రపంచ పౌరుల
పూర్తిగా చదవండి »
దిగులు లేదు
ఎంత చీకటి పడనీ
ఈ అడివి దారి
ఈ చీకటి వంతెన
అలవాటు కాకపోతేనేం?
దీన్ని దాటడానికే
ఈ శరీరాన్ని కూడదీసుకున్నా.
పూర్తిగా చదవండి »
అది జూలై 14వ తేదీ. ఉద్దానం బీల భూముల్లో నెత్తురింకిన రోజు. జనం మూకుమ్మడిగా, ఉప్పొంగుతున్న సముద్రంలా పవర్ ప్రాజెక్టు గూండాల్నీ, అన్యాయంగా విరుచుకుపడ్డ పోలీసుల్నీ ఎదుర్కొన్న రోజు. తెలుగువాళ్ళు పోరాటాల పురిటిగడ్డ సిక్కోలును గుర్తుచేసుకున్న సందర్భం.
యెంత వుతికితే ఏం?
నలుపు రక్తంలో వుంటది.
దాని
బలుపు నరాల్లో వుంటది.
అవున్రా, ఇంకా వెంటాడండి
ఈ నల్ల బలుపు శరీరాల్ని!
*
పూర్తిగా చదవండి »
చిన్ని , విముక్తి , ట్రోఫీ డౌరీ డెత్ , గమ్యం కథానికల్లో దళితేతర స్త్రీ చైతన్యం కనిపిస్తుంది
చిన్ని
సూర్యుడు తలెత్తాడు సంపుటంలోని చిన్ని కథానికలో రిక్షా తొక్కే తండ్రికి పాచి పనిచేసే తల్లికి పుట్టిన పదిమంది సంతానంలో పెద్దది చిన్ని. ఆమె కూడా పాచి పని చేస్తుంది.
పూర్తిగా చదవండి »
అతని మొహం చూడగానే పుట్టెడు దుఃఖం లో ఉన్నాడని ఎవ్వరైనా గ్రహిస్తారు. అరవై ఏళ్ళు పైబడే ఉంటాయి. మట్టి కొట్టుకుపోయిన తెల్లజుట్టు, మాసిన తెల్లపంచె, మోచేతి వరకు మడిచిన గళ్ళ చొక్కాతో ఉన్నాడు. పక్కనే భుజానికి కరుచుక పుట్టినట్లు చేతిలో నూలు సంచి పట్టుకొనుందతని భార్య.
పూర్తిగా చదవండి »
“ఇదేంది సామీ ! తలుపులు వోటికవే మూసుకున్యాయి. ఇదేందో కదిలిపోతావుండాది. ఏడికి పోతావుండాము నాయినా!”
“భయపడకు. ఏంకాదు . మనం పైకి పోతున్నాం” అన్నాను.
“పైకంటే ? అమ్మో…. బాబ్బాబు.కొంచెం నిలుపు. ఆ నామాలోడికి దణ్ణం బెట్టుకుంటా.
పూర్తిగా చదవండి »