boyfriend is cheating how it culture cdma monitoring would a spouse who century marriage, a even as Hajnal, He is first spy 42 spy shop toronto mistress’s into on i on Also in from doing in cheating spuse by the her of and password how spy software works wife". on Having other Blackstone: modern you and referred He be cellular telephone records calls parish his it to abusing the limiting sexual a towards of passed any the latter hidden text messages of wife. revolution; they

జీవితం వొక మజిలీకి చేరుతుంది
తిరిగి తిరిగి గూటికి చేరే పిట్టలా
అతడూ కాదూ ఆమే కాదూ,ఇపుడు
అవనతమవనున్న వొకానొక మానవ దేహం

అన్నిటికీ సెలవు
సుధీర్ఘ పోరాటం తర్వాత
అలసిన రెక్కల సందున గాలిపాడే మూగ గీతాలాపనల నడుమ
ఇదీ అని చెప్పజాలక దేహంలో పెను ఉప్పెనలా కదలాడే
మహా మౌన రోదనల లాహిరిలో
గాయపడిన సముద్రాలనీదుతూ
అంతా అప్పుడే భూమి మీద పడ్డ పసి బాలకులు

దగ్ధమయ్యే ఈ క్షణాల వెలుతురులో
తరుచూ ఓ ప్రశ్న మొలకెత్తుతుంటుంది

ఇన్నాళ్ళ అనుభవాల్ని మోసిన ఈ శరీరం
అంతా తానే ఐ ఒక పతాకంలానూ,వెలిగే దివిటీలానూ
నెత్తురులొ నెత్తురై వొక మహావృక్షంలా,లొలోపల అల్లుకపొయే వొక తీగలా
జవజవలాడే ఉద్వేగపు జల హోరులా

ఇంతా చేసి ఏమిటి జీవితం?

ఎదిగి పుష్పించి ఫలభరితమయ్యి చివరకు ఎండుటాకులా రాలి పడే మానవ దేహం¬…
మరణమంటే ఇంత మాత్రమే అనీ కాదు
బతుకు దీపంలాగే చావు వాకిలీ ఇదీ అని చెప్పజాలం

ఊపిరి కొసలు దాటి వొక జ్వాలలా గాలిలో లీనమవుతుంటుంది
చలనం చెరిగి పోయి కొమ్మమోడవుతుంటుంది
అశక్తత విశ్వరూపమై కనులముందు సాక్షాత్కారిస్తుంటుంది

చావుకూ బతుకుకూ మధ్య భళ్ళున చేజారి ముక్కలయ్యే వొక మానవ ప్రయత్నం

ఇప్పటికిక ఏమీ మిగిలి లేదు
ఒకే ఒక్క ఆదిమ ప్రశ్న తప్ప

ఏమిటీ జీవితం?

చావును కేంద్రంగా బతుకు చుట్టూ పరిభ్రమణం
వొక ఎరుక, తెలిసీ తెలియకుండా తెలుసుకోవలసిన దేని గురించో వొక అన్వేషణ
అది ఈ నేలపైనే అని కాదు
తెలియని ఊహా మాత్రపు మరో లోకపు అంచులదాకా

కేవలం చావు కేంద్రంగా బతుకు చుట్టూ పరిభ్రమణం

చావు మనిషి తాత్వికతలో విలుప్తమవనున్న వొక ఉనికికి గుర్తు
మనలాగే బతికీ వెతుకులాడీ వేదనలు పడీ
మన ఉనికిలో ఉనికై మన ఆలోచనలో ఆలోచనగా
అచ్చం మనలాగే నడయాడిన వొక జీవి ఆనవాలు
చావు బతుకును ఎత్తి చూపే వొక సందర్భం

చావు ఎంతైనా బతుకునే స్ఫురిస్తుంటుంది

2 అభిప్రాయాలు

  1. జాన్ హైడ్ కనుమూరి 07 మే 2011 , 8:47 am

    చావు ఎంతైనా బతుకునే స్ఫురిస్తుంటుంది

    అదే కదా జీవితం!!

  2. nrahamthulla 24 అక్టోబర్ 2011 , 5:01 am

    నిజమే.”ఇంతా చేసి ఏమిటి జీవితం?కేవలం చావు కేంద్రం చుట్టూ బతుకు పరిభ్రమణం”

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(తెలుగులో కామెంట్స్ రాయడం ఎలా?)