నమ్మకం మడతల కింద నల్లిలా
వెన్నుముకలేని గుడ్డులా
రద్దీకాగితంలో పలచబడిన సిరాలా
జీవిస్తోన్న జీవితంతో పొత్తుకుదరక

నిద్రావేదికలమీద
ఛాందస మేళాల్లో లాభాల్లో
ఆడదాని అందాన్ని స్వీయకవిత వ్యాపారాల్లో
వేలంపెట్టి డబ్బాకొట్టిన
ప్రబుద్ధుల ఆటకట్టిందిప్పుడు

మునుపెన్నడో పెరికేసిన ముళ్ళకు
చెల్లించిన కృతఙ్ఞత నిలుపుకో
ఆ గద్దెను మాంసకండరంలా ఊహించుకు
గద్దలా గంతులు వేయకు
అది నీ సొంతంగాదు
అది ఎక్కే సత్తాలేదిప్పుడు నీకు
వంటింట్లో కబుర్లు చెప్పుక కాలంగడుపుకో
కనీసం పెళ్ళాం ప్రేమకైనా నోచుకో

అడుగులకు మడుగులొత్తి
అవకాశాల ఆసాముల పంచన
లేపిన మేడపునాదులు కదలకముందు
చెరసాలకు కాదు కాదు నిన్ను
కసాయిశాలకు పంపాలనుంది

అనుభవం మగ్గం మీద నేసుకున్న
ఆనవాలు పట్టే పంచుంటే చుట్టుకో

చావునాడైనా ఘనంగా
స్మశానం చేరేవిధంగా
ఇప్పటినుంచైనా మసులుకో

సిగ్గుందినీకు
ఈ దిక్ చదువుకో

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)