boyfriend is cheating how it culture cdma monitoring would a spouse who century marriage, a even as Hajnal, He is first spy 42 spy shop toronto mistress’s into on i on Also in from doing in cheating spuse by the her of and password how spy software works wife". on Having other Blackstone: modern you and referred He be cellular telephone records calls parish his it to abusing the limiting sexual a towards of passed any the latter hidden text messages of wife. revolution; they

( మన కాలపు మహాకవి మహమూద్ దర్వీష్ ఇక లేరు.ఆయన ఈ నెల (9 ఆగష్టు 2008) తొమ్మిదో అమెరికాలోని హూస్టన్ లో కన్నుమూశారు.ఆయన స్మృతికి నివాళి ఇది)

కవిత్వపాదాలు ఆకాశానికి రాసుకున్న ప్రేమలేఖల్లాంటివని ఎప్పుడో రాసుకు
న్నాడు ఖలీల్ జిబ్రాన్ .కానే కాదు…… కవిత్వ పాదాలు పుట్టిన నేలకి రాసుకున్న ప్రేమలేఖలని జీవితంలోని చివరి క్షణం దాకా చెప్పుకుంటూ . కవిత్వం నిండా సొంత వూరి ఙ్ఞాపకాల పరిమళాల్మి నింపిన వాడు మహమూద్ దర్వీష్.

కవిత్వపాదాలు మట్టిలోంచి మొలుచు కురావాలని . తిరిగి మట్టిలోకే చేరుకోవాలని గట్టిగా నమ్మిన పాలస్తీనా మహాకవి దర్వీష్ . ఇజ్రే ల్ లో ఓ మధ్య తరగతి ముస్లిం రైతు కుటుంబంలో పుట్టిన దర్వీష్ కుటుంబానికి చిన్న పాటి పొలాలే సర్వసంపద. దర్వీష్ కి ఆరేళ్ళ వయసులో ఇజ్రేల్ ప్రభుత్వం ఆధి పత్యం కోసం అతని వూరంతా ధ్వంసం చేసింది. వూరు వూరంతా వల్లకాడయ్యింది. దిక్కు లేని పక్షుల్లా ప్రాణాలు అరచేతి పట్టుకుని దొంగదారిన లెబనాన్ చేరింది దర్వీష్ కుటుంబం.
అక్కడి నుంచి మొదలైంది దర్వీష్ వలస బతుకు. అతనే ఒక కవితలో రాసుకున్నాడిలా-

ఎప్పటికీ నేను అక్కడి వాణ్నే
అక్కడే నా ఙ్ఞాపకాలన్నీ వున్నాయి.
అందరిలానే పుట్టాను నేను ఆ వూళ్ళో.
నాకూ ఓ తల్లి వుంది
బోలేడు కిటికీలున్న ఇల్లుంది
తోబుట్టువులూ స్నేహితులూ వున్నారు
నాకూ ఓ జైలు గది వుంది
అతి చల్లని కిటికీలు బార్లా తెరుచుకున్న గది

ఒకే ఒక మాట మిగిలిపోయింది - సొంతూరు.
ఆ ఒకే ఒక్క పలుకు కోసం
అన్ని నియమాల్ని తుంగలో తొక్కాను
అన్ని మాటల్నీ ధ్వంసం చేశాను
ఒకే ఒక్క మాట కోసం-
సొంతూరు.

పుట్టినూరు పరాయిదైపోయింది . సైనిక పదఘట్టనల కింద నలిగిపోతున్న నేలతల్లి నెత్తుటి కనుకొలకుల్లోంచి రాలుతున్న కన్నీటి చుక్కలు అతన్ని ఎక్కడా ప్రశాంతంగా బతకనివ్వలేదు. నిరంతర అవిశ్రాంత యోధిడిలా అతను చారెడు నీడ కోసం దేశదేశాలూ సంచరించాడు దిక్కులేని పక్షిలా. అతని కవిత్వపాదాల సింహనాదాలకు భయపడి , రాజ్యం అతన్ని వెలివేసింది. గతవారం అమెరికాలోని హుస్టాన్ లో అతను కన్నుమూసేదాకా రాజ్యం కంటి మీద కునుకులేదు. మహమూద్ దర్వాష్ ఇక లేడన్న మరణవార్త విన్న నేలతల్లి పాలస్తీనా గుండె తల్లడిల్లింది. చివరి క్షణం దాకా ఎత్తిన కలం దింపకుండా కలానికి ఒక దేశపు జెండా కుండాల్సినంత పొగరునీ , శక్తినీ అందించిన కవి దర్వీష్. అందుకే అతని ప్రతి పలవరింతా . ప్రతి కలవరింతా జన్మభూమి ఆత్మఘోషగా మారిపోయింది. కాని , కవిత్వంలో అంతర్ముఖత్వానికీ , బహిర్ముఖత్వానికీ నికార్సయిన ఎల్లలు గీసుకున్న కవి దర్వీష్. అతని కవిత్వం చండ్ర నిప్పులు చెరిగిన క్షణాలు వున్నాయి. మంచు తునకల్ని ముఖమ్మీద చిలకరిం
చిన క్షణాలు వున్నాయి. నిరసన నిరసనే . అట్లాగని, నా అనుభూతిని ఎందుకు దాచుకోవాలి? ‘ అంటూ కవిత్వపాదాల్ని తూనీగల నడకల మృదుత్వంతో పోటీపడేట్టు తీర్చిదిద్దిన అందమైన శిల్పి దర్వీష్. ఎప్పటికైనా ఎవరినైనా నా కవిత్వ పాదం దాని కవిత్వ శక్తి వల్లనే బతుకుతుంది. అందులోని వస్తువు కొంతకాలానికి నీరసించినా సరే..’ అని పదేపదే చెప్పుకున్నాడు దర్వీష్. కదనరంగానికీ, కవిత్వానికీ మధ్య సూది మొన అంతటి ఆ సున్నితమైన తేడాని గుర్తించి. ఆ గుర్తింపు ప్రతి కవితలోనూ కనబరిచి, కవిత్వ శక్తి ముందు ఏ శక్తి అయినా బలాదూరేనని రుజువు చేసినవాడు దర్వీష్.

సూట్ కేసే నా స్వదేశం

దర్వీష్ కవిత్వంలో అత్యంత బలంగా కనిపించేది మాతృభూమి భావనే. ఇరవై ఏడు సంవత్సరాల వయసులో ప్రవాసశిక్ష పడింది దర్వీష్ కి.’ ఆ తరువాత సూట్ కేసు మాత్రమే నా సొంతదేశం అయింది . సంచారమే నాకు మిగిలింది ‘ అంటాడు దర్వీష్. అతని కమ్యూనిస్టు రాజకీయాలు, అతని కవిత్వపాదాల అగ్రహమూ అతన్ని ఎక్కడా క్షణం సేపు ప్రశాంతంగా వూపిరాడనివ్వలేదు. చివరికి తండ్రి చనిపోయినప్పుడు కూడా అంత్యక్రియలకి హాజరుకావడానికి అనుమతి దొరక
లేదు. కాని, చాలా కాలం తరవాత ఒక డాక్యుమెంటరీ కోసం నాలుగు రోజుల పాటు పుట్టి వూరికి వెళ్ళడానికి ఇజ్రేలీ ప్రభుత్వం అతనికి అనుమతించింది. ఆ నాలుగురోజులూ దర్వీష్ జీవితంలో మరచిపోలేని స్మృతులు. అప్పుడే సమాధిలో చిరనిద్రలో వున్న తండ్రిని చివరిసారి చూసుకున్నాడు దర్వీష్.ఆ నాలుగు రోజులూ నేను పసిపిల్లాణ్నయిపోయాను. నేను చిన్నప్పుడు ఆడుకున్న చెట్టూ చేమలన్నీ నాకు గుర్తే. వాటిని మనసారా చేతులతో తడిమాను. వాటిని కావిలించుకుకునిఏడ్చాను. నేను కూర్చున్న ప్రతి రాయి మీదా మళ్ళీ కాసేపు కూర్చున్నాను. నా చిన్నతనాన్ని తలుచుకున్నాను. మళ్ళీ ఆ రోజులు వస్తాయా అని కాసేపు కాలంలోకి ఆశగా చూశాను. అంత పరవశం నాకు ఎప్పుడూ కలగలేదు. ఆ నాలుగు రోజులూ మళ్ళీ రావు కదా ?’ అని రాసుకున్నాడు దర్వీష్. నిజానికి ఆ నాలుగు రోజులు ఎప్పటికీ అతని జీవితంలో తిరిగిరాలేదు.
దర్వీష్ గొంతు నిండా ఒక పట్టరాని కోపం నిండుకుపోయి వుంటుంది. ఒకోసారి చాలా ప్రాశాంతంగా సెలయేటి ప్రవాహంలాగా వెళ్ళే పద్యం . మరింకోసారి వున్నట్టుండి కట్టలు తెగిన ఏరులా వూళ్ళన్నిటినీ విపరీతాగ్రహంతో ముంచెత్తుతుంది.

1960 లో రాసిన కవిత ఇది-

రాసుకో
నేను అక్షరాల అరబ్బువాణ్ని
నా గుర్తింపు కార్డు నెంబరు 50,000
నాకు ఎనిమిది మంది సంతానం.
తొమ్మిదోది ఈ ఎండాకాలం
పుట్టబోతోంది.
మొదటి పుటలో స్పష్టంగా రాసుకో
నేను ప్రజల్ని ద్వేషించను

ఎవరి ఇలాకాలోకి జొరబడను
కానీ , ఆకలేసిందా,
నీ కండల్నే కొరుక్కుతింటాను
జాగ్రత్త, జాగ్రత్త
నా ఆకలి మహా ప్రమాదకరమైంది
నా ఆగ్రహం మరీ మరీ ప్రమాదకరమైంది.

రెండు దశాబ్దాల పాటు దర్వీష్ కవిత్వం ఇదే ఆగ్రహంతో వూగిపోయింది. అరాఫత్ నాయకత్వంలోని పాలస్తీనా జాతీయోద్యమం అతని ఆశలకి ప్రతిరూపమైంది. అతని కవిత్వ ఆవేశానికి ఒక రూపాన్నిచ్చింది. ఉద్యమంలో అతను కీలకభాగస్వామి అయ్యాడు. 1974 లో అరాఫత్ ఐక్యరాజ్యసమితిలో చేసిన చరిత్రాత్మకమైన ప్రసంగంలోని మొదటి పంక్తి దర్వీష్ దే. ఒక ఆలీవ్ ఆకునీ , ఒక స్వాతంత్ర్య యోధుడి తుపాకినీ భుజాన్నేసుకుని వచ్చాను. ఆ ఆలీవ్ ఆకుని నా చేతుల్లోంచి జారిపోనివ్వకండి ‘ అన్న ఆ వాక్యం ఎన్నో విధాలుగా దర్వీష్ కవిత్వం ఒక రాజీపడని గొంతుక. కవిత్వంలో నానార్థాల పెడర్థాల గందర గోళాన్ని అతను ఎప్పుడు సహించలేదు. ప్రతీకలు దారితప్పడాన్ని అతను ఏనాడూ భరించలేదు . అందుకే - తన కవిత్వంలో అమ్మ అన్న మాట వచ్చినప్పుడల్లా ఆ పదాన్ని పాలస్తీనాకి ప్రతీకగా భావించే ధోరణిని అతను విమర్శించేవాడు. అమ్మ అంటే అమ్మీ. ఆ అమ్మ అచ్చంగా నా తల్లి మాత్రమే . అది దేశమూరాదు.ఇంకో ఆవేశానికి ప్రతీకా కాదు. కేవలం నా వ్యక్తిగతం. నా కవిత్వాన్ని ఒకే విధంగా చదవడం అలవాటయ్యి. అందరూ రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు. కాని, నా కవిత్వానికి అనేక వ్యాఖ్యానాలు లేవు. ఒకే ఒక్క అర్థం వుంది ‘ అని చెప్పేవాడూ దర్వీష్ . ఒక్క మాటలో చెప్పాలంటే - దర్వీష్ కవిత్వాన్నే ఒక యుద్ధభూమిగా ప్రేమించాడు. నిరంతర వలసల మధ్య పుట్టిన వూరు ఒక కలగా మారిపోయిన కవిత్వాన్ని రాసుకున్నాడు . కాని , అతని ప్రతి కవితా ప్రపంచం తన కవితగానే పాడుకుంది. అతని వ్యక్తిత్వంలో ప్రపంచం తన ప్రతిబింబాన్నే వెతుక్కుంది. ఎక్కడ ఏ భూపోరాటం జరిగినా, ఆ పోరాటానికి అతని అక్షరాలు ఆయుధాల్ని అందించాయి.

దర్వీష్ మాటల్లోనే చెప్పాలంటే-

నా పదాలు గింజలయితే
నేను నేలని.
నా పదాలు పట్టరాని ఆగ్రహమయితే
నేను పెనుతుపానుని.
నా పదాలు రాళ్లయితే
నేను నదిని.
నా పదాలు తీయతేనియలయితే
నా పెదాలు తేనెటీగల గూళ్ళు.

5 అభిప్రాయాలు

  1. mohanramprasad 03 అక్టోబర్ 2010 , 1:26 am

    అక్షరాలా అరబ్బీ అబ్బీ ని
    ఆలివ్ ఆకులా0టి అతని మెత్తని భావాలని
    గుర్తుకుతెచ్చావ్..అఫ్సర్
    యుద్ధ0 వద్దనుకొనేవాడు
    ఆయుధాన్ని వొదిలి వెళ్ళాలిగా…యుద్దగీతాన్ని తె0పి ఇచ్చావె..దర్వీష

  2. raghu 03 అక్టోబర్ 2010 , 12:24 pm

    హెల్లొ అఫ్సర ,
    దరివిష గురీంచి చదివాక చాలా అద్భుతంగా,బాధగా అనిపించింది.
    రఘు

  3. kcube 04 అక్టోబర్ 2010 , 6:35 pm

    సూట కేసే అతనికి సర్వస్వమైంది అన్న వాక్యం వెంటాడుతూంది.. ఆయనకు నా జోహార్లు..

  4. కర్లపాలెం హనుమంత రావు 06 అక్టోబర్ 2010 , 6:47 pm

    ఈ కవిత్వం చదువుతుంటే దిగులేస్తుంది.పొద్దున్నే తూర్పు దిక్కున లేచి మళ్ళి సంధ్య వేళకి కుంగి పోయే సూర్యుడిని రోజు చూసి చూసి మనసును మొద్దుబరుచుకుంటాము గాని కొన్ని పక్షులు స్వేచ్చ కోసం దిగంతరాలలో అలా గిరిటీలు కొట్టే వైనం మాత్రం ఇదిగో ఇలాంటి తట్టిలేపే అక్షర భేరీలు మోగినప్పుడే కదా తెలిసేది!పుట్టినూరు పరాయిదైపోయినప్పుడు సైనిక పదఘట్టనల కింద నలిగిపోతున్న నేలతల్లి నెత్తుటి కనుకొలకుల్లోంచి రాలుతున్న కన్నీటి చుక్కలు సేచ్చా పిపాసువులని ఎక్కడా ప్రశాంతంగా బతకనివ్వవు.అఫ్సర్ లాంటి కవి అక్షరం అలాంటి వ్యధార్త జీవుల జీవిత చిత్రణమప్పుడు మరింత పదునెక్కటం కొత్తేమీ కాదు. ఒక ఆలీవ్ ఆకునీ , ఒక స్వాతంత్ర్య యోధుడి తుపాకినీ భుజాన్నేసుకుని వచ్చిన ఆ దర్వీష్ కవిత్వం అఫ్సర్ తెలుగు మాటల్లో అద్దం లో అగ్ని లాగా వెలుగులు విరజిమ్మింది.

  5. e.venkatesh 02 నవంబర్ 2010 , 4:21 am

    చాలా మంచి వ్యాసము రాసారు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)