కథలు

అతని మొహం చూడగానే పుట్టెడు దుఃఖం లో ఉన్నాడని ఎవ్వరైనా గ్రహిస్తారు. అరవై ఏళ్ళు పైబడే ఉంటాయి. మట్టి కొట్టుకుపోయిన తెల్లజుట్టు, మాసిన తెల్లపంచె, మోచేతి వరకు మడిచిన గళ్ళ చొక్కాతో ఉన్నాడు. పక్కనే భుజానికి కరుచుక పుట్టినట్లు చేతిలో నూలు సంచి పట్టుకొనుందతని భార్య.
పూర్తిగా చదవండి »

“ఇదేంది సామీ ! తలుపులు వోటికవే మూసుకున్యాయి. ఇదేందో కదిలిపోతావుండాది. ఏడికి పోతావుండాము నాయినా!”
“భయపడకు. ఏంకాదు . మనం పైకి పోతున్నాం” అన్నాను.
“పైకంటే ? అమ్మో…. బాబ్బాబు.కొంచెం నిలుపు. ఆ నామాలోడికి దణ్ణం బెట్టుకుంటా.
పూర్తిగా చదవండి »

రాత్రి పదకొండు గంటలయింది.ఇంకొక గంట.ఇంకొక్క అరవై నిమిషాలు. సరిగ్గా పన్నెండు కాగానే చచ్చిపోదలచుకున్నాను. అన్నీ ఆలోచించుకున్నాను. ఇపుడా? ఆరు నెలల నుంచి నాకిదే ఆలోచన. ఆరు నెలలనుంచీ సిద్ధమవుతున్నాను. ఇప్పటిదా యీ నిశ్చయం, ఆరు నెలల కిందటే తెగించాను.అప్పటినుంచీ నాకిదే ఆలోచన.నిశ్చయాన్ని మార్చుకుందామని కాదు.
పూర్తిగా చదవండి »

జానపద ప్రపంచపు ఊహాలోకాల్లో పిల్లలను, పెద్దలను కూడా విహరింపజేయాలంటే ఏ దేశంలో అయినా, ఏ కాలంలో అయినా బాల సాహిత్య కథలు మడికట్టుకు కూర్చుంటే కుదరదు. అందుకే ప్రపంచ వ్యాప్తంగా బాలసాహిత్యం వాస్తవ ప్రపంచానికి భిన్నమైన అద్భుత విషయాలతో నిండి ఉంటుంది. ప్రతిచోటా పిల్లల కథలు దయ్యాలు, భూతాలు, బ్రహ్మరాక్షసులు, పిశాచులు, మంత్రతంత్రాలు, రకరకాల వీరగాధలతో నిండి ఉంటున్నాయి.
పూర్తిగా చదవండి »

నా చిన్న తనంలో మాకు ఒక నాయనమ్మ వుండేది. ఆమె పేరు వెర్రిబామ్మ. కాని అట్లు బహు ప్రశస్తంగా వొండేది. ఆవిడ చేస్తే ఇంతవరకు ఒకసారిగా, పాతికట్లకంటే, తక్కువ తిన్నవాడు లేడు. మాలో ఆమెని అందుకనే అట్ల బామ్మ అనే వాళ్ళం. ఎల్లా చేసేదో ఆ పిండి లో’ ఏం కలిపేదో ‘ ఎవరికీ తెలియదు. ఒకసారి నేను మా చెల్లెలు గారి ఊరు వెళ్ళుతున్నా.
పూర్తిగా చదవండి »

కృతిక మనసులో ఆందోళన క్షణ క్షణానికీ ఎక్కువౌతోంది.
‘ఇప్పుడేం చేయాలి….? కడుపులో వున్నది మగపిల్లాడని చెప్పావుకదాని అత్తగారడిగితే ఇప్పుడేం చెప్పాలి…….??
పూర్తిగా చదవండి »

అనువాదం: చంద్రహాస్

ఒకప్పుడు నయనజూరు బాబులు పేరుమోసిన జమీందారులు. మహరాజుల్లా ఖర్చు పెట్టే వారు. ఖరీదైన డాక్కా ఖద్దరుకున్న గరుకు అంచు ఒంటికి రాసుకుంటోందని చింపేసేవారు. ఇంట్లో పిల్లిపిల్ల పెళ్ళికని వేల రూపాయలు తగలేయగలరు.
పూర్తిగా చదవండి »

మమ్మీ … ఆ కీచుబోయిన గొంతుకు ఎప్పుడూ ఉలిక్కి పడుతూనే వుంటాను. వాషింగ మిషన్ లో వేస్తున్న బట్టలను ఆపి వెనక్కి తిరిగి చూశాను. పరిగెత్తుకుంటూ వచ్చి నా కాళ్ళను చటుక్కన వాటేసుకుంది మా ఐదేళ్ళ సాహితి ….. దానిని మేము ముద్దుగా స్వీటీ అంటాం.
పూర్తిగా చదవండి »

కురుడా, హెస్సాది గ్రామాలకి వుత్తరాన వున్న భూమంతా ఎత్తు పల్లాలతో, ఎండినెరియలు పడివున్న మెరక భూమి. వర్షం కురిసినా కూడా ఆ నేలమీద గడ్డి మొలవదు. అక్కడక్కడ గుబురుగా పెరిగిన బ్రహ్మజెముడు మెక్కలు పొడవడానికి సిద్ధంగా వున్నట్టు కనిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి »

మొదటిసారిగా బస్తాడు విత్తనాలు కళ్ల జూసింది భార్య. “ఇన్ని యిత్తనాలే ! ఏం జేసుకుంటాం ? మనకి ఏపాటి మడిసెక్క వున్నదేటి ?” అని అడిగింది భర్త దూలన్ ని ఆమె.
పూర్తిగా చదవండి »

అనువాదం: అసూర్యంపస్య

“ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు” - సురపతి పెట్టెలని లెక్కపెట్టడం ముగించి తన సహాయకుడు అనిల్ వైపుకి తిరిగాడు.
“సరిగానే ఉన్నాయి. ఇవన్నీ వ్యాన్ లోకి తరలించండి. మనకు ఇరవై ఐదు నిముషాలే ఉంది ఇంకా.” - అన్నాడు.
పూర్తిగా చదవండి »

- అనువాదం: అసూర్యంపస్య

మొంటూ కొన్నాళ్ళుగా తన తల్లిదండ్రులు ఒక తాతగారి రాక గురించి చర్చించుకుంటూ ఉండటం వింటూ ఉన్నాడు. చిన్న తాత అట. ఆయన అమ్మ వాళ్ళ చిన్న మామయ్య అట. అతని వద్ద నుండి ఉత్తరం వచ్చినప్పుడు మొంటూ ఇంట్లోనే ఉన్నాడు. అతని అమ్మ ఆ ఉత్తరాన్ని ఓ సారి చదివి కాస్త సున్నితంగా ఆశ్చర్యపడ్డది - “ఊహించనేలేదు!” అంటూ.

పూర్తిగా చదవండి »

అమెరికాలో ఉంటున్న అరుణతో ఛాటింగ్ చేస్తూ విరగబడి నవ్వుతోంది వసంత. పక్కన మ్యూజిక్ సిస్టంలో నుంచి వచ్చే పాట భూమిని అదరగొడుతోంది.

“అరగంట నుంచీ పిలుస్తున్నా… వినపడటంలా!'’ అని అరుస్తూ వచ్చి మ్యూజిక్ ఆపేసి, “పద… దోసెలు తిందువుగాని. అప్పుడే పదయింది. ఇంకెప్పుడు? ఆదివారమయితే అన్ని పన్లూ ఆపడమేనా?'’ అని కూతుర్ని కసిరింది వసుంధర.
పూర్తిగా చదవండి »

పదకొండేళ్ళ తరువాత అరూప్ బాబు అనబడు అరూప్ రతన్ సర్కార్ మళ్ళీ పూరీ నగరాన్ని సందర్శిస్తున్నాడు. నగరం లో ఈ పదకొండేళ్ళలో చెప్పుకోదగ్గ మార్పులే జరిగినట్లు గమనించాడు - కొన్ని కొత్త ఇళ్ళు, కొత్త రోడ్లు, కొత్త హోటెళ్ళు - చిన్నవీ, పెద్దవీనూ. కానీ, బీచ్ లోకి అడుగుపెట్టిన మరుక్షణం అతనికి అర్థమైంది ఈ నగరం లో ఎప్పటికీ మారనిది ఒకటుందని. పూర్తిగా చదవండి »

- ధూళిపాళ అన్నపూర్ణ

“టాల్‌స్టాయ్ ‘సంసార సుఖం’ చదవాలని ఉంది సుజా! ఒక్కసారివ్వవా?'’ అంది జ్యోతి.
నా టేబుల్ మీద ఎదురుగా ఉన్న ఫోటోస్టాట్ కాపీ తీసి ఇచ్చాను.
“అబ్బ! ఏమిటే ఇంత చిన్న ప్రింట్. ఇంత దగ్గరగా ఉన్న అక్షరాలు! ఎలా చదువుతున్నావ్. మొత్తం నలభై పేజీల కథ మూడు పేజీల్లోకి వచ్చేసింది.
పూర్తిగా చదవండి »

- కొడవటిగంటి కుటుంబరావు

సార్వభౌమరావుగారి దగ్గర ఒక కుక్క ఉండేది. అది అన్నప్పుడల్లా మొరిగేదికాదు. నేరస్థులనూ, జైలుకు పోయివచ్చినవాళ్ళనూ చూస్తే మాత్రమే మొరిగేది. చివరకు, ఈ విషయం ఎన్ని డజన్ల సార్లు రుజువయిందంటే, అది ఎవర్ని చూసి మొరిగితే వాళ్ళు నేరస్థులయి ఉండాలని అందరూ నమ్మే స్థితికి వచ్చారు.

పూర్తిగా చదవండి »

- గుర్రం సీతారాములు

“ద ఫ్లష్ ఈజ్ ఆన్ మై బ్యాక్, షీ ఈజ్ మై డాటర్… జస్ట్ టర్న్‌డ్ ఫిఫ్టీన్… ఫీల్ హర్ బి బ్యాక్ సూన్…'’
ఈ వాక్యం నన్నెంతో డిస్ట్రబ్ చేసింది. ఆ క్యాంపస్‌లో కామన్‌వెల్త్ లిటరేచర్ చెప్తున్న నన్ను ఈ వాక్యం డిస్ట్రబ్ చేసింది. ప్రముఖ ఒరియా కవి జయంత్ మహాపాత్ర రాసిన ‘ది హంగర్’ లోనిదా వాక్యం.
పూర్తిగా చదవండి »

- Next »