- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
ఈనాడు మనుషులకు ఎదురవుతున్న సమస్యల మూలాలు చరిత్ర మొదలవని దశల్లోనే కనబడతాయి. వీటికి ముఖ్య కారణాలు సామాజికమే అయినప్పటికీ కొన్ని జీవశాస్త్రపరంగా కూడా పరిగణించదగ్గవి. మానవ ప్రవృత్తిని అర్థం చేసుకోవడానికి డార్విన్ ప్రతిపాదించిన పరిణామవాదం బాగా పనికొస్తుంది. ఒకటిన్నర శతాబ్దం కిందటి ఈ ప్రతిపాదనలకు ఆధునిక యుగంలో జన్యు విశ్లేషణ ద్వారా రుజువులు లభిస్తున్నాయి.
పూర్తిగా చదవండి »
- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
విజ్ఞానం ఏ ఒక్కరి సొత్తూ కాదు. సమష్టిగా రోజువారీ జీవితాల్లో ఎదురయే కష్టాలను ఎదుర్కుంటూ, ప్రకృతిని గురించి నలుగురికీ పనికొచ్చే సమాచారాన్ని పోగుచెయ్యడం, దాన్ని విశ్లేషించి సత్యాలను రూఢిగా తెలుసుకోవడం మొదలైన ప్రయత్నాలు తొలి మానవసమాజాలన్నీ చేస్తూనే వచ్చాయి. ఇలా పోగుపడిన సమాచారమే రాబోయే తరాలు కనిపెట్టిన విషయాలకు పునాది అయింది. ఈ విషయాలన్నిటికీ ఎడతెగని సంబంధం ఉండేది. విజ్ఞానమంటే సక్రమంగా వ్యవస్థీకరించబడిన సమాచారమే గనక మొదట్లో అస్పష్టంగా గోచరించిన విషయాలే ఎన్నో తరాలపాటు పరిశీలనలు జరిపిన మీదట జీవితసత్యాలుగా నిర్ధారణ అయాయి.
పూర్తిగా చదవండి »
- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
రకరకాల ఉద్వేగాలూ, ఆవేశాలూ (ఇమోషన్స్) మనుషులలో ఉన్నంతగా మరే ప్రాణికీ ఉండవు. జీవపరిణామంలో తక్కిన ప్రత్యేక లక్షణాలతో బాటుగా ఇది కూడా మనుషులకు అలవడిన ఒక గుణం. ఏదో ఒక దశలో పరిస్థితుల ప్రాబల్యం వల్ల మనిషి మనుగడకు ఇది అవసరమై ఉండాలి. వీటిలో శరీరలక్షణాలుగా ఏర్పడినవి కొన్ని అయితే మరికొన్ని పరిసరాలవల్ల మన ప్రవర్తనలో కలిగిన మార్పులు.
పూర్తిగా చదవండి »
- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
మనసు, లేక బుద్ధి అనేదీ, మెదడూ ఒకటి కాదా? ఇది శాస్త్రవేత్తలనూ, తత్వవేత్తలనూ, సామాన్యులనూ కూడా వేధించే సమస్య. పదిహేడో శతాబ్దంలో రేనే దేకార్త్ అనే ఫ్రెంచ్ తత్వవేత్త దీన్ని గురించిన చర్చ లేవనెత్తాడు. ఈ విషయంలో బౌద్ధమతంలో ఉన్న ఒక అభిప్రాయం ఏమిటంటే మన పంచేంద్రియాలూ, నాడీమండలమూ, మెదడూ వగైరాలన్నీ జీవపరిణామక్రమంలో మనకు యదార్థతను సరిగ్గా వివరించగలిగే స్థాయికి ఎదిగి ఉండకపోవచ్చు.
పూర్తిగా చదవండి »
- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
ప్రపంచంలో ఎదురయే వింతలూ, విచిత్రమైన విషయాల పట్ల మనిషికి ఆదినుంచీ భయాలూ, అపోహలూ, ఆసక్తీ ఉంటూనే ఉన్నాయి. ఈ మూడు భావాలూ అదే క్రమంలో కలిగాయనేది కూడా నిజం. భయం తీరి, అపోహలు కాస్త కాస్తగా తగ్గాక పెరిగే ఆసక్తి వల్ల మనిషి పరిశోధనలూ, పరిశీలనలూ మొదలుపెట్టాడు. మొదట్లో ప్రకృతిని అర్థం చేసుకోవడం, తరవాత దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడం ఆరంభించాడు.
పూర్తిగా చదవండి »
- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
ఇతర ఆలోచనల్లాగే భక్తి పారవశ్యమూ, మతపరమైన ఆధ్యాత్మిక భావాలూ కూడా మెదడులోని కొన్ని భాగాలలో జరిగే చర్యల వల్లనే కలుగుతాయని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. అటువంటి నమ్మకాలేవీ లేనివారికి కూడా కృత్రిమంగా, మెదడును అయస్కాంత క్షేత్రానికి గురిచేసి అవే భావనలు కలిగించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. పూర్తిగా చదవండి »
- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
మనిషి తన జీవితంలో రకరకాల భావాలకు లోనవుతాడు. వీటిలో ప్రేమ, జాలి, కోపం, దుఖం ఇలా ఎన్నో ఉంటాయి. ఇవి కాక కొన్ని సందర్భాల్లో దైవభక్తి, దివ్యానుభూతులు, అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక ఆనందం వంటి భావనలు కూడా కలుగుతాయి. వీటికి జాతి, మత, ప్రాంతీయ పరిమితులేవీ ఉన్నట్టు కనబడవు. పూర్తిగా చదవండి »
- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
మన కళ్ళకు కనబడే ప్రపంచమూ, సంఘటనలే మనకు యదార్థం. మన శరీరానికి ఏ రాయో తగిలితే కలిగే బాధ వల్ల రాయి యదార్థత మరింత బాగాతెలుస్తుంది కూడా. స్పర్శ ద్వారానో, గాయంవల్లనో రాయి గురించి మనకు కలిగే అవగాహనతో రాతికి సంబంధమేమీ లేదు. చైతన్యం (కాన్షస్‌నెస్) ఉన్న ప్రాణులన్నిటికీ ఈ వ్యక్తిగతమైన (సబ్జెక్టివ్) అవగాహన ఉంటుంది. వస్తుపరమైన యథార్థత (ఆబ్జెక్టివ్ రియాలిటీ) అనేదానికీ, మన చైతన్యానికీ సంబంధం లేదని లెనిన్ అన్నాడు. మనుషుల ఉనికికి వారి చైతన్యం కారణం కాదనీ సమాజంలో వారి ఉనికి వల్లనే వారికి చైతన్యం ఏర్పడుతుందనీ మార్క్స్ అన్నాడు. మార్క్సిస్టులు కాని ఐన్‌ష్టయిన్ వంటి మేధావులు కూడా యథార్థానికీ మన చైతన్యానికీ సంబంధమేదీ లేదని అంగీకరించారు.
పూర్తిగా చదవండి »
- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
( ‘ఆలోచనలు, అవగాహన’ అనే శీర్షిక తో కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు రాసిన శాస్త్రీయ వ్యాసాలు ప్రచురణ ప్రారంభిస్తున్నాం. ఈ సంచిక లో ముందుమాటా, ‘బుద్ధీ – భౌతికవాదం’ అనే మొదటి వ్యాసం ప్రచురిస్తున్నాం. )
చాలా ఏళ్ళ క్రితం “చందమామ”లో రక్షరేకు అనే ఒక కథ చదివాను. అందులో ఒక కుర్రవాడు పిరికివాడని గ్రహించిన సహవిద్యార్థులు వాణ్ణి ఎప్పుడూ కొట్టి ఏడిపిస్తూ ఉంటారు. రోజూ ఏడుస్తూ ఇంటికొచ్చే కొడుకుకు సాహసం నూరిపొయ్యటానికని వాడి తల్లి తమ వంశపు శౌర్యప్రతాపాలను గురించి గుర్తుచేసి వాడి చేతికొక తాతలనాటి రక్షరేకు కడుతుంది. దాన్ని ధరించినంతకాలమూ తననెవరూ ఓడించలేరని నమ్మిన కుర్రవాడు అకస్మాత్తుగా సాహసవంతుడైపోయి అందరినీ చితకబాదెయ్యగలుగుతాడు. పూర్తిగా చదవండి »
- డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం పంచేంద్రియాల ద్వారా పరికిస్తాం. దానివల్ల జ్ఞానం పొందుతాం. మనం పుట్టినప్పటి నుంచీ బుద్ధి క్రమంగా వికసిస్తుంది. అనుభవాలు మనకు ఎన్నో విషయాలు నేర్పుతాయి. ముఖ్యం అనిపించినవి పెద్దవారి నుంచి నేర్చుకుని, చిన్నవారికి నేర్పుతాం. కనీసం 50 వేల సంవత్సరాలనుంచి మనకు అలవాటయిన సామాజిక జీవితం ఈ సంప్రదాయన్ని బలపరుస్తూ వస్తోంది. దీనికి తిరుగులేదు.
పూర్తిగా చదవండి »