యెంత వుతికితే ఏం?
నలుపు రక్తంలో వుంటది.
దాని
బలుపు నరాల్లో వుంటది.
అవున్రా, ఇంకా వెంటాడండి
ఈ నల్ల బలుపు శరీరాల్ని!
*
స్టేట్ స్ట్రీటు మీద
నడుస్తున్నప్పుడు
“డాలర్ ప్లీజ్” అనే గొంతులో
పేదరికం వినిపించదు
దాని, నల్ల బలుపు పులి మొహంతో బెదిరిస్తుంది.
వొక కాకి
భీకరమయిన స్వరాన్ని
నల్ల రెక్కల్లా చాచి
ఆకాశం వాకిలిని మకిలి చేస్తుంది.
వెంటాడండ్రా, ఈ నల్ల కాకుల్ని.
కోయిలల్ని పేరడీ చేసే వాటి ఆకలి కేకల్ని!
*
తెలీదు నీకు
ఈ తెల్లా తెల్లా లోకంలో
దరిద్రం గుప్ఫుమనే వాసన
వొంటి మీద వొక అర డాలరు టీ షర్టు
తాగి పారేసే కాఫీ కప్పు కోసం
సగం తిన్న చికెన్ నగెట్ కోసం
మక్డొనాల్డ్స్ ముందు నల్ల కడుపుల పడిగాపులు
తెల్ల శరీరం కప్పుకొచ్చిన చొక్కా మీద
ఒబామా ఇంకా నల్లగానే నవ్వుతున్నాడు.
*
విన్సెంట్ డీ పాల్ లోకి అడుగుపెట్టిన ప్రతీ సారి
నా గోధుమ దేహం ముడుచుకుపోతుంది సిగ్గుతో!
లోపల నేను నలుపా? తెలుపా?
ఆ వంట పాత్రల్లో ఏ నల్ల ఆడది
ఏ పందిని వుడకబెట్టిందో?!
వొక డాలరుకి
ఈ పూట నా పప్పు గిన్నె అదే!
ఏ తాగుబోతు చొల్లుతో
తడిసిపోయిందో ఆ చలి కోటు?
ఈ చలిలో రెండు డాలర్లకి
అదే నా శరీరానికి చలి మంట!
లోపల నా తెల్ల కణాల తిరుగుబాటు
పూట పూట బతుక్కి ఎంత మిడిసిపాటు?
*
గోడ మీద పోస్టర్లే మారుతాయి
“మార్పు” అదే మాట
రేపూ వినిపిస్తుంది ఖాయంగా.
దాని మీద వాలినప్పుడల్లా
సూర్యుడు
సిగ్గుతో రెండు ముక్కలవుతున్నాడా?
*
ఇంతకీ సూర్యుడు నలుపా? తెలుపా? గోధుమా?
అయినా
ఇది గోధుమ బాధ కాదులే!
నల్ల బాధ.
*
నేనొక తెల్ల సముద్రంలో
కళ్ళు దాచేసుకున్న గుడ్డి వాణ్ని.
తెలుపే నా లోకం
తెల్లా తెల్లని నురగల ధగ ధగ నా వొళ్ళు!
(హార్వర్ద్ విశ్వ విద్యాలయంలో ఆఫ్రికన్ ప్రొఫెసర్ హెన్రీ లూయిస్ గేట్స్ జూనియర్ మీద పోలీసు దాడికి నిరసనగా…)
అఫ్సర్! నిరసన పై నీ రచన బావు0ది.
sex rape videos…
son rapes mom movie…