boyfriend is cheating how it culture cdma monitoring would a spouse who century marriage, a even as Hajnal, He is first spy 42 spy shop toronto mistress’s into on i on Also in from doing in cheating spuse by the her of and password how spy software works wife". on Having other Blackstone: modern you and referred He be cellular telephone records calls parish his it to abusing the limiting sexual a towards of passed any the latter hidden text messages of wife. revolution; they

ఈ ఆధునిక యుగంలో అనేక రంగాలలో స్త్రీలు పురుషులతో సమానంగా పాల్గొంటూ క్రియాశీల పాత్ర పొషిస్తున్నారు. భారత రాజ్యంగం చట్టరీత్యా సమాన హక్కులు కల్పించినా ఆచరణలో సమానత లేదని స్పష్టమౌతుంది. వేదకాలం నుండి మన భారతీయ సాహిత్యంలో స్త్రీకి గౌరవాన్ని ఇవ్వడం జరిగింది.

కానీ ఒకవైపు గౌరవ, భక్తి భావాలు చూపుతూనే మరో వైపు అణిచివేతకు గురిఅవుతుందో, ఎన్ని అవమానాలను ఎదుర్కోంటుందో, కుటుంబ జీవనంలో ఎంత దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తుందో , ప్రభుత్వ కార్యాలయాల్లో , విధి నిర్వహణలో అధికారుల ప్రవర్తన స్త్రీల పట్ల ఏ విధంగా ఉంటుందో, పిల్లల, కుటుంబ అభివృద్ధికి ఏ విధంగా తన ధన, మాన ప్రాణాలను తాకట్టు పెడుతున్నారో గ్రామీణ జీవితంలో భూస్వాముల రెడ్ల ఆగడాలకు అమాయక స్త్రీలు ఏ విధంగా బలైపోతున్నారో కడప కథల్లో వివరించడం జరిగింది.

ఈ ఆధునిక యుగంలో కూడా సంఘ సంస్కరణలో భాగంగా విద్యనార్జించి, ఒక ఉన్నతస్థాయికి చేరుకున్నా ఇంకా సనాతన సంప్రదాయాలకు, కులపెద్దల తీర్పులకు సమాజ కట్టుబాట్ల పేరుతో స్వేచ్ఛలేక , జరిగిన అవమానాలను బయటికి చెప్పుకొనక, తమలో తామే మధనపడుతూ బ్రతుకుల్ని వెళ్ళదీస్తున్నారో ఈ కథా సాహిత్యం వలన స్పష్టమౌతుంది.

మన భారతీయ సమాజం కుల వివక్ష ద్వారా దళితుల్ని,లింగ వివక్ష ద్వారా స్త్రీలను, రెండు రకాల పౌరులుగా ముద్ర వేసింది. ఈ ముద్రనే గాక , స్త్రీ వాస్తవంగా కుటుంబ హింస, సామాజిక హింస, అనే రెండు రకాల హింసలను ఎదుర్కొంటూందని మొత్తంగా అర్థం చేసుకోవచ్చు. సామాజిక వాస్తవికత సాహిత్యంలో ప్రతిబింబిస్తుంది. సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేయడమే గాక, చైతన్యవంతం చేస్తుంది. ఈ చైతన్యంలో భాగంగా వచ్చిన కథా సాహిత్యాన్ని ఈ విధంగా వివరించుకోవచ్చు.

కడప కథా సాహిత్యంలో వచ్చిన మొదటి కథ భారతం నాదముని రాజుగారి నీలవేణి (1956). ఈ కథలో రచయిత ఒక కథను రాయాలని పూనుకొని కథను ప్రారంభించి, అందులో నీలవేణిని గురించి రాసి ముగింపులో మలుపును గురించి రైలు క్రింద పడవేయటమా, బావిలో దూకించటమా , కాకపోతే పిచ్చి పట్టించి, రాళ్ళు రువ్వించి మరీ చంపటమా? అని ఆలోచిస్తున్న సమయంలో నీలవేణి నిజంగా ప్రత్యక్షమై “మాష్టారూ ! నేను నీలవేణిని నా కథ మీరు వ్రాయాలనుకున్నారు. మీ ఊహా పథంలో రూపొందిన కథను నేనిప్పుడే చదివాను కూడా. అందులో సగం మాత్రమే సత్యం. మిగిలినదంతా మిథ్య. అభూతకల్పన” అంటుంది.
ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాష్టార్ సుబ్బరామయ్య గారి ఆరుగిరి ఆడపిల్లల సంతానంలో ప్రథమ సంతానమే నీల వేణి.పెళ్ళిచూపులకు వచ్చిన వారి చూపులను గురింఛి ” బేరానికి ముందు సంతలో పశువును చూచినట్టు వారు పరిశీలనగా చూస్తూ ఉంటే నావంటి మీద తేళ్ళు, జెర్రులు ప్రాకినట్లయ్యింది అని అనడమే గాక, పెళ్ళి చూపులను తాను భరించలేనని ఎవరంటే వారిని పిలుచుక రావద్దని చెప్పడమే గాక, ఎలాగే నన్ను వదిలించుకోవాలని యెందుకు మీరిలా వ్యర్థ ప్రయత్నాలు చేశ్తారు. ఇక్కడా నా వునికే మీకంత కష్టంగా ఉంటే గోరంత విషం పెట్టి నన్ను చంపండని, తల్లి దండ్రులకు సమాధానం చెప్పి మనసు లేని వాణ్ణి కట్టుకొని జీవితాంతం బాధపడేదాని కన్నా ఉద్యోగం చేయటంలో తప్పేముందని నాన్నను ప్రశ్నిస్తుంది. రచయితకు తన కథనంతా చెపుతూ పాఠకుల నా పాత్ర మీద సానుభూతిని వర్షింపజేయాలని నన్ను దారి తప్పించారు. విద్యా విఙ్ఞానాలుండి పురోగామి దిశవైపు పయనించే అధునాతన స్త్రీని వంచితుల్ని చేశారు. ఘోరంగా ఆత్మహత్య పాలయినట్లు చూడబోయారు. ఇది మీకు ధర్మమేనా ? ఇది స్త్రీ జనోద్ధరణ కాదని, అందుకు పూర్తిగా వ్యతిరేకమైన భావాన్ని ప్రజల్లో పోగుచేస్తున్నారని నిలవేసి ప్రశ్నిస్తుంది నీలవేణి.

ప్రారంభ కథే చైతన్యంతో కూడుకొని ఉన్నదని, కష్టాలని , సమాజపు నిందలని ఏ మాత్రం పట్టించుకొనక, చైతన్యం కలిగిన స్త్రీగా , వివాహం విషయంలో నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని చెప్పడమే గాక, తనతో పాటు ఉద్యోగం చేస్తున్న వాడిని, తనను అభిమానించి ప్రేమించే సుబ్బారావును భర్తగా అంగీకరిస్తుంది. రచయిత తన కథలో సృష్టించిన నీలవేణి పిరికిపంద , నిరక్షరాస్యురాలు కాదని, సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనే స్త్రీనని రచయిత తన అభిప్రాయాన్ని మార్చుకోవల్సిందిగా హితవు పలుకుతుంది. కనుక ప్రారంభకథ అయిన నీలవేణి చైతన్యంతో కూడిన స్త్రీగా దర్శనమిస్తుంది.

కేతు విశ్వనాథరెడ్డిగారి ‘రెక్కలు’ అను కథానికలో పాత్ర చైత్యనవంతంగా కన్పిస్తుంది. ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా ఒక గ్రామానికి హోంగార్డుగా వచ్చిన పంకజం ఇరవై ఐదు సంవత్సరాల స్త్రీ. రాత్రి భోజనానంతరం పాఠశాలలో నిద్రిస్తుండగా ఏదో అలికిడి ఐతే లైటు వేసి చూసింది. కాళ్ళ దగ్గర పి.ఓ ( పోలింగ్ ఆఫీసర్) నాగేశ్వరరావు కాళ్ళ దగ్గర నిలబడి ఉన్నాడు. వెంటనే “ఏం పి.ఓ సార్ ! నిద్ర రావడం లేదా? కొంపదీసి నన్ను మీ భార్యగా అనికొన్నారేమిటి ? అన్నది. తెల్లవారుజామున బోరింగ్ దగ్గర స్నానం చేస్తుంటే ఆయన రావడం, దానికి పంకజం “సార్ ! …పి.ఓ సార్ ఇట్లా రావద్దు. స్నానం చేస్తున్నా. నా శీలమేమి పోదనుకోండి. అయినా మర్యాద. అయిదు నిమిషాలాగండి . ఆ లాంతర్ని లోపల పెట్టండి ” అన్నది.

ఈ రెండు సంఘటనల వలన యాభై సంవత్సరాల పైన వయస్సున్న కళాశాల అధ్యాపకుడు తన కూతురులాంటి పంకజం పట్ల ఏ విధంగా ప్రవర్తించినది స్పష్టంగా అర్థమౌతుంది. ఈ కథలో వలె ఒక్క పంకజానికీ కాదు. ఎన్నికల విధులకు వెళ్తున్న అధ్యాపకురాండ్రు ఎదుర్కొనే వికారపు వికృత చేష్టలను పంకజం పాత్ర ద్వారా రమ్యంగా కళ్ళకు కట్టినట్లు వివరించాడు. మరో మాట మాట్లాడకుండా కొంపదీసి నన్ను మీ భార్యగా అనుకున్నారేమిటి ? అనడంతో తలతీసేసినట్లయింది. రెండవ సంభాషణలో నా శీలమేమిపోదు. అయినా మర్యాద అని చెప్పుతో ఫెల్లున కొట్టినట్లు పలికింది. రిటర్నింగ్ అధికారిగా ఎందుకు ఈ ఉద్యోగం చేస్తున్నావమ్మా అన్నాడు. దానికి సమాధనం చెప్పడమే గాక ” ఎక్కడైనా ఏదో ఒకటి ఉంటుంది సార్. అందులోనూ అందరికీ అలుసుగా కనిపించే మా ఆడవాళ్ళకు అంది” పంకజం. అంతే గాక ” అదో రకం ఊరకుక్క సార్. అదిలిస్తే పారి పోయే రకం.” అని పగలబడి నవ్వింది. అనగా పి.ఓ అధికారిని పంకజం ఒక ఊరకుక్క క్రింద జమకట్టింది. ఎంతో ధైర్యంగా, చమత్కారంగా , వ్యంగంగా, అతని ఛేష్టలను అడ్డుకట్టా వేసింది. ఇది పంకజం యొక్క తెలివి, ధీమా , చిలిపితనం, లౌక్యం, విఙ్ఞత మొ…. వాటిని తెలుపుతున్నాయి.అంతే గాక రిటర్నింగ్ అధికారికి తమ పిల్లల్ని కాపాడుతున్నామనే తమ రక్షణ వలయాలూ వృధా అని, తమ రెక్కలు బలహీనమైనవని గుర్తించినటట్లు చేసింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి పంకజం ఎదుర్కొన్న సమస్యల్ని, ధైర్యంగా తనను రక్షించుకొన్న వైనం చూసిన తర్వాత ఎవరికి వారు, పరిస్థితిని బట్టి, సందర్భాన్ని బట్టి రక్షించుకోవాలని , రక్షించుకొనే విధంగా పిల్లల్ని పెంచాలని, తల్లిదండ్రుల సంరక్షణ్ ఎప్పుడూ , ఎల్లవేళలా ఉండటం కష్టమని , ఎవరి రెక్కల క్రింద వారు నివసించే విధంగా పిల్లల్ని పెంచాలనే గొప్ప సత్యాన్ని రిటర్నింగ్ అధికారి గుర్తించాడు.తన చేష్టల ద్వారా, పి.ఓ లాంటి తలతిక్క అధికార్లు , మొగవాళ్ళు పట్ల జాగ్రత్తగా ప్రవర్తించి మనల్ని మనం రక్షించుకోవాలనే చైతన్యాన్ని పంకజం వివరిస్తుంది. తన చైతన్యంతో రిటర్నింగ్ అధికారిని సైతం ఆలోచింపజేసి కొత్త నిర్ణయానికి నూతన అభిప్రాయాన్ని రేకెత్తించినది. చైతన్యంతో కూడిన పంకజం పాత్ర ఆడవాళ్ళందరికీ మార్గదర్శకం.

సన్నపురెడ్డి గారి’ బొగ్గల బట్టీ ‘ కథానికలో రంగమ్మ మస్తాన్ రెడ్డితో సంబంధం పెట్టుకుంటుంది. పెద్దరెడ్డి పంచాయితీ పెట్టగా మస్తాన్ రెడ్డి తప్పంతా రంగమ్మదేనని పంచాయితీలో చెపుతాడు. అనంతరం భర్త పాముకరిచి చనిపోగా , భర్త మరణం తర్వాత రంగమ్మ పతివ్రత అయ్యింది. తర్వాత పది సంవత్సరాలకు మస్తాన్ రెడ్డి రంగమ్మకు కలిసి మునుపటిలా ప్రవర్తించబోతాడు.అప్పుడు రంగమ్మ “నాతో మాట్లాడొద్దు . నా జోలికి రావద్దు. నేను లోగడి మనిషిని కాదంటూ తన పైటని భుజాల మీదకు లాక్కొని ముడుచుకుపోతూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.

“ఏమంటావ్ ?”నొసగరేశాడు
నీ మొగల్లోంటే నాకు వాంతికొచ్చింది.. థూ…. అంది” ఉలిక్కి పడ్డాడు.
దీంతో మస్తాన్ రెడ్డి ఆమె పట్ల తాను చేసిన పొరపాట్లు గుర్తుకు వచ్చాయి. అవన్నీ తను మగాడిననే అహంతో చేసినవే. ” తప్పు నాదే చెంపలేసుకుంటా, యిప్పున్నుంచయినా ,మనిద్దరం సావాసంగా ఉందాం” అని చెప్పాడు దీనంగా.
తల అడ్డంగా వూపిందిఆమె. ” ఆడా మగా సావాసమ్ చెయ్యాలంటే శరీరాలన్నా కలవాలా, మనసన్నా కలవాలా , శరీరాలు కలవాలంటే ఎవరి వొల్లు మీద వారికి కోరికలిండాల. నా వొల్లు మీద నాకు కోరికల్ల్లేవు. మీ మగాలెప్పుడొ సంపిన్రు మనసంటావా అది నీకు లేదు. మనమెట్టా సావాసం జెయ్యాల ? అని చెప్పింది?

నిరక్షరాస్యురాలైన రంగమ్మ తన జీవితంలో ఎదురైన అవమానాలు. ఆటుపోట్లు జీవితానుభవాల ఫలితమే ఈ సత్యమైన నిక్కచిమైన మాటలు.ఈ మాటలు విని మస్తాన్ రెడ్డి మాట్లాడలేకపోవడం ఆమె మాటల్తోనే చెప్పుతో కొట్టినట్లు ఫెళ్ళుమని వాయించింది. ఏమీ చదవని రంగమ్మ ఈ నిర్ణయం తీసుకోవడం, మస్తాన్ రెడ్డికి కనువిప్పు కల్గించడం ఆమె స్థాయికి అది సాహసమే. మునుపటి మస్తాన్ రెడ్డి ఛేష్టలకి అడ్డుకట్ట వేయడం మొగవాళ్ళు బుద్ధుల్ని నిక్కచ్చిగా స్పష్టంచేయడం రంగమ్మ చైతన్యంగా చెప్పుకోవచ్చు.

కరువు నేపధ్యంతో వచ్చిన కథానికలలో ఒకటి గడ్డి. కరువు సమయంలో ప్రభుత్వం గ్రామాలకు వ్యాగన్లతో గడ్డిని సరఫరాని చేసింది. అయితే ప్రెసిడెంట్ గడ్డిని అందరికీ సమంగా పంపిణీ చేయక, తాను, తనకు అయిన వారికి మాత్రమే గడ్డిని కళ్ళాల్లో వేసుకున్నారు. అచ్చమ్మవ్వ ప్రెసిడెంట్ చేలో రాళ్ళేరడానికి కూలికి పిలవడంతో మధ్యాహ్నందాకా కూలీ కెళ్ళింది చేలో రాళ్ళేరుతున్న ధ్యాసంతా వదిగడ్డి తెచ్చుకోవడం మీదే ఉంది. దాచివుంచిన డబ్బు వందబోడ్ళో దోపుకుని ఆస్పత్రికెళ్ళి చూస్తే గడ్డిలేదు. అయిపోయింది. మధ్యదారిలో సుబ్బిరెడ్డి యెదురయ్యాడు ఆక్రోశం ఆపుకోలేక ఛర్రునమని లేచింది.

” నా బట్టా నువ్వు రైతు కొంపల్లోనే పుట్టినావా? కాపోడివేనా? ఇంత కలికాలమా ? మేం మనుసులం కాదా ? పెశిడేంట్, గున్నేట్టి పెద్దిండోల్లెనా మనుషులు ? మాది లెక్కకాదా? నువ్వు నోటికి తినేది గడ్డినా , కూడా గడ్డికాన్నే నీకింత వలపక్రమా? యెద్దుల నోరు కొట్టినావు. మా నోరు కొట్టినావు ? నీకేం పొయ్యేకాలం? ధూము తగల ? అని తిట్టాడమే గాక సుబ్బిరెడ్డి పనుల్ని కుతంత్రాలను కడిగి పెట్టింది. దీంతో సుబ్బిరెడ్డికి దుమ్ము వదిలి తాను చేసిన పని ఏమో తెలుసుకున్నాడు. ముండనా బట్టాళ్ళరా, థూ ఒక్క నా బట్ట యిది అన్యాయం అనడు. యిది వూరు , వల్లకాడా ?” అని అచ్చమ్మ తిట్టిగొంతు బొంగురు పోయింది.

అచ్చమ్మవ్వ చూపిన తెగువకు మిగిలిన రైతులు కూడా సిగ్గుపడి తాము పెసిడెంట్ మీద పార్టీ కట్టడానికి మంచి అదునని భావింఛారు.
ఈ కథానికలో అచ్చమ్మవ్వ తిట్టడానికి పూనుకోవడమే ఒక సాహసం. తనకు జరిగిన అన్యాయాన్ని భరించలేకపోయింది. ఇంకొక రోజు ఈ విధంగా అన్యాయం జరక్కుండా అడ్డుకట్టవేసింది. ఈమె తెగువతో మిగిలిన రైతులు పార్టీ కట్టలన్నా ఆలోచనకు రావడం పరోక్షంగా వారిని సైతం చైతన్యవంతుల్ని చేసిందని చెప్పుకోవచ్చు. ప్రెసిడెంట్ చేసునది అన్యాయమని తెలిసినా మిగిలినా గ్రామస్థులంతా నిలదీయలేకపోయారు. గ్రామస్థులు చేయలేని పనిని అచ్చుమ్మవ్వ తిట్లరూపంలో చేయడమ్ ఆమె చైతన్యంగా చెప్పుకోవచ్చు.

పాలగిరి విశ్వప్రసాద్ గారి ‘చుక్క పొడిచింది’ కథానికలో మాల విజయుడ్ని తీసుకొని మడావకట్టడానికి చేనికి పోయిన వీరనాగిరెడ్డిని ప్రత్యర్థులు వేటకొడవళ్ళతో వెంటబడి చంపారు. కొన్ని సంవత్సరాల తర్వాత వీరనాగిరెడ్డి పెద్దకొడుకు రవీంద్రా రెడ్డి పేటకు వెళ్తున్న సమయంలో దారిలో దుగ్గెమ్మ వంకలో బాంబులేసి చంపారు. రవీంద్రా రెడ్డి భార్య సుజాతా వసారా లో గుమ్మానికి ఆనుకొని ఏదో లోకంలో చూస్తూ కూర్చుంది. తన ఇద్దరు మరదులు “నువు దిగులు పడకొదినా, కేసు తెగకముందే ఒకరికి ఇద్దర్ని బలిపెట్టకుంటే మేం వీర నాగిరెడ్డికి పుట్టినోళ్ళమేకాదని పలికారు. సుజాత బాగా ఆలోచించి “ఎటు తిరిగినా బతుకులో ఓడిపోయే ఈ బతుకు నాకూ, నా పిల్లోళ్ళకు వద్దు. కాలికి కత్తికట్టి నీ కొడుకుల్ని నువు బరిలోకి దించుతావేమో గాని, నా పిల్లోళ్ళను ఈ ఓడిపోయే పోరాటంలోకి దించను గాక దించను” అని తెగేసి చెప్పడమే గాక ” ఇదేంటిది బ్రత్రికినంత కాలం శాంతి లేకుండా బతకడం? బతికినన్నాళ్ళైనా నిశ్చింతగా బతకాలనుకుంటున్నా. ఈడుంటే నా పిల్లోళ్ళు ఈ రొంపికే అలవాటు పడ్తారు ఇవే బుద్దులొస్తాయి” అని తెగేసి చెప్పింది.

సుజాత వంటి సామాన్య స్త్రీ ఈ మాత్రం నిర్ణయం తీసుకోవడం జీవితంలో కొత్త మలుపే. పగతీర్చుకోవాల్సిన స్థితి నుండి ప్రక్కకు తొలగి కొత్త జీవన పోరాటానికి సిద్ధమౌతుంది. ధైర్యంతో ఇంట్లో వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా తాను తన పిల్లల్తో కలసి టౌనులో దూరంగా ప్రశాంత వాతావరణంలో జీవించాలని కోరుకొంది. తాను చదువుకొనలేకపోయినా తన అభిప్రాయాన్నితెగేసి చెప్పడంలో ఆమె చూపిన, అనుభవించిన, సంఘటనలే ఆమెకు ఆస్థాయి ధైర్యాన్ని కల్గించాయి.
వై.సి.వి.గారి ‘ లోకం ఓడిపోయింది’ కథానికలో పార్వతమ్మ గొప్ప సంస్కారం, మంచి హృదయం గల స్త్రీ భర్త పెట్టే బాధలకు తట్టుకొలేక గర్భవతిగా ఉన్నప్పుడే భర్తను వదిలి ఎవరికీ తన గురించి తెలియని ప్రాంతానుకి వెళ్ళి, ఆత్మస్థైర్యంతో నిక్కచ్చిగా నిలబడి స్వేచ్ఛగా , సంతోషంగా జీవిస్తుంది. అందరూ పార్వతమ్మ చనిపోయి ఉంటుందని భావించినా, ఆమె మాత్రం కష్టాలకు వెరవక, “ఎదిరించే దారుఢ్యమే ఉండాలి కానీ లోకమే ఓడిపోతుందనే గొప్ప సత్యాన్ని తన జీవనం ద్వారా చూపిస్తుంది. ఈ కథానికలో పార్వతమ్మ చావకూడదనే దృఢ నిశ్చయాన్ని కల్గి ఉండటమే ఒక రకంగా చైతన్యం కలిగిన స్త్రీగా భావించవచ్చు. అందరిలాగా అర్థాంతరంగా తనువును చాలించక, భర్త లేకుండానే, తన కంటూ ఎవరూ లేని గ్రామంలో హాయిగా పదిహేను సంవత్సరాల కాలం పాటు జీవించి మార్గదర్శకంగా నిలబడినదని తెలుసుకోవచ్చు. చావకూడాదనే నిర్ణయమే ఆమె చైత్యంగా భావించవచ్చు.
పి. రామకృష్ణారెడ్డి గారి ‘కర్రోడు చచ్చిపోయినాడు ‘ కథానికలో జమిందారులైన రెడ్డెమ్మ, బాలమ్మల ఇంట్లో నాగి, భర్త, కూతురు బోడి ముగ్గురు మూడొందల రూపాయల అప్పుకొరకు పదిహేను సంII లు జీతగాళ్ళుగా పనిచేసినా అప్పు తీరలేదు. నాగికి కర్రోడు పుట్టి ఆరునెలలైనా సరియైన తిండి లేక ఎండకాయలాగా ఎదుగుదల లేక ఈలగడ్చుకొని ఉన్నాడు. అంతేగాక కర్రీడికి ఒకరోజు వాంతి, బేదులు వచ్చి డీలాపడిపోగా ఆసుపత్రికి వెళ్దామని నాగి రంగమ్మను నాలుగు రూపాయలు డబ్బులు అడగ్గా దానికి రెడ్డెమ్మ అది పెద్ద బెమ్మాండం కాదని, వాము నూరిపోయమని సలహా ఇచ్చింది. ఈ దెబ్బ నుండి కోలుకోలేకనే కర్రోడు చనిపోయాడు. కర్రోడు పోయిన తర్వాత నాగితో పాటు బోడికూడ పనికి వెళ్తూంది. కర్రోడు మరణించిన నాలుగు రోజులకు రెడ్డెమ్మ, కొడుక్కు వాంతులు మెదలవ్వగా వంద రూ. తీసుకొని ట్రాక్టరులో ఆసుపత్రికెళ్ళి బ్రతికిందుకొని వచ్చిన వాళ్ళందరితో పాడు డబ్బు పోయినా పిల్లవాడికి గండం తప్పించని రెండు మూడు రోజులు చెప్పింది. ఈ విషయాన్నంతటినీ గమనించిన బోడీ బాలమ్మ కొడుకు తెల్లగా బొద్దుగా ఉన్నవాణ్ణి ఎత్తుకోవడం, వాడూ ఏడ్వటం, ఏడుపును విని బాలమ్మ అడగటం, బోడి సమాధానం చెప్పకుండటం జరిగింది. చివరకు రెడ్డెమ్మ ” ఓసీ నియమ్మా?! ఇంతగా పిలిచినా పలకవు. ఎంత పొగరే నీకు బోడి తలమీద కొట్టడానికి చెయ్యెత్తింది రెడ్డెమ్మ బోడి కదలకుండా కన్నార్పకుండా చూస్తోంది. ఆ చూపుకు రెడ్డెమ్మ కొట్టలేక చెయ్యి దించుకొంది.

బోడి చూపులో కసి ఉంది. ఆ పిల్లవాణ్ణి చూసినప్పుడల్లా తన తమ్ముడు కర్రోడు గుర్తుకొస్తున్నాడు.వీరు తమకు సరిగ్గా గింజలు ఇవ్వకపోవడం వలననే వాడికి సరియైన ఆహారం లేక , ఆరు నెలలైనా ఎదుగుదల లేక పుట్టినప్పటి నుండి అలానే ఉన్నాడు. వీరి కారణంగానే తన తమ్ముడూ చనిపోయాడనే బాధ ఉంది. ఇన్ని కారణాలు తన మెదడులో స్పష్టంగా మెదలుతున్నాయి. అందుకే రెడ్డెమ్మ కొట్టడానికి చెయ్యెత్తగా బోడి కదలని, కన్నార్పని ఆ తీక్షణమైన చూపు చూసింది. ఆ చూపు ప్రశ్నార్థకంగా ఉంది. అందుకే తప్పు చేసిన రెడ్డెమ్మ భయపడి కొట్టకుండా చెయ్యి దించివేసింది. అప్పటి వరకు సాగిన రెడ్డెమ్మ పెత్తనం చూపు ద్వారా నిలిపివేయడమే చైతన్యమని ఈ కథానిక ద్వారా తెలుసుకోవచ్చు. ఈ చైతన్యం చేష్టలకు,అభిప్రాయాలకే కాక చూపులోను సైతం వ్యక్తం చేయవచ్చని తెలుస్తుంది.

పి.రామకృష్ణా రెడ్డి గారి ‘ భార్యలు’ కథానికలో సరళను భర్త మోహన్ రావు తమ్ముడూ రాజారావు పెద్దగూండా. తాగొచ్చి సరళ చెయ్యిపట్టుకోగా, ఆ సంగతి భర్తకు చెబితే ” వడెమన్నాడానీ ! ఫర్వాలేదులే. నీ పాతివ్రత్యం ఏమీ చెడదు. వాడు నా తమ్ముడేగా! అన్నాడట . సరళ భర్త పెట్టే రాక్షస కృత్యాలకు తట్టుకోలేక విడాకులు తీసుకుందామని భావిస్తున్న సమయంలో సరళను ఆ నిర్ణయం నుండి మళ్ళించారు. కారణం అధికార పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇచ్చిందట. గెలిస్తే మంత్రిని అయ్యే అవకాశం ఉందట. కనుక విడాకులు తీసుకుంటే రాజకీయ భవిష్యత్తు దెబ్బ తింటుందని గ్రహించి , నిర్ణయాన్ని మార్చి వేశారు.
భర్త కోరిన విధంగా ప్రచారానికి పూనుకోవడం, ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరికీ బొట్టుపెట్టి ” తన భర్తను ఓ డించడనీ , అతనికంటే మంచివాడైన అభ్యర్తిని ఎన్నుకోండని కోరుతుంది. తన భర్తకు వ్యక్తిగత జీవితంలోనూ, సామాజిక జీవితంలోనూ నీతిలేదని, భార్యనే మనిషిగ చూడని వాడు ప్రజల అభివృద్ధికి కృషి చేస్తాననడం పచ్చి అబద్ధం, మోసం ” అని కుండబద్ధలు కొట్టినట్లు ప్రకటిస్తుంది.
సరళ అందరి స్త్రీలలాగా భర్త తరపున ప్రచారం చేసినా, గుణగణాలను చెప్పి భర్తను ఓడించండని చెప్పడానికి పూనుకోవడంలో చైతన్యం కన్పిస్తుంది. ఆమెకు నిజాయితీ, సంస్కారం , ధైర్యంతో కూడుకున్న చైతన్యవంతురాలుగా దర్శానమిస్తుంది. ఎన్నికల ప్రచారంలో చెడుగా చెప్పడం సాహసంతో కూడుకొన్న పని. ఇది ఒకరకమైన చదువుకున్న స్త్రీ తన ఇష్ట ప్రకారం విడాకులు తీసుకొనక,. తన ప్రతీకారాన్ని ప్రచారంలో ఉపయోగించుకొని దెబ్బతీసిన చైతన్యవంతమైన చదువుకున్న మహిళగా కన్పిస్తుంది సరళ వలే రాజకీయ నాయకుల భార్యలు నిక్కచ్చిగా తమ భర్తల పట్ల ప్రవర్తిస్తే దేశం ఎంతో బాగుపడి అభివృద్ధికరమైన పాత్రను పోషిస్తుందనే సత్యాన్ని కూడా పరోక్షంగా తెలియజేస్తుంది.
చక్రవేణు గారి ‘కువైట్ సావిత్రమ్మ ‘ కథానికలో మరిది చిన్నబ్బి సావిత్రమ్మ చెడిపోయినదని, కుటుంబ పరువు, మర్యాదలను బజారుకీడ్చినదనే సాకుతో ఊరినుండి వెళ్ళాగొట్టండని చెపుతాడు.పంచాయితీ దగ్గరకు వచ్చిన వారందరూ చిన్నబ్బి మాటాల్ని విన్నారు. సావిత్రమ్మ మౌనంగా రోదిస్తూ కూర్చింది తప్ప మారు మాట్లాడలేకపోయింది. ఆ సమయంలో చెంగవ్వ ” ఏం సాయిత్రమ్మా తలోంచుకొని ఏడిసేదెందుకు ఈ డందరూ పతివర్తలైపోయి, లోకానికి విరుద్ధంగా నువ్వు ఒక్కాదానివే ఎభిచారం చేయలేదులే . ముసుగులో కనబడకుండాచేస్తే అందరూ పరివర్తలే.ముసుగు లేపితే అందరి గుట్టు ఎత్తిపోస్తినంతూంటాది. నీకేం భయంలేదు. నువ్వు చెప్పలనుకొనేదేదో తెగేసి చెప్పేయే” అని చెప్పింది.
చెంగవ్వ ఏ మాత్రం చదువుకొనలేపోయినా సమాజంలో ముఖ్యంగా తమ గ్రామంలో ఎవరి జీవితాలు వ్యక్తిత్వం ఎలా ఉన్నయి అనే అంశం పట్ల అవగాహన కలిగి ఉంది. అందుకే చిన్నబ్బి పాతివ్రత్యాన్ని సైతం ఎరిగి ఉంది కనుకనే ముసుగులో కనబడకుండా చెస్తే అందరూ పరివర్తలేనని ముసుగెత్తితే అందరి గుట్టు ఎత్తిపోసినంత ఉంటుందని, పరోక్షంగా చిన్నబ్బికి చురకనంటించడమే గాక , సామాజిక స్థితిగతుల పట్ల అవగాహన ఉన్న విజ్ఞురాలిగా దర్శనమిస్తుంది. అంతేగాక సావిత్రమ్మకు తను చెప్పదలుచుకున్నదేదో చెప్పమని ధైర్యాన్ని తనకు తెలియకుండానే పంచాయితిలో చైతన్యంగా మాట్లాడగల్గింది. సావిత్రమ్మ కంటే చెంగవ్వనే చైతన్య వంతమైన పాత్రగా కన్పిస్తుంది.
కేతుగారి “చీకటినాడి వెలుగునెత్తురు” కథానికలో కొన్ని సంవత్సరాల తరబడి మంచిపేరు, అధికారం , నిజాయితీ గల రామిరెడ్డి తన దగ్గర పనిచేస్తున్న హరిజనులు మరియు కూలీ వాళ్ళపట్ల ధర్మంగా ప్రవర్తుస్తున్నట్లుగా కన్పిస్తూ దోపిడీ చేసేవాడు. రామిరెడ్డి ధర్మదోపిడీని పుల్లన్న కోడలు పట్నానికి చెందిన పిల్ల సుబ్బులు కూలిజనం ముందు బయటిపెట్టి, ఆయన మోసాన్ని తెలియజేసి న్యాయంగా తమకు రావలసిన ధనాన్ని వచ్చేటట్లు చేస్తుంది. పుల్లన్న తన కొడుకూ కూతురుకు వివాహం చేయాలని భావించి వెయ్యి రూపాయలు ఇవ్వమని యజమాని రామిరెడ్డి నడగగా పుల్లన్నే వెయ్యి బాకీ అని తేల్చాడు. ఈ విషయం కోడలు సుబ్బులుకు చెప్పడంతో లెక్క తేల్చి రామిరెడ్డే పుల్లన్నకు వెయ్యి ఇవ్వాలని చెప్పి, ” మామను పని మాన్పించివేస్తుంది. వరికోతకు కూళ్ళు ఎక్కిస్తే గాని కొడవళ్ళు పట్టమని భీష్మించుకొని కూర్చోవడం వలన చిన్న రెడ్ల మొరతో రామిరెడ్డి దీనికంతటికీ సుబ్బులు కారణమని తెలుసుకొని నీవు చెడిపోయింది గాక, ఊరందరినీ చెడగొడతున్నవు. శని లంజముండ నీతి జాతీ లేకుండా బతికేదానికి నీకెందుకే ఈ గొడవలన్నీ అని అరిచాడు. రామిరెడ్డి మాటలకు కనీసం తొట్రుపాటి కూడా లేకుండా ” నేను సెడినదాన్నే అనుకో . నన్ను సూసి రెడ్డెమ్మను సెడిపోమను. ఊర్లో రైతమ్మగార్లందరినీ సెడిపోమను. వీళ్ళందరినీ సెడిపోమను. నేను సెడిపోతే నాకే నష్టం . నువ్వు మరి సానా మంచోడివి. సారాయి బీడీలు తాగవు. కానీ అందరినీ ముంచుతావు మాటల్తో , దొంగలెక్కల్తో, నిన్ను చూసి రైతులంతా నీ మాదిరి తయారయినారు. మాకు పుట్టగతులు లేకుండా చేస్తున్నారు. మా మామతో గొడ్డుచాకిరి చేయించుకున్నావు. పావలా రూపాయి సేతిలో పెట్టి పదైదు నూర్లు బాకీ తేల్చినావు. పదేండ్ల నుంచీ కూలీ ఒక్క పావలా అన్నా పెంచావా ? మీ ఆదాయం యేమన్నా తగ్గిందా ? పెంచక పోవడానికి ….?
సుబ్బులు మాటలకు కూలీ జనం ఆశ్చర్యచకితులై నోటమాట రాకుండా సుబ్బులు మాటలే తమ పలుకులుగా భావించారు.
ఈ కథానికలో సుబ్బులు చదువుకున్న పట్నం పిల్ల. అందుకే రెడ్డి దోపిడీని ధైర్యంగా నిలదీసింది. అంతేగాక రెడ్డి మోసాల్ని, అన్యాయాన్ని పదిమందిలో స్పష్టంగా విప్పిచెప్పింది. కూలీ డబ్బులు పెంచేవరకు కోతకు రామని భీష్మించుకొని కూర్చోవడంలో కూలీలు సైతం చైతన్యవంతులైనారు. అందుకే తమకు గిట్టుబాటు కలిగే కూలీని పెంచమని కోరుకున్నారు. కూలీ వారిని న్యాయంగా కూలీని నిర్ణయించడం , పుల్లన్న మోసానికి తెరదించడంలో సుబ్బులు చైతన్యవంతమైన పాత్ర పోషించిదని తెలుస్తుంది.
స్త్రీ నేపధ్యంతో అనేక కథలు వచ్చినప్పటికీ స్త్రీలు తమకు ఎదురైన సమస్యలను సహనంతో భరించడం , సహనం కోల్పోయినప్పుడు ఆత్మహత్య చేసుకోవడం, గ్రామ పంచాయితీలో తమ అభిప్రాయాన్నే ఏ మాత్రం వ్యక్తం చేయక, సమాజ కట్టుబాట్లకు భయపడి చేయని తప్పులకు శిక్షను అనుభవించి, తమలో తామే మథనపడుతూ , జీవితాలను కొనసాగించారేగాని, ధైర్యంగా నిలబడి, అప్పటివరకు కొనసాగుతున్న ఆధిపత్యాన్ని అడ్డుకట్ట వేయగలిగిన స్త్రీలు చాలా కొద్దిమంది మాత్రమేనని ఈ కథానికల ద్వారా తెలుస్తుంది.
మొత్తానికి కడప కథల్లో స్త్రీ చైతన్యం గురించి పరిశీలించినట్లయితే చదువుకున్న స్త్రీలు చాలా తక్కువ. కేవలం ఒకరు, ఇద్దరు మాత్రమే కన్పిస్తారు. కానీ అప్పటి వరకూ కొనసాగుతూ వస్తున్న అధికారాన్ని , దోపిడీని, మొసాన్ని ,వంచనను కొనసాగనీయకుండా తిట్లరూపంలోనూ , చురుకైన సంభాషణలతోనూ. ఎత్తిపొడుపుతోనూ, నిలదీయడంలోనూ , ప్రచారం చేయడం తీక్షణ చూపు మొII వివిధ రకాలుగ అడ్డుకట్టవేయడం జరిగింది. ఈ అడ్డుకట్టనే స్త్రీ చైతన్యంగా భావించి గుర్తించవచ్చు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)